పిఎంఇండియా
నా మంత్రి వర్గ సహచరుడు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి.నద్దా, ఇథియోపియా ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి కెసెటే బి ర్హ న్ అద్మా సు, ఇతర భాగస్వామ్య దేశాలకు చెందిన ఆరోగ్య శాఖల మంత్రులు, డెవలప్ మెంట్ పార్టన ర్స్ ప్రతినిధులు, పౌరసమాజం ప్రతినిధులు, భారత్‌కు చెందిన ప్రైవేటు రంగం, విద్యావేత్తలు, దేశ విదేశాల నుంచి వచ్చిన వక్తలు, గౌరవ ప్రతినిధులందరికీ భారత ప్రభుత్వం, ఈ కార్కక్రమం నిర్వహణలో భాగస్వాములైన ఇతరులు అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను.
అమెరికాకు వెలుపల గ్లోబల్ “కాల్ టు యాక్షన్” సదస్సు జరగడం ఇదే మొదటి సారి కావడం ఎంతో విశేషమైన సందర్భం. ఈ సదస్సు నిర్వహించే అవకాశం రావడాన్ని ఒక ప్రత్యేక గౌరవంగా నా ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ భారత భూభాగానికి, న్యూఢిల్లీకి స్వాగతం పలుకుతున్నాను. మీ అందరితో కలిసి ఇందులో పాల్గొంటున్నందుకు నేను ఆనందిస్తున్నాను.
మాతా శిశువుల్లో నివారణీయమైన మరణాలను నివారించే ప్రక్రియను వేగవంతం చేయడంలో ఉమ్మడి నాయకత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా రూపొందించిన గ్లోబల్ కాల్ టు యాక్షన్ కార్యక్రమంలో భాగస్వామ్య దేశాలు సాధించిన విజయాలను రెండు రోజుల ఈ శిఖరాగ్రం లో చర్చించనున్నారు. ఎంతో విలువైన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చేపట్టిన ఈ చొరవలో కొత్త భాగస్వామ్యాలు, నవ్యతలు, వ్యవస్థలకు ఇది దర్పణం పడుతుంది. మనందరం ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్ళ కు సరైన పరిష్కారాలు చూపించడం ద్వారా ఆశించిన లక్ష్యాలు సాధించేందుకు చక్కని వేదికగా ఈ సదస్సు నిలుస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
వచ్చే 15 సంవత్సరాల కాలంలో మనం ప్రపంచాన్ని ఎలా తీర్చి దిద్దుతామన్న దాన్ని బట్టి సుసంపన్నత, ఆశావహ వైఖరులు, అభద్రత, అసహనాన్ని రూపు మాపడంలో మనం ఏ విధంగా బిన్నంగా ఉన్నాం అన్నది తెలుస్తుంది. నివారణీయమైన మాతా శిశు మరణాలను నిలువరించేందుకు ఇక్కడ సమావేశమైన 24 దేశాలు ఉమ్మడిగా కట్టుబాటును ప్రకటించడం పట్ల నేను ఆనందిస్తున్నాను. మన ముందుకు వచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని మరింత విశాలంగా ఆలోచించేందుకు కాల్ టు యాక్షన్ ఒక మాధ్యమంగా నిలుస్తుంది.
ఒక పక్క మనం సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల నుంచి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న ఈ పరివర్తిత సమయంలో అందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించుకునేందుకు ఇక్కడ సమావేశమయ్యాం. కాని ఇప్పటికీ ఏటా ప్రపంచవ్యాప్తంగా 2.89 లక్షల మంది తల్లులు, 63 లక్షల మంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారన్నది మన ముందున్న వాస్తవం. నివారణీయమైన ఇలాంటి మరణాల సంఖ్యలో ఇక్కడ సమావేశమైన 24 ప్రాధాన్యతా దేశాల వాటా 70 శాతం. ఏటా 26 లక్షల జననాలు సంభవిస్తున్న భారత్‌కు ఇది పెద్ద సవాలు. కాని ఈ దుస్థితిని అధిగమించాలన్న కట్టుబాటు కూడా బలీయంగానే ఉంది. అతి తేలికైన, సమర్థవంతమైన పరిష్కారాల ద్వారా ఈ మరణాలను నిరోధించవచ్చునన్నది వాస్తవం. ఈ సదస్సు ప్రధానాంశాల్లో ఇది ప్రధానమైనది. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు భారత సందర్శనకు వచ్చిన సమయంలో జారీ చేసిన ఉమ్మడి ప్రకటనలో కీలక భాగం కూడా ఇదే. నివారణీయమైన మాతాశిశు మరణాలన్నింటినీ నిలువరించేందుకు ఉమ్మడి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలన్నది ఆ ప్రకటనలో చేసుకున్న తీర్మానం.
ఈ విషయంలో మనం ఇంకా ఏం చేయవలసిఉన్నదన్నది పక్కన పెడితే మాతాశిశు ఆరోగ్య రక్షణలో అంతర్జాతీయంగా ఎంతో పురోగతి ఏర్పడింది. వాస్తవ చిత్రాన్ని పరిశీలిస్తే 1990 నాటికి ఐదేళ్ళలోపు బాలబాలికల్లో మరణాల సంఖ్య అంతర్జాతీయ సగటు 90 కాగా భారతదేశంలో 126 ఉంది. 2013 నాటికి అంతర్జాతీయ సగటు 46 కాగా భారత సగటు 49కి తగ్గింది. ఈ గణాంకాలు చూస్తే అంతర్జాతీయ సగటుతో పోల్చితే భారతదేశం లో వ్యత్యాసం 1990లో 36 పాయింట్లుండగా 2013 నాటికి అది 3 పాయింట్లకు తగ్గింది. అంటే శిశు మరణాలు తగ్గించే విషయంలో అంతర్జాతీయ సగటు కన్నా భారత్ ఎంతో వేగవంతమైన పురోగతి సాధించిందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఇదే ధోరణి నిలకడగా కొనసాగినట్టయితే భారత్ ఎం. డి. జి. ని సాధించడం తేలికేనని తెలుస్తోంది.
ఈ విజయం ఒక్కటే కాదు…పోలియో నిర్మూలనలో కూడా భారత్ చారిత్రక విజయం సాధించింది. 2014 మార్చి 27న భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించారు. 2009 నాటికి పోలియో కేసుల్లో సగానికి పైగా వాటా ఉన్న భారత్ 2014 నాటికి సాధించిన ఈ ఘనత శిశు ఆరోగ్య రక్షణలో భారతదేశం కట్టుబాటుకు దర్పణం పడుతోంది.
భారత్ మరో విజయం కూడా సాధించిందని తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను. బాలింత, కొత్తగా ఈ భూమి పైకి వచ్చిన శిశువుల్లో ధనుర్వాతాన్ని కూడా భారత్ పూర్తిగా నిర్మూలించగలిగింది. మాకు నిర్దేశించిన 2015 డిసెంబర్ గడువు కన్నా చాలా ముందుగానే సాధించిన ఈ విజయం ఇతర విభాగాల్లో కూడా నిర్దేశించిన తేదీల కన్నా ముందుగానే విజయాలు సాధించగలమన్న నమ్మకం మాలో కలిగించింది.
పోలియో రహిత, బాలింత, శిశు ధనుర్వాత రహిత జాతిగా మేం సాధించిన ఈ విజయాన్ని సుస్థిరం చేసుకునే లక్ష్యంతో మా ప్రభుత్వం “మిషన్ ఇంద్ర ధనుష్” పేరుతో ప్రపంచంలోనే అతి పెద్దదైన టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇప్పటివరకు టీకా మందులు వేయించుకోని వారందరికీ టీకా మందులు వేయించడం ఈ కార్యక్రమం లక్ష్యం. అలాగే టీకా మందులు అందించడంలో ప్రస్తుత వార్షిక వృద్ధిరేటు 1 శాతాన్ని 5 శాతానికి పెంచాలని కూడా లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీని వల్ల 2020 నాటికి ముందు 90 శాతానికి పైబడిన కవరేజ్ సాధించగలుగుతాం. ఇందులో మొదటి విడతలో విజయం సాధించాం. టీకాల ద్వారా నిరోధించగల మరణాలతో ఏ శిశువూ కన్ను మూయకుండా చూడాలన్నది మా తుది లక్ష్యం.
మాతా శిశు ఆరోగ్యం విషయంలో అంతర్జాతీయంగా చేపట్టే కార్యక్రమాలన్నింటిలోనూ భారత్ ఎప్పుడూ భాగస్వామిగా ఉంటుంది. 2014 జూన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సమ్మేళనం లో ప్రకటించిన కొత్తగా జన్మించిన శిశువుల సంరక్షణ అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఇ.ఎన్.ఏ.పి.) అమలుకు ముందుకు వచ్చిన తొలి దేశం భారత్. కొత్తగా పుట్టిన శిశువుల్లో మరణాల రేటును 2030 నాటికి ఒక అంకె స్థాయికి తగ్గించేందుకు 2014 సెప్టెంబర్‌లో ఇండియా న్యూబోర్న్ యాక్షన్ ప్లాన్‌ను (ఇనాప్) భారత్ ప్రారంభించింది. అలాగే ఆర్.ఎం.ఎన్.సి.హెచ్+ఎ కార్యక్రమం చేపట్టడం ద్వారా కాల్ టు యాక్షన్ కార్యాచరణకు స్పందించిన తొలి దేశం భారత్ అని నేను గుర్తు చేస్తున్నాను.
జాతీయ ఆరోగ్య ఉద్యమం (ఎన్హెచ్ఎం) ద్వారా మాతా శిశు మరణాల నివారణలో కూడా మేం విజయం సాధించగలుగుతున్నాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వేర్వేరు కార్యాచరణలు కలిగి ఉన్న ఈ కార్యక్రమం ప్రపంచంలోనే ప్రజారోగ్య కార్యక్రమాల్లో అతి పెద్దది. ఇది ఆశించిన విజయాల నమోదుకు సహాయకారిగా నిలిచింది. ఐదు సంవత్సరాల లోపు కన్ను మూస్తున్న బాలబాలికల్లో 52 శాతం వాటా ఐదు నెలల లోపు కన్ను మూస్తున్న కొత్త శిశువులదే. కొత్తగా జన్మించిన శిశువుల ఆరోగ్య రక్షణకు సామాజిక స్థాయిలోను, సంస్థల స్థాయిలోను శక్తివంచన లేకుండా కృషి చేయడం ఎన్.హెచ్.ఎం. లక్ష్యం.
గర్భిణీ మహిళలు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సురక్షితంగా శిశువులకు జన్మనిచ్చేలా చూడడంపై మేం దృష్టి పెడుతున్నాం. ఇందులో భాగంగా జననీ సురక్ష యోజన (జె.ఎస్.వై.) పథకం మేం ప్రవేశపెట్టాం. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో శిశువులకు జన్మనిచ్చే తల్లులకు ఈ కార్యక్రమం ద్వారా నేరుగా సహాయం అందిస్తున్నాం. దీంతో ఇప్పుడు 75 శాతానికి పైబడిన జననాలు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లోనే జరుగుతున్నాయి. బాలింత మరణాల సంఖ్య విశేషంగా తగ్గేందుకు ఇది సహాయకారి అయింది. సరైన సమయంలో ఆరోగ్య రక్షణ సేవలు అందుకోవడానికి ఆర్థిక వనరుల కొరతే ప్రధాన అవరోధమని మాకు తెలుసు. ఈ లోటు ను సరిదిద్దేందుకే మేం జనని శిశు సురక్ష కార్యక్రమం (జె.ఎస్.ఎస్.కె.) కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాం. దీని కింద ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో శిశువుకి జన్మనిచ్చిన ప్రతి తల్లికి, శిశువుకి కూడా డెలివరీ కోసం ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి ఉచిత రాకపోకలు, ఉచిత ఔషధాలు, ఉచిత ఆరోగ్య పరీక్షల సదుపాయాలతో పాటు నగదు రహిత ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చాం. ఆస్పత్రుల్లో జననాల సంఖ్య పెరగడానికి ఇది కూడా దోహదపడింది.
ఈ చర్యలన్నింటికీ తోడు దేశవ్యాప్తంగా అమలుపరుస్తున్న మాతా శిశు ఆరోగ్య పర్యవేక్షణ విధానం కింద వ్యక్తిగత లబ్ధిదారులందరి తాజా స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నాం. ఇప్పటికి ఈ వ్యవస్థలో 9.2 కోట్ల మంది తల్లులు, 7.8 కోట్ల మంది పిల్లలు నమోదయ్యారు.
అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు ఆరోగ్య సర్వీసులు సమానంగా అందుబాటులో ఉంచడం కూడా మా లక్ష్యం.ఆరోగ్య సర్వీసుల్లో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని తొలగించడం కోసం కనీస ఆరోగ్య సర్వీసులు అందుబాటులో లేని 184 జిల్లాలను దేశవ్యాప్తంగా గుర్తించి ఆయా ప్రాంతాలకు మరిన్ని వనరులు అందించడం, మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది.
మా ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమాల్లో కీలకమైనది “స్వచ్ఛ భారత్ అభియాన్” (స్వచ్ఛ భారత ప్రచారోద్యమం). ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య కేంద్రాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన పారిశుద్ధ్య వసతుల ప్రోత్సాహం కోసం కాయకల్ప పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన పరిసరాలు మాత్రమే ఆరోగ్యవంతమైన జాతికి మొదటి మెట్టు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. బాలికల సంరక్షణ కోసం మేం బేటీ బచావో, బేటీ పఢావో పేరిట ఎంతో ఉత్సాహవంతమైన కార్యక్రమం చేపట్టాం. సమాజంలో బాలికలందరూ సజీవంగా, క్షేమంగా ఉండేలా చూడడం, సమాజంలో కీలక భాగస్వాములయ్యేలా చూడడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
అనారోగ్యం వల్లనే ప్రజలు నిరుపేదలుగా మారుతున్న విషయం నేను స్వయంగా చూశాను. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాల వారందరికీ ఆరోగ్య సర్వీసులు, ఆర్థిక రక్షణ అవసరం. ఇలాంటివన్నీ ఎవరికి వారు ప్రయోగాత్మకంగా చేపట్టడమే కాకుండా ఇతరుల నుంచి కూడా నేర్చుకోవడం అవసరం. మాతాశిశు మరణాలు నిర్మూలించి యుక్త వయసులోని వారందరికీ మెరుగైన జీవనాన్ని అందించే విషయంలో ఇతర దేశాలతో కలిసి పని చేయడానికి భారత్ సంపూర్ణ కట్టుబాటుతో సంసిద్ధంగా ఉంది. మరింత సాహసోపేతమైన చర్యలకు కట్టుబాటు ప్రకటించడమే కాకుండా ఈ కట్టుబాట్ల అమలులో ఒకరికి ఒకరు బాధ్యత వహించే వాతావరణం కల్పించడంలో అందరం చేయి కలపాలని నేను ఆహ్వానిస్తున్నాను.
మనందరం ఇక్కడ సమావేశమైన ఈ తరుణంలో మనకి మనమే కాదు…ఇక్కడ సమావేశమైన 24 దేశాలకే కాదు…యావత్ ప్రపంచానికి బలమైన సందేశం మనం అందించాల్సి ఉంది. సంరక్షించేందుకు అవకాశం ఉన్న ప్రతి తల్లి, బిడ్డను సంరక్షించి తీరుతామన్న సందేశం అందులో స్పష్టంగా ఉండాలి. ఈ బృహత లక్ష్యానికి చేయూత ఇవ్వాలని మనందరం ప్రపంచానికి పిలుపు ఇద్దాం. ఈ కార్యక్రమం కోసం దేశీయంగా నిధులు కేటాయించడమే కాదు…అవసరంలో ఉన్న దేశాలకు ఆర్థిక సహాయం అందిస్తామన్న కట్టుబాటును కూడా ఈ సందర్భంగా భారత్ ప్రకటిస్తోంది. అది నా వ్యక్తిగత దృక్పథమే కాదు…ప్రభుత్వ కట్టుబాటు కూడా.
ఈ లక్ష్య సాధనలో ఇక్కడ సమావేశమైన ప్రతీ ఒక్క దేశం ఏదో ఒక కట్టుబాటు ప్రకటించడం అవశ్యం. భారత్‌కు చాలా విభాగాల్లో విజయం సాధించిన అనుభవం ఎంతో ఉంది. ఆ అనుభవాలను అందరితో పంచుకునేందుకు సిద్ధంగా ఉంది. పోలియో రహిత దేశాలుగా తీర్చి దిద్దుకోవడంలో సహాయం అందిస్తామని నేను గత ఏడాది సార్క్ దేశాలకు కట్టుబాటు ప్రకటించాను. ఆయా దేశాలకు అవసరమైన పెంటావలెంట్ వాక్సిన్లు అందుబాటులో ఉంచుతామని కూడా హామీ ఇచ్చాను. మా అనుభవాలను ప్రపంచ దేశాలతో పంచుకునేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నాం.
సాంకేతిక పరిజ్ఞానం, వ్యవస్థల పటిష్ఠత, కార్యక్రమాల అమలు వంటి భిన్న విభాగాల్లో సహయ సహకారాలు అందించడానికి భారత్ సంసిద్ధంగా ఉందని తెలియచేసేందుకు నేను ఆనందిస్తున్నాను. కొత్తగా జన్మించిన శిశువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో వారిలో ఏర్పడే రుగ్మతలు గుర్తించి చికిత్స అందించడంలో అవసరమై శిక్షణ అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ విభాగంలో మా అనుభవాలు కూడా ఇతరులతో పంచుకుంటాం. అందరికీ టీకాలు వేయడంలో ప్రత్యేకించి ఇంద్రధనుష్ కార్యక్రమంలో ఈ ఏడాది మాకు ఏర్పడిన అనుభవాలు కూడా మీ అందరితో పంచుకుంటాం. ఇప్పటికే సార్క్ దేశాలకు ఈ హామీ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్క దేశానికి అదే హామీని పునరుద్ఘాటిస్తున్నాను. పోలియో నిర్మూలనకు మేం అందిస్తున్న సహాయానికి ఇది అదనం.
ఎంతో కీలకమైన ఈ అంతర్జాతీయ సదస్సుకు మీ అందరికీ మరోసారి సాదర స్వాగతం పలుకుతున్నాను. మాతాశిశు మరణాల నిర్మూలన ప్రయత్నాల్లో అంతర్జాతీయ సమాజానికి ఈ సదస్సు ఒక కొత్త దిశను అందిస్తుందని నేను ఆశిస్తున్నాను.
మీ అందరి న్యూఢిల్లీ పర్యటన మంచి అనుభూతులు మిగల్చాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. జైహింద్…
**************
I warmly welcome you to the Global Call to Action Summit 2015: PM @narendramodi https://t.co/T9KKEq8CDZ @Call2Action2015
— PMO India (@PMOIndia) August 27, 2015
For the first time the Global Call to Action Summit is being held outside USA: PM @narendramodi https://t.co/T9KKEq8CDZ @Call2Action2015
— PMO India (@PMOIndia) August 27, 2015
This Summit will provide a highly effective platform to address common challenges that will help us achieve desired goals: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 27, 2015
I am glad to see 24 nations present here to join together in their commitment to end preventable maternal and child death: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 27, 2015
A truly historic accomplishment has been the victory over Polio: PM @narendramodi https://t.co/T9KKEq8CDZ @Call2Action2015
— PMO India (@PMOIndia) August 27, 2015
I am also happy to share with you today another major milestone achieved by India. India has eliminated maternal and neonatal tetanus: PM
— PMO India (@PMOIndia) August 27, 2015
Government has added to the world’s largest immunization drive another mission known as “Mission Indradhanush” : PM @narendramodi
— PMO India (@PMOIndia) August 27, 2015
India has always partnered with the global efforts on issues of child and maternal health: PM @narendramodi https://t.co/T9KKEq8CDZ
— PMO India (@PMOIndia) August 27, 2015
India also responded by acting on the first Call To Action through its commitment and launch of RMNCH+A: PM https://t.co/T9KKEq8CDZ
— PMO India (@PMOIndia) August 27, 2015
We launched Janani Suraksha Yojana where incentives were given for delivering in public institutions to beneficiaries directly: PM
— PMO India (@PMOIndia) August 27, 2015
One of the flagship programmes of my Government is the ‘Swacch Bharat Abhiyaan’ : PM @narendramodi #MyCleanIndia @Call2Action2015
— PMO India (@PMOIndia) August 27, 2015
I firmly believe that clean and hygienic environ is the stepping stone to a healthy nation: PM @narendramodi #MyCleanIndia @Call2Action2015
— PMO India (@PMOIndia) August 27, 2015
As we assemble here, we need to send a very strong message not only to ourselves, not only to 24 countries present here but to the world: PM
— PMO India (@PMOIndia) August 27, 2015
The message is of our commitment, that we will ensure that every woman, every child who can be saved will be saved: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 27, 2015
I hope the next two days would provide a new direction to the global community in its journey towards ending maternal and child deaths: PM
— PMO India (@PMOIndia) August 27, 2015