Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వం సందర్భంగా దేశ పౌరులు, ఓట‌ర్లు అంద‌రికీ ప్ర‌ధాన‌ మంత్రి శుభాకాంక్ష‌లు


జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ పౌరులు, ఓట‌ర్లు అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

“దేశ పౌరులు, ఓట‌ర్లంద‌రికీ జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఇసి) చేస్తున్న అద్భుత ప్ర‌య‌త్నాలకు నా అభినంద‌న‌లు. ఈ ప్ర‌య‌త్నాలే మ‌న‌ దేశ ప్ర‌జాస్వామ్యాన్ని ప్ర‌బ‌లంగా నిలుపుతున్నాయి.

ఈ సంవ‌త్స‌రం ప్రాతిప‌దిక‌గా తీసుకున్నటువంటి ‘సంఘ‌టిత మ‌రియు గుణాత్మ‌క భాగ‌స్వామ్యం’ ఓటింగ్ ప్ర‌క్రియ‌లో చురుకుగా పాలుపంచుకోవ‌డం ద్వారా మ‌న‌ ప్ర‌జాస్వామ్యాన్ని సుసంప‌న్నం చేసేందుకు మ‌రింత ఎక్కువ మంది పౌరుల‌కు ప్రేర‌ణ‌ను అందించ‌గ‌లుగుతుంది” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.