Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గాంగ్‌టక్ ఆర్కిడేరియమ్‌ సందర్శన సందర్భంగా సిక్కిమ్‌ అసాధారణ జీవవైవిధ్యాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి

గాంగ్‌టక్ ఆర్కిడేరియమ్‌ సందర్శన సందర్భంగా  సిక్కిమ్‌ అసాధారణ జీవవైవిధ్యాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి


సిక్కిమ్‌లోని గాంగ్‌టక్ లో ఉన్న ఆర్కిడేరియమ్‌ను  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. అక్కడి శోభతో పాటు, సిక్కిమ్‌లో అసాధారణ జీవవైవిధ్యాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
ఆర్కిడేరియమ్ సందర్శన తనను ముగ్ధుడిని చేసిందని ప్రధానమంత్రి వర్ణించారు. అంత అంకిత భావంతో చేపడుతున్న సంరక్షణ ప్రయత్నాలు ప్రకృతితో చాలా గాఢమైన అనుబంధాన్ని మనం కలిగి ఉన్నామన్న సంగతిని ఎంతో చక్కగా ప్రతిబింబిస్తున్నాయని శ్రీ మోదీ కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు  ప్రకృతితో సద్భావన కలిగి జీవించాలనే  స్ఫూర్తిని  పౌరులకు అందిస్తాయని  ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ –
‘‘గాంగ్‌టక్ లో ఆర్కిడేరియమ్‌ను చూశాను… అక్కడి శోభకు ముగ్ధుడినయ్యాను. సిక్కిమ్‌లోని సుసంపన్న జీవవైవిధ్యం నిజంగానే అసాధారణమైంది. ఇలాంటి ప్రయత్నాలు ప్రకృతితో మనకు ఉన్న ప్రగాఢ సద్భావనకు అద్దం పడతాయి. అవి మనం కూడా సంరక్షణ పట్ల మొగ్గు చూపాలని, సమన్వయం కలిగిన జీవన విధానాన్ని అనుసరించాలనే స్ఫూర్తిని అందిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.

 

***