Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సాంకేతిక విజ్ఞానం, నవకల్పన రంగాల్లో భారత్ నాయకత్వం వర్ధిల్లుతోందని ప్రస్తావిస్తూ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


ఢిల్లీలో నిర్వహించిన చరిత్రాత్మక ఏఐ శిఖరాగ్ర సదస్సులో భారత్ శక్తియుక్తులకు ప్రపంచ స్థాయిలో వేనోళ్ల  ప్రశంసలు దక్కాయని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారుసాంకేతిక విజ్ఞ‌ాన రంగంలో భారత యువత దూరదర్శి ఆలోచనావిధానం మానవాళికి ఎన్ని గొప్ప ప్రయోజనాలను అందించగలుగుతుందో  ఈ శిఖరాగ్ర సదస్సు చాటిచెప్పిందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ..
‘‘
అవిజ్ఞ‌ాతస్య విజ్ఞ‌ానం విజ్ఞ‌ాతస్య చ నిశ్చయ:
ఆరంభకర్మణాం శశ్వదారబ్ధస్యాన్తదర్శనమ్’’ అంటూ సాగే ఓ సంస్కృత భాషా సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
వెల్లడి కాని జ్ఞ‌ానాన్ని వెలుగులోకి తీసుకు రావడానికి ప్రయోగశీలత్వంతో పాటు పరిశోధన అత్యంత ఆవశ్యకంతెలిసిన అంశాల నిర్ధారణవిశ్లేషణ.. ఇవి పరిశోధనలో మొదటి దశలుఅనుభవానికి తోడు పరిశీలించడం ద్వారా జ్ఞ‌ానాన్ని ప్రమాణీకరించవచ్చని ఈ సుభాషితం వివరిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ 
‘‘
ఢిల్లీలో నిర్వహించిన చరిత్రాత్మక ఏఐ శిఖరాగ్ర సదస్సు‌లో భారత్ సామర్థ్యాన్ని పూర్తి ప్రపంచం ఎంతగానో మెచ్చుకొందిసాంకేతిక విజ్ఞ‌ానం రంగంలో మన యువ సహచరుల ఆలోచనావిధానం పూర్తి మానవ జాతికి చాలా ఉపయోగకరం కానుంది.
‘‘
అవిజ్ఞ‌ాతస్య విజ్ఞ‌ానం విజ్ఞ‌ాతస్య చ నిశ్చయ:
ఆరంభకర్మణాం శశ్వదారబ్ధస్యాన్తదర్శనమ్’’ అని పేర్కొన్నారు.

 

***