Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఝార్ ఖండ్ లో బొగ్గు గనిలో సంభవించిన ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల దు:ఖం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఝార్ ఖండ్ లోని ఒక బొగ్గు గనిలో సంభవించిన ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల దు:ఖం వ్యక్తం చేశారు.

“ఝార్ ఖండ్ లోని ఒక బొగ్గు గనిలో సంభవించిన ప్రమాదం ప్రాణనష్టానికి దారితీయడం పట్ల దు:ఖిస్తున్నాను. లోపల చిక్కుకుపోయిన వారు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. అక్కడి స్థితిగతులను గురించి ముఖ్యమంత్రి శ్రీ రఘుబర్ దాస్ ను అడిగి తెలుసుకున్నాను.

సాధారణ పరిస్థితిని పునరుద్ధరించడం కోసం ఝార్ ఖండ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కృషి చేస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రక్షణ మరియు సహాయక కార్యకలాపాలలో నిమగ్నమైంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.