Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గోరఖ్పూర్ లో ప్రధాన మంత్రి పర్యటన

గోరఖ్పూర్ లో ప్రధాన మంత్రి పర్యటన

గోరఖ్పూర్ లో ప్రధాన మంత్రి పర్యటన

గోరఖ్పూర్ లో ప్రధాన మంత్రి పర్యటన


· గోరఖ్ నాథ్ మందిర్ ను సందర్శించారు

· గోరఖ్ పూర్ ఎరువుల కర్మాగారం, ఎ ఐ ఐ ఎమ్ ఎస్ ల శంకుస్థాపన శిలా ఫలకాలను ఆవిష్కరించారు

· బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మందిర్ ను సందర్శించారు. అక్కడ మహంత్ అవైధ్యనాథ్ జీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన సాధువులు, యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. మహంత్ అవైధ్యనాథ్ జీ తో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రధాన మంత్రి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. మన సాధువులు, యోగులు ఎంతో పవిత్రులని, సమాజం పట్ల, పేదల పట్ల వారు సదా ఎంతో దయను చూపేవారని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఆ తరువాత గోరఖ్ పూర్ ఎరువుల కర్మాగారం, ఎ ఐ ఎమ్ ఎస్ ఎస్ లను ఏర్పాటు చేసేందుకు శంకు స్థాపన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ఈ రెండు పథకాల ముఖ్యాంశాలను ఆయనకు వివరించేందుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు. భారత దేశం లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే దేశంలోని తూర్పు రాష్ట్రాలు ముందంజ వేయక తప్పదు అని ప్రధాన మంత్రి అన్నారు.

ఒకవైపు ఎరువులను విదేశాల నుంచి దిగుమతి అవుతూ, మరోవైపు ఎరువుల కర్మాగారాలు మూసి ఉండి మన యువత ఉద్యోగాలు లేకుండా మిగిలిపోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రధాన మంత్రి అన్నారు. ఎరువుల యూనిట్ ను పునః ప్రారంభించడం వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక పరివర్తనకు ఊతం లభించగలదని ఆయన చెప్పారు.

ఈ ప్రాంతంలోని ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి వనరులను ఎలా కేటాయించిందీ ప్రధాన మంత్రి వివరించారు. ఈ ప్రాంతంలో పర్యాటక రంగానికి ఎంతో సత్తా ఉన్నదని ఆయన చెప్పారు. నూతన పౌర విమానయాన విధానంలో ప్రాంతీయ అనుసంధానానికి విశేష ప్రాధాన్యం ఇచ్చినందువల్ల ఈ విధానం పర్యాటకులను ఎక్కువ సంఖ్యలో భారతదేశానికి రప్పించగలుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు.

***