పిఎంఇండియా
శ్రీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రానికి 80 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటన
450 మెగావాట్ల బాగ్లిహార్ జల విద్యుత్ ప్రాజెక్టు రెండో దశ ప్రారంభం, రాంబన్‌లోని చందర్‌కోట్ వద్ద జాతీయ రహదారి 44 వద్ద ఉదమ్‌పూర్ – రాంబన్, రాంబన్ – బనిహాల్ సెక్షన్ల మధ్య నాలుగు వరుసల రహదారికి శంకుస్థాపన
ప్రధాన మంత్రి, శ్రీ నరేంద్ర మోదీ గారు జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి 80 వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించారు. శ్రీనగర్‌లోని షేర్ – ఎ – కశ్మీరీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గారి కశ్మీరియత్ (కశ్మీర్ సంస్కృతి), జమూరియత్ (ప్రజాస్వామ్యం), ఇన్సానియత్ (మానవత్వం) అనే మాటలను మరోసారి గుర్తుచేశారు.
భారత దేశంలో సూఫీ సంస్కృతిని ప్రధాన మంత్రి గారు గుర్తుచేస్తూ.. కశ్మీరీ సంస్కృతి లేకుండా భారతదేశం సంపూర్ణం కాదని తెలిపారు.
జమూరియత్ (ప్రజాస్వామ్యం) పై కశ్మీరీ ప్రజలు నమ్మకాన్ని పెంచుంటున్నారని ప్రశంసించారు. ఇన్సానియత్ (మానవత్వం) ఆధారంగా జమ్మూ కశ్మీర్ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు.
తమ ప్రభుత్వం “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” అనే నినాదంతో పనిచేస్తోందని ప్రధాన మంత్రి వివరించారు. తద్వారా దేశంలోని మూల మూలలకు ప్రగతి విస్తరించటం తప్పనిసరి అని తెలిపారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి పునర్వైభవం రావాలని.. ఈ రాష్ట్రాన్ని సందర్శించేందుకు దేశ ప్రజలు డబ్బులు కూడబెట్టుకునే వారని ప్రధాని అన్నారు. పర్యాటక రంగంతో పాటు ఇక్కడి పశ్మినా (కశ్మీర్లో మాత్రమే దొరికే నాణ్యమైన ఉన్ని) , కుంకుమ పువ్వునకు భారత దేశంలో మంచి డిమాండ్ ఉందన్నారు.
అంతకుముందు ప్రధాన మంత్రి బగ్లిహార్లో 450 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు రెండో దశను ప్రారంభించారు. రాంబన్‌లోని చందర్‌కోట్ వద్ద జాతీయ రహదారి 44 వద్ద ఉదమ్‌పూర్ – రాంబన్, రాంబన్ – బనిహాల్ సెక్షన్ల మధ్య నాలుగు వరుసల రహదారికి శంకుస్థాపన చేశారు.
175 గిగావాట్ల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ద్వారా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఈ సందర్భంగా ప్రధాని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా కలవర పెడుతున్న వాతావరణ మార్పులను ఎదుర్కునేందుకు ఇదో మంచి కార్యక్రమమని తెలిపారు.
శ్రీనగర్‌లో జమ్మూ, కశ్మీర్ రాష్ట్రానికి 80 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన ప్రధాన మంత్రి.. ఈ ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి కొత్త శక్తితో పాటు యువతకు ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడుతుందన్నారు.
At the public meeting at SherE Kashmir Stadium reiterated the message that India is incomplete without Kashmiriyat. https://t.co/jWcby9yzRj
— NarendraModi(@narendramodi) November 7, 2015
The package for J&Kannounced today will give a boost to all-round development of the state & give wings to the aspirations of the youth.
— NarendraModi(@narendramodi) November 7, 2015
Guided by Mantra of 'Sabka Saath, SabkaVikas' our Govt. is ensuring that the fruits of progress reach every person in every part of India.
— NarendraModi(@narendramodi) November 7, 2015
Development projects that will contribute to the progress of J&K& the nation. pic.twitter.com/aymQlTvAjF
— NarendraModi(@narendramodi) November 7, 2015
There is something special about J&Kthat draws me there so often. Always a delight to visit & my gratitude to the people for the warmth.
— NarendraModi(@narendramodi) November 7, 2015