పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్‘ (ఓఎస్ఏటీ) కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, దేశం తన లక్ష్యాల పట్ల కలిగి ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ ప్రారంభోత్సవం ఒక నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. దేశం తాను అనుకున్న బలమైన సంకల్పాలను ఎటువంటి సంకోచం లేకుండా నిరంతరం వాస్తవరూపంలోకి మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. “భారతదేశం ఏదైనా చేయాలని సంకల్పిస్తే, దానిని కచ్చితంగా సాధిస్తుందనడానికి నేటి ఈ కార్యక్రమమే నిదర్శనం” అని శ్రీ మోదీ అన్నారు.
ఐదేళ్ల క్రితం ప్రారంభమైన వ్యూహాత్మక దార్శనికతను గుర్తుచేసుకుంటూ, దేశాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి అంతర్జాతీయ కేంద్రంగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. స్వదేశీ డిజైన్, స్థానిక తయారీ అనే విస్తృత వ్యూహాల ఆధారంగా, దేశంలోని ఈ మూడవ అతిపెద్ద కేంద్రంలో వాణిజ్యపరమైన చిప్ ప్యాకేజింగ్ అధికారికంగా ప్రారంభం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. “మనం డిజైన్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనే ప్రాథమిక మంత్రంతో విజయవంతంగా ముందుకు సాగాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్ వేగవంతమైన అభివృద్ధి కాలక్రమాన్ని గుర్తుచేసుకుంటూ, 2024 లో తానే దీనికి శంకుస్థాపన చేశాననీ, ఆగస్టు 2025 నాటికే చిప్ టెస్టింగ్ వేగంగా ప్రారంభం అయిందనీ ప్రధానమంత్రి ప్రస్తావించారు. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచీ పూర్తి స్థాయి ఉత్పత్తి దశకు చేరుకోవడానికి పట్టిన ఈ అత్యంత వేగవంతమైన ప్రయాణానికి ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న అనేకమంది అసోసియేట్ల అలుపెరగని అంకితభావం, ఏకాగ్రతలే ప్రత్యక్ష కారణమని ఆయన కొనియాడారు. “శంకుస్థాపన నుంచి ఉత్పత్తి దశ వరకు సాగిన ఈ అద్భుతమైన ప్రయాణం కచ్చితంగా ఎంతోమంది సహోద్యోగుల అపారమైన కష్టానికి లభించిన ఫలితమే” అని శ్రీ మోదీ అన్నారు.
సభను ఉద్దేశించి ప్రసంగించడానికి కొన్ని క్షణాల ముందు తాను జరిపిన వ్యక్తిగత సంభాషణలను ప్రస్తావిస్తూ, ఆ కేంద్రంలో పనిచేస్తున్న అంకితభావం గల సిబ్బందితో మాట్లాడిన అనుభవాలను ప్రధానమంత్రి పంచుకున్నారు. ప్రదర్శనను సందర్శించిన సమయంలో అనేక మంది యువ నిపుణులతో నేరుగా మాట్లాడిన ఆయన, వారి ఉత్సాహం, ఆశావాదం, సానుకూల దృక్పథాన్ని ప్రశంసించారు. “ఈ రోజు నేను కలిసిన ప్రతి యువ సహోద్యోగి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
కొత్తగా ప్రారంభించిన ఈ కేంద్రాన్ని అంతర్జాతీయ భాగస్వామ్యానికి ఒక దీపస్తంభంగా అభివర్ణిస్తూ, స్వదేశీ, జపాన్ థాయ్‌లాండ్ పరిశ్రమల భాగస్వాములను అనుసంధానించిన ఉమ్మడి ప్రయత్నాలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ వెంచర్‌ను కేవలం ఒక సాధారణ వాణిజ్య సంస్థగా మాత్రమే కాకుండా, సాంకేతిక విశ్వసనీయతకూ, సరిహద్దులు దాటిన భాగస్వామ్యానికీ ఒక బలమైన నమూనాగా ఆయన అభివర్ణించారు. “ఈ సమగ్ర భాగస్వామ్యం భారత సెమీకండక్టర్ ప్రయాణానికి పూర్తిగా సరికొత్త గమనాన్నీ, వేగాన్నీ ఇవ్వబోతోంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
గత రెండేళ్ళ మూడు నెలల కాలంలో సాధించిన అపారమైన పురోగతిని ప్రస్తావిస్తూ, ఏటా 20 కోట్ల యూనిట్లను సరఫరా చేయగల సామర్థ్యం ఉన్న వాణిజ్యపరమైన ఉత్పత్తి దశకు చేరుకోవడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఏటా 500 కోట్ల యూనిట్ల ఉత్పత్తిని చేరుకోవాలనే ఈ బృందం భారీ లక్ష్యంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, దేశవ్యాప్త సాంకేతిక కార్యక్రమం పుంజుకుంటున్న వేగమే ఈ శీఘ్ర పురోగతికి కారణమని ఆయన పేర్కొన్నారు. “దీనిని అడుగు మీద అడుగుగా, ఇటుక మీద ఇటుకగా, చిప్ తరువాత చిప్‌గా నిర్మించినందుకు మొత్తం బృందాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్నీ, దేశం మొత్తాన్ని నేను అభినందిస్తున్నాను” అని శ్రీ మోదీ అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల నిపుణులు, యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రపంచ పారిశ్రామిక చరిత్ర నుంచి కొన్ని కీలక పాఠాలను ఉదహరించారు. నిజమైన తయారీ సామర్ధ్యం ఏ ఒక్క ఫ్యాక్టరీ వల్లనో రాదనీ, సిలికాన్ వ్యాలీ, సిన్చు సైన్స్ పార్క్, సుకుబా సైన్స్ సిటీ వంటి ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక కేంద్రాలు అన్ని సదుపాయాలు ఒకేచోట ఉండే సమగ్రమైన, సమీకృత వ్యవస్థలను అభివృద్ధి చేయవలసిన అత్యంత ఆవశ్యకతను ఆయన ప్రముఖంగా వివరించారు. “ఈరోజు, అలాంటి శక్తిమంతమైన క్లస్టర్లను స్థాపించే దిశగా సనంద్ తన అడుగులను బలంగా వేస్తోంది” అని శ్రీ మోదీ అన్నారు.
ఈ ప్రాంతంలో కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే మైక్రాన్, కేన్స్, సీజీ సెమీ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తిని ఏకకాలంలో ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ, దేశీయంగా ఒక బలమైన వ్యవస్థ ఎంత వేగంగా రూపుదిద్దుకుంటోందో ప్రధానమంత్రి వివరించారు. రాబోయే రోజుల్లో ప్రత్యేక రసాయనాల తయారీదారులు, టెస్టింగ్ ల్యాబ్‌లు, డిజైన్ సెంటర్లు, సరికొత్త స్టార్టప్‌లు ఇక్కడికి వస్తాయని ఆకాంక్షిస్తూ, స్థానిక పరిశ్రమలు విస్తృతమైన ఆర్థిక, ఉపాధి అవకాశాలను ఏ విధంగా రెట్టింపు చేస్తాయో వివరించారు. “ఒక పరిశ్రమ మరో పది పరిశ్రమలకు జన్మనిచ్చి, చివరికి ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థనే మార్చివేసే క్లస్టర్ అసలైన శక్తి ఇదే” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఈ రంగానికి సంబంధించిన అపారమైన దేశవ్యాప్త, అంతర్జాతీయ ఉత్సాహాన్ని ప్రస్తావిస్తూ, ఈ వేగవంతమైన వృద్ధి ఏదో అకస్మాత్తుగా జరిగిన వివిక్త పరిణామం అనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రధానమంత్రి సరిచేశారు. ప్రస్తుత ఈ విస్తరణ అనేది వాస్తవానికి గత పదేళ్లుగా అమలు చేస్తున్న దీర్ఘకాలిక సాంకేతిక విధానాల నుండి క్రమపద్ధతిలో రూపుదిద్దుకున్న ప్రగతి అని ఆయన వివరించారు. “గత దశాబ్ద కాలంలో భారతదేశంలోకి వచ్చిన ఎలక్ట్రానిక్స్ విప్లవానికి ఇది ఒక సహజమైన తదుపరి అడుగు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ రంగం. పట్ల పెరుగుతున్న విస్తృత దేశీయ అంతర్జాతీయ ఉత్సాహాన్ని ప్రస్తావిస్తూ, ఈ వేగవంతమైన వృద్ధి ఏ ఒక్క సంస్థ వల్ల కాదని, ఇది గత పది సంవత్సరాలుగా దీర్ఘకాలిక సాంకేతిక విధానాల ఆధారంగా జాగ్రత్తగా ప్రణాళిక చేసిన పురోగమనమేనని ఆయన వివరించారు. “గత దశాబ్దంలో భారత్ లో వచ్చిన ఎలక్ట్రానిక్స్ విప్లవానికి ఇది సహజమైన తదుపరి దశ” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ స్థానిక తయారీ రంగ విజయానికి గల మూలాలను వివరిస్తూ, గతంలో మొబైల్ ఫోన్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన పరిస్థితిని ప్రస్తుత భారీ ఉత్పత్తి వృద్ధితో ప్రధానమంత్రి పోల్చి చూపారు. మొబైల్ ఉత్పత్తి రంగంలో ముప్పై మూడు రెట్ల అద్భుతమైన వృద్ధి నమోదైందని పేర్కొంటూ, మొబైల్ రంగంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద తయారీ, ఎగుమతి దేశంగా భారత్ సాధించిన నూతన స్థానాన్ని ఆయన గర్వంగా గుర్తుచేశారు. ” అంతిమంగా ఇలాంటి అద్భుతమైన విజయాలను సాధించే లక్ష్యంతోనే, మనం మన ప్రయాణాన్ని మొబైల్ ఫోన్ల తయారీతో ప్రారంభించాం” అని శ్రీ మోదీ అన్నారు.
ఇటీవలి కాలంలో దేశీయ తయారీ వ్యవస్థ సాధించిన విస్తృత విజయాన్ని గణాంకాలతో వివరిస్తూ, మొత్తం రంగంలో నమోదైన అద్భుతమైన వృద్ధి రేట్లను ప్రధానమంత్రి పంచుకున్నారు. 2014 నాటి స్థాయితో పోలిస్తే మొత్తం ఉత్పత్తి దాదాపు ఏడు రెట్లు పెరిగిందని, అలాగే మొత్తం ఎగుమతులలో కూడా 11 రెట్ల భారీ వృద్ధి నమోదైందని ఆయన వెల్లడించారు. “మనం మొత్తం ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను విజయవంతంగా, సమగ్రంగా బలోపేతం చేశాం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ప్రభుత్వ వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను మరింత విస్తరిస్తూ, కేవలం వినియోగదారులకు చేరే తుది ఉత్పత్తులలో స్వయంసమృద్ధి సాధించడమే కాకుండా, వాటికి మూలాధారమైన విడిభాగాల తయారీని కూడా చేర్చడమే తమ తుది లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రపంచ సాంకేతికతకు శక్తినిచ్చే చిప్‌లను ఇక్కడే తయారు చేయాలనే నిశ్చయంతో, ప్రారంభం నుంచి ముగింపు వరకు దేశీయంగా ఒక సంపూర్ణ విలువైన వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. “మొదట ఉత్పత్తి, తర్వాత విడిభాగాలు, ఇప్పుడు సెమీకండక్టర్ – ఇది మేక్ ఇన్ ఇండియా తదుపరి కచ్చితమైన దశ” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సెమీకండక్టర్ వ్యవస్థ భవిష్యత్తు దశలను వివరిస్తూ, సరఫరా శ్రేణిని పూర్తిగా సురక్షితం చేయడానికి హైటెక్ సామగ్రి, , కీలక ఖనిజాల లభ్యతలో స్వయంసమృద్ధి సాధించవలసిన అత్యంత ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. డిజైన్ నుంచి ప్యాకేజింగ్ వరకు విస్తరించిన ఒక స్థానిక వ్యవస్థ అవసరమని అన్నారు. కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి అధునాతన విప్లవాల కోసం ఈ స్వదేశీ చిప్‌లను ఉపయోగించుకోవడంలో మన యువతరంపై అపారమైన నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. “పూర్తిగా ‘మేడ్ ఇన్ ఇండియా‘ చిప్‌లను మాత్రమే ఉపయోగిస్తూ మన యువత తదుపరి తరం సాంకేతిక విప్లవాన్ని మరింత వేగవంతం చేయబోతోంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
పారిశ్రామిక రంగంలో ప్రధాన మార్పులు ఎల్లప్పుడూ ఎలా మునుపెన్నడూ లేని విధంగా అపారమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయో చరిత్ర ఆధారాలను చూపుతూ ప్రధానమంత్రి వివరించారు. గతంలో ఐటీ, స్మార్ట్‌ఫోన్ తయారీ రంగాలు తెచ్చిపెట్టిన భారీ అవకాశాలను ప్రస్తుత సాంకేతిక మార్పులతో పోలుస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. “సెమీకండక్టర్, ఏఐ విప్లవాల యుగం రీసెర్చ్, డిజైన్ నుంచి సరఫరా శ్రేణి నిర్వహణ వరకు లెక్కలేనన్ని అవకాశాలను తీసుకువస్తోంది” అని శ్రీ మోదీ అన్నారు.
భవిష్యత్ శ్రామిక శక్తి నిరంతరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలచు కోవడాన్ని సవాలుగా తీసుకోవాలని, నిరంతరం సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం, వినూత్న ఆలోచనలను పదును పెట్టుకోవడంపైనే ఆధునిక సమాజంలో వారి ప్రాధాన్యత పూర్తిగా ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కృత్రిమ మేధ ద్వారా తెరుచుకుంటున్న అపారమైన సరికొత్త అవకాశాలను ప్రస్తావిస్తూ, మున్ముందు రాబోయే ఈ అవకాశాలను అమితమైన ఉత్సాహంతో అందుకోవాలని ఆయన యువతరానికి పిలుపునిచ్చారు. “కొత్త విషయాలను నేర్చుకోవడానికీ, వాటిని ఆచరణలో పెట్టడానికీ లభించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని భారత యువత ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఈ సాంకేతిక పురోగతి వల్ల సమాజంలో కలిగే సమ్మిళిత సామాజిక ప్రభావాన్ని వివరిస్తూ, ఈ కొత్త కేంద్రంలో చురుగ్గా పనిచేస్తున్న గిరిజన తెగలకు చెందిన యువతుల స్ఫూర్తిదాయకమైన కథనాలను ప్రధానమంత్రి పంచుకున్నారు. సామాన్య నేపథ్యాల నుంచి వచ్చి, ఐటీఐ చదువులు పూర్తి చేసి, మలేషియాలో అధునాతన సాంకేతిక శిక్షణ పొందే వరకు వారు సాగించిన ప్రయాణం ఆయనను ఎంతగానో కదిలించింది. గతంలో తమ సొంత ప్రాంతాలను దాటి ఎప్పుడూ ప్రయాణించనప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన ఉత్పాదక ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించడంలో వారు పోషిస్తున్న కీలక పాత్రను ఆయన కొనియాడారు. ” అసాధారణమైన కలలు కంటున్న ఈ కుమార్తెలు ఈ రోజు ‘మేడ్ ఇన్ ఇండియా‘ చిప్ తయారీ ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగంగా మారారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
భారత్ ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా సాగిస్తున్న వేగవంతమైన ప్రయాణాన్ని పునరుద్ఘాటిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. కేవలం కొన్ని నెలల క్రితం తాము వాగ్దానం చేసిన బహుళ ఉత్పాదక కేంద్రాలను గడువు లోపలే పూర్తి చేయడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు స్పష్టమైన విధానపరమైన స్థిరత్వం, కచ్చితమైన నిర్ణయాధికారం, సాటిలేని పని వేగంపై సంపూర్ణ భరోసా ఇస్తూ, వ్యవస్థాగత ఆర్థిక సంస్కరణలను మున్ముందు మరింత వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. “వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడం పట్ల పూర్తి నిబద్ధతతో 140 కోట్ల మంది భారతీయులు 2047 నాటికి భారత్ ను కచ్చితంగా అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దుతారు” అని శ్రీ మోదీ అన్నారు.
***
A landmark day for India's semiconductor journey. The CG SEMI OSAT facility in Sanand will strengthen the chip manufacturing ecosystem, boost technological self-reliance and enhance India's position in the global semiconductor value chain.
— Narendra Modi (@narendramodi) July 4, 2026
https://t.co/uZA59xO3bs
The Semicon India programme is gathering rapid momentum...
— PMO India (@PMOIndia) July 4, 2026
Step by step.
Brick by brick.
Chip by chip. pic.twitter.com/EaEfWPNT2F
The expansion of the semiconductor industry in India did not happen overnight.
— PMO India (@PMOIndia) July 4, 2026
It is the next step in the electronics revolution that has taken place in India over the past decade. pic.twitter.com/fxQkRpY4W2
First products, then components and now semiconductors... India is building the entire electronics value chain.
— PMO India (@PMOIndia) July 4, 2026
This is the roadmap to Viksit Bharat. This is the next phase of Make in India. pic.twitter.com/aw556v0pmP
Our goal is to build a complete semiconductor ecosystem in India, from chip design to fabrication and packaging. pic.twitter.com/7CiVSTi5oE
— PMO India (@PMOIndia) July 4, 2026
India's youth will power the AI, robotics and next-gen tech revolution with Made in India chips. pic.twitter.com/pM8YJ3fgOx
— PMO India (@PMOIndia) July 4, 2026
It was wonderful being back in Sanand to inaugurate the CG Semi Outsourced Semiconductor Assembly and Test (OSAT) facility. This will add momentum to our efforts in making India a hub for semiconductors and futuristic technologies. pic.twitter.com/UNzMl9pewt
— Narendra Modi (@narendramodi) July 4, 2026
साणंद में शुरू हुआ CG Semi का प्लांट टेक्नोलॉजी, भरोसे और साझेदारी का एक ऐसा मॉडल है, जो भारत की सेमीकंडक्टर जर्नी को नई गति देने वाला है। pic.twitter.com/UDrrCZ47Y7
— Narendra Modi (@narendramodi) July 4, 2026
सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स क्रांति का Next Step है। इसलिए हम मोबाइल और इलेक्ट्रॉनिक्स के साथ-साथ इस पूरी दुनिया को चलाने वाली चिप्स का भी निर्माण करेंगे। pic.twitter.com/8KKPam9VI5
— Narendra Modi (@narendramodi) July 4, 2026
Semiconductor और AI Revolution के इस दौर में अपने युवा साथियों से मेरा यह विशेष आग्रह… pic.twitter.com/iq57Nv1bgi
— Narendra Modi (@narendramodi) July 4, 2026