పిఎంఇండియా
ఈ కింది అంశాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది:-
1. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు అవసరమైన వస్తువులు, సేవలను సమకూర్చేందుకు 2013 సంవత్సరపు కంపెనీల చట్టం లో భాగమైన 8వ సెక్షన్ కంపెనీగా నమోదు చేసేటట్లుగా నేషనల్ ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ ను స్పెషల్ పర్పస్ వెహికల్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిని గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (జిఇఎమ్ ఎస్ పివి) గా వ్యవహరించనున్నారు. ఈ జిఇఎమ్ ఎస్ పివి.. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సిపిఎస్ యులు & ఎస్ పిఎస్ యులు), స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు మరియు స్థానిక సంస్థల కోసం ఎండ్-టు-ఎండ్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది.
2. డిజిఎస్ & డి ని 2017 అక్టోబరు 31 కల్లా ఎత్తివేస్తారు; డిజిఎస్ & డి విధులు అంతమవుతాయి. ఒకవేళ డిజిఎస్ & డి ని 2017 అక్టోబరు 31 కల్లా ఎత్తివేయడం సాధ్యపడకపోతే గనక, ఆ విభాగం ముగింపు తేదీని తగిన కారణంతో మహా అయితే 2018 మార్చి నెల 31వ తేదీ వరకు మాత్రమే పొడిగించేందుకు అవకాశం ఉంటుంది.