పిఎంఇండియా
జ్ఞానం, వివేకం, దూరదృష్టి.. ఈ గుణాలు మనిషి జీవితంలో విజయానికి మూలస్తంభాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ గుణాలను అలవరుచుకున్న వ్యక్తులు అత్యంత కఠిన సవాళ్లను కూడా అధిగమించి విజేతలుగా నిలుస్తారని ప్రధాని తెలిపారు.
‘‘శాస్త్రే ప్రతిష్ఠా సహజశ్చ బోధః ప్రాగల్భ్యమభ్యస్తగుణా చ వాణీ, కాలానురోధః ప్రతిభానవత్త్వమేతే గుణాః కామదుఘాః క్రియాసు’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
ఏదైనా విషయం పట్ల ప్రామాణిక జ్ఞానం, స్వాభావిక వివేకం, భయానికి తావివ్వని ఆత్మవిశ్వాసం, అభ్యాసంతో సాధించిన వాగ్ధాటి, కాలానుగుణ అవసరాల్ని గుర్తించే ముందుచూపుతో పాటు ఏ పనినైనా లోతుగా ఆలోచించి మరీ చేస్తూ ఉండే తత్వం.. ఈ ఆరు గుణాలూ మనిషికి ప్రతి పనిలోనూ ‘కామధేనువు’లాగా తోడ్పడి, ప్రతి లక్ష్యాన్నీ సాధించుకోవడంలో సహకరిస్తాయని ఈ సుభాషితం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘జ్ఞానం, వివేకం, దూరదృష్టి వంటి సద్గుణాలు మనిషి జీవితంలో సాఫల్యానికి మూలాధారాలు. వీటిని అలవరుచుకున్న వ్యక్తులు కఠిన సవాళ్లనైనా పరిష్కరించుకోగలిగి విజేతలుగా నిలుస్తారు.
‘‘శాస్త్రే ప్రతిష్ఠా సహజశ్చ బోధః ప్రాగల్భ్యమభ్యస్తగుణా చ వాణీ
కాలానురోధః ప్రతిభానత్త్వమేతే గుణాః కామదుఘాః క్రియాసు’’ అని పేర్కొన్నారు.
***
ज्ञान, विवेक और दूरदर्शिता जैसे सद्गुण जीवन में सफलता का प्रमुख आधार हैं। इनसे समृद्ध व्यक्ति कठिन से कठिन चुनौतियों में भी विजयी होता है।
— Narendra Modi (@narendramodi) June 19, 2026
शास्त्रे प्रतिष्ठा सहजश्च बोधः प्रागल्भ्यमभ्यस्तगुणा च वाणी ।
कालानुरोधः प्रतिभानवत्त्वमेते गुणाः कामदुघाः क्रियासु ॥ pic.twitter.com/CEbEwoc7wl