పిఎంఇండియా
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బాణసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందిన ఘటన పట్ల ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయం అందిస్తోందని శ్రీ మోదీ తెలిపారు.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్-గ్రేషియాను శ్రీ మోదీ ప్రకటించారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బాణసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదం కారణంగా పలువురు మృతి చెందడం అత్యంత విషాదకరం. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయం అందిస్తోంది.
పీఎంఎన్ఆర్ఎఫ్ ద్వారా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్-గ్రేషియా అందజేస్తాం. @narendramodi