Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ‌మ్ము & కాశ్మీర్ ముఖ్య‌మంత్రి శ్రీ ముఫ్తీ మ‌హ‌మ్మ‌ద్ స‌యీద్ మృతికి ప్ర‌ధాని సంతాపం


జ‌మ్ము & కాశ్మీర్ ముఖ్య‌మంత్రి శ్రీ ముఫ్తీ మ‌హ‌మ్మ‌ద్ స‌యీద్ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

” ముఫ్తీ సాహెబ్ మ‌ర‌ణం జమ్ము & కాశ్మీర్ లోనే కాకుండా యావద్దేశానికి కూడా లోటు. జమ్ము & కాశ్మీర్ లో ఆయన కనబరచిన మార్గదర్శకమైన నాయకత్వం ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపించింది. ఆయన ఆత్మకు శాంతి లభించు గాక. ముఫ్తీ సాహెబ్ ప్రదర్శించిన రాజనీతిజ్ఞ‌త‌ తీరే వేరు. ఆయన తాను సాగించిన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రాజనీతి క్షేత్రంలో ఎందరో ప్రశంసకులను సంపాదించుకున్నారు. ఆయన తన నేతృత్వ ప‌టిమ‌తో జమ్ము & కాశ్మీర్ కు గాయాన్ని నయం చేసే స్పర్శను అందజేశారు. ఆయన లేకపోవడం మన అందరినీ బాధించేదే ” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.