Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని వల్సాద్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపం


గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ప్రాణనష్టం జరిగిన ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు. 

‘‘గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం విచారకరం. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన  కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.

 

***