Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ అంకుర సంస్థల దినం.. స్టార్టప్ ఇండియాకు పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా జనవరి 16న నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి


స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేయడం మొదలుపెట్టి పది సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తుగా 2026 జనవరి 16న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారుఅదే రోజు.. జాతీయ అంకుర సంస్థల దినం కూడా.

ఈ కార్యక్రమంలో.. భారత్‌లోని చైతన్యవంత అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థ సభ్యులతో ప్రధానమంత్రి మాట్లాడతారుఎంపిక చేసిన అంకుర సంస్థల ప్రతినిధులు తమ అనుభవ ముఖ్యాంశాల్ని పంచుకుంటారుఆహ్వానితులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

స్టార్టప్ ఇండియాను ప్రధానమంత్రి 2016 జనవరి 16న ప్రారంభించారుమార్పును తీసుకువచ్చే జాతీయ కార్యక్రమంగా దీనిని చేపట్టారుఉద్యోగాలు కావాలని కోరుకొనే వారి దేశంగా కన్నాఉద్యోగాల్ని ఇచ్చే వారి దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంతో పాటు నవకల్పనను ప్రోత్సహించడంనవ పారిశ్రామికత్వాన్ని పెంపొందించడంపెట్టుబడులు ఊతంగా నిలిచే అభివృద్ధి సాధన దిశగా ఇండియాను ముందుకు తీసుకు పోవడం స్టార్టప్ ఇండియా లక్ష్యాలు.

గత పదేళ్లుగాదేశ ఆర్థికనవకల్పన స్వరూపంలో ఓ కీలక స్థానాన్ని స్టార్టప్ ఇండియా పొందిందిసంస్థాగత యంత్రాంగాల్ని పటిష్ఠపరిచిందిపెట్టుబడితో పాటు మార్గదర్శకత్వం పరిధిని విస్తరించిందిఅంకుర సంస్థలు అన్ని రంగాల్లోఅన్ని ప్రాంతాల్లో వర్ధిల్లేందుకువిస్తరించేందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పరిచిందిఈ దశాబ్ద కాలంలో దేశ అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థలో గొప్ప విస్తరణ చోటుచేసుకుందిదేశవ్యాప్తంగా లక్షలకు పైగా అంకుర సంస్థలకు గుర్తింపును ఇచ్చారుఈ వాణిస్య సంస్థలు ఉపాధిని కల్పించడంలోనవకల్పన ఊతంగా ఆర్థికాభివృద్ధి చోటుచేసుకొనేటట్లు చూడటంలోవేర్వేరు రంగాల్లో దేశీయ సరఫరా వ్యవస్థల్ని బలోపేతం చేయడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి.

 

***