Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జిఎస్ టి విధానం అమలుకు మార్గం సుగమం చేసేందుకు వివిధ వస్తువులు, సేవలపై సెస్సులు మరియు సర్ చార్జీ ల రద్దుకు సంబంధించి కస్టమ్స్ అండ్ ఎక్సయిజ్ యాక్ట్ లో సవరణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ కింద పేర్కొన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది:

1. కస్టమ్స్ చట్టం, 1962 కు సవరణ;
2. కస్టమ్స్ టారిఫ్ చట్టం, 1975 కు సవరణలు;
3.సెంట్రల్ ఎక్సైజ్ చట్టం, 1944 కు సవరణ;
4. సెంట్రల్ ఎక్సయిజ్ టారిఫ్ చట్టం, 1985 రద్దు; మరియు
5. చట్టాలలో సెస్సుల విధింపునకు సంబంధించిన అంశాల సవరణ లేదా రద్దు.

పై ప్రతిపాదనలు ఈ కింది ప్రయోజనాలకు దారి తీస్తాయి:

1. ప్రత్యేక వ్యక్తులు చేసే వస్తు ఎగుమతి/దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని సమకూర్చడం, దిగుమతులు మరియు ఎగుమతులకు తక్కువ విలువ లేదా ఎక్కువ విలువ కట్టిన సందర్భాలను గుర్తించడం మరియు వాటి విశ్లేషణకు వీలు కల్పించడం, డ్రాబ్యాక్ స్కీమ్ సహా ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ఉన్నటువంటి పథకాలను దుర్వినియోగపరచడం, కస్టమ్స్ చట్టంలోని అంశాలను మరియు ఆయా చట్టాలను సమర్థంగా అమలుపరచేందుకుగాను కస్టమ్స్ అధికారులకు అధికారాలను దఖలుపరచినటువంటి వేరు వేరు ఇతర చట్టాలను కూడా అతిక్రమించడం కస్టమ్స్ చట్టం, 1962 లో సెక్షన్ 108A మరియు 108Bలను జత చేయడంలోని ఉద్దేశం. ఇంకా,

2. జిఎస్ టి అమలు తో ఇక కాలం చెల్లిపోయే ఇతర చట్టాలలోని వేరు వేరు అంశాలలో సవరణలు చేయడం లేదా వాటిని రద్దు చేయడమనేది స్టాట్యూట్ బుక్ లో నుండి అనవసర భాగాలను పరిహరించడానికి ఆస్కారం కల్పిస్తుంది.

***