Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ జయంత్ నార్లికర్ మృతిపట్ల ప్రధాని సంతాపం


ఖగోళ భౌతిక శాస్త్ర రంగ నిష్ణాతుడు డాక్టర్ జయంత్ నార్లికర్ మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

డాక్టర్ జయంత్ నార్లికర్ మృతి వైజ్ఞానిక సమాజానికి తీరని లోటుఆయన నిష్ణాతుడుముఖ్యంగా ఖగోళ భౌతికశాస్త్ర రంగంలో విశేష ప్రతిభావంతుడుఆయన విస్తృత కృషిముఖ్యంగా ఆయన ఏర్పరచిన కీలకమైన సైద్ధాంతిక ప్రాతిపదికలు పరిశోధకులకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయిసంస్థాగత నిర్మాతగాఅలాగే యువత కోసం అభ్యసనఆవిష్కరణ కేంద్రాలను తీర్చిదిద్దడంలో ఆయన తనదైన ముద్ర వేశారువిజ్ఞానశాస్త్రాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడంలో ఆయన రచనలూ కీలక పాత్ర పోషించాయిఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకుమిత్రులకు సంతాపం తెలుపుతున్నానుఓం శాంతి