పిఎంఇండియా
ఈ బాఫ్టా చలనచిత్ర పురస్కారాల్లో.. చిన్నారులు, కుటుంబ కథా విభాగంలో విజేతగా ‘బూంగ్’ చిత్రాన్ని బ్రిటిష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) అకాడమీ ప్రకటించింది.
ఈ బాఫ్టా పురస్కారాల్లో చిన్నారులు, కుటుంబ చలనచిత్ర విభాగంలో విజేతగా నిలిచిన ‘బూంగ్’ చలనచిత్ర బృందం మొత్తానికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ విజయం అత్యంత ఆనందకరమనీ, ముఖ్యంగా మణిపూర్‌కు ఇదెంతో ప్రత్యేకమైందనీ శ్రీ మోదీ అన్నారు. దేశంలో సృజనాత్మకతకు కొదవ లేదని ఈ పురస్కారం ద్వారా స్పష్టమవుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
బాఫ్టా ప్రకటనను ప్రస్తావిస్తూ, సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో బాఫ్టా చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ.. శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“ఈ చిత్ర బృందం మొత్తానికీ శుభాకాంక్షలు. ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. ముఖ్యంగా మణిపూర్‌కు ఇదెంతో ప్రత్యేకమైనది. దేశంలో సృజనాత్మక ప్రతిభకు కొదవ లేదని ఇది స్పష్టం చేస్తోంది.”
***
Congratulations to all those associated with this film. This is indeed a moment of immense joy, especially for Manipur. It also highlights the immense creative talent in our nation. https://t.co/fd95WriuTG
— Narendra Modi (@narendramodi) February 23, 2026