పిఎంఇండియా
డి ఐ ఎస్ సి ఒ ఎమ్ (డిస్ కామ్) లు 2015 సెప్టెంబరు 30 నాటికి చెల్లించవలసి ఉన్న రుణంలో 50 శాతానికి పైగా యు డి ఎ వై (ఉజ్జ్వల్ డిస్ కామ్ అష్యూరెన్స్ యోజన.. ‘ఉదయ్’) లో భాగంగా రాష్ట్రాలు తీసుకోవడానికి గాను, మరియు జమ్ము – కశ్మీర్ రాష్ట్రం అప్పులను స్వాయత్తం చేసుకోవడానికి గాను ఉద్దేశించిన కాల అవధిని పొడిగించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. డిస్ కామ్ లను వాటి కార్యకలాపాలు, ఆర్థిక స్థితిగతుల పరంగా మేలు మలుపు తిప్పడానికి ఉదయ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకానికి ఇంతకు ముందు నిర్దేశించిన గడువు 2016 మార్చి 31వ తేదీ. కాగా, ఈ గడువును ఇప్పుడు మరొక సంవత్సరం పాటు పొడిగించారు. తాజా నిర్ణయం ఇంతక్రితం ఈ పథకంలో పాల్గొనని రాష్ట్రాలకు ఈ పథకంలో చేరే వీలును కల్పించనుంది.
ఉదయ్ లో చేరడానికి ఇంతవరకు 19 రాష్ట్రాలు వాటి సమ్మతిని తెలియజేశాయి. వాటిలో 10 రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఝార్ ఖండ్, పంజాబ్, బీహార్, హరియాణా, గుజరాత్, ఉత్తరాఖండ్, మరియు జమ్ము – కశ్మీర్ లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో ఎమ్ ఒ యులను కుదుర్చుకొన్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బకాయి రుణంలో 50 శాతానికి పైగాను, ఇంకా ఝార్ ఖండ్, జమ్ము – కశ్మీర్ లలో సి పి ఎస్ యు ల బకాయిలను చెల్లించే నిమిత్తం రూ. 99,541 కోట్ల విలువైన బాండ్లను రాష్ట్రాలు జారీ చేశాయి. అంతే కాకుండా, రూ. 11,524 కోట్ల విలువైన డిస్ కామ్ బాండ్లు కూడా జారీ అయ్యాయి. 2016-17లో ఉత్తర ప్రదేశ్ రూ. 14,801 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేసింది.
విద్యుత్తు పంపిణీ కంపెనీ (డిస్ కామ్ ) ఆర్థికంగా మేలుమలుపు తిరిగేందుకు, తద్వారా వాటి పునరుద్ధరణకు ఉదయ్ బాసటగా నిలుస్తుంది. చిరకాలంగా ఉన్న బకాయిల సమస్యకు ఒక నిలకడ కలిగిన శాశ్వతమైన పరిష్కారాన్ని కూడా ఉదయ్ అందజేయగలదు.
ఈ రంగంలో గడచిన కాలానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని అందించడంతో పాటు భవిష్యత్తులో తలెత్తగల సమస్యలకు సైతం ఒక పరిష్కారాన్ని ఉదయ్ సూచించగలుగుతుంది. ఇది రానున్న 2- 3 సంవత్సరాలలో లాభ నష్టాలు ఉండని స్థితికి డిస్ కామ్ లు చేరుకొనే అవకాశాన్ని కూడా అందించగలదు. నాలుగు విధాలుగా ఇది జరిగేందుకు ఆస్కారం ఉంటుంది.. వీటిలో i). డిస్ కామ్ ల కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం; ii). విద్యుత్తు కు అయ్యే వ్యయాన్ని తగ్గించడం; iii). డిస్ కామ్ లు 2015 సెప్టెంబరు 30 నాటికి చెల్లించవలసి ఉన్న రుణాలలో 75 శాతానికి పైగా రుణాలను రెండేళ్ల కాలం లోగా రాష్ట్రాలు తీసుకోవడం ద్వారా డిస్ కామ్ లకు వడ్డీ భారాన్ని తగ్గించడం.. ఇంకా మిగిలిన రుణ భారాన్ని తక్కువ వడ్డీ రేట్లతో కూడిన బాండ్లు మరియు రుణాల రూపంలో ఆ రుణ భారాన్ని తక్కువ చేయడం; iv). ఆర్థికపరంగా రాష్ట్రాలతో బంధాన్ని పెనవేసిన ఫలితంగా డిస్ కామ్ లు ఆర్థిక క్రమశిక్షణకు లోబడేటట్లు చేయడం వంటి చర్యలు తీసుకోబోతున్నారు.
స్మార్ట్ మీటర్స్ ను తప్పనిసరి చేయడం, ట్రాన్స్ ఫార్మర్స్ మరియు మీటర్స్ ఆధునికీకరణ తదితరాలతో పాటు ఎల్ ఇ డి బల్బులు, వ్యవసాయ పంపుసెట్లు, ఫ్యాన్ లు, ఏర్ కండిషనర్ లు వగైరాలలో ఇంధన సామర్థ్యం మెరుగుపర్చుకొనే చర్యలు తీసుకోవడం ద్వారా నిర్వహణ సామర్థ్యం ఇనుమడించి ఎ టి అండ్ సి సగటు నష్టాలు 22 శాతం నుంచి 15 శాతానికి దిగివస్తాయి. అంతే కాకుండా ఏవరేజ్ రెవెన్యూ రియలైజ్ డ్ (ఎ ఆర్ ఆర్) మరియు ఏవరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లయ్ (ఎ సి ఎస్) ల మధ్య అంతరం కూడా 2018- 19 కల్లా తొలగిపోగలదు. దేశీయంగా తక్కువ ధరకు లభించే బొగ్గును సరఫరా చేయడం, బొగ్గు అనుసంధాన ప్రక్రియను క్రమబద్ధీకరించడం, తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్న ప్లాంటు నుంచి ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్న ప్లాంటుకు బొగ్గు ను ఉదారంగా బదలాయించడం, గ్రాస్ కెలోరిఫిక్ వేల్యూ (జి సి వి) ప్రాతిపదికన బొగ్గు ధరలను క్రమబద్ధీకరించడం, వాష్ డ్ అండ్ క్రష్ డ్ కోల్ సరఫరా, ఇంకా ప్రసార మార్గాల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడం వంటి చర్యలను చేపట్టి విద్యుత్తు ఉత్పాదన వ్యయాన్ని తగ్గించనున్నారు.
కాలావధి పొడిగింపు ప్రతిపాదనకు ఆమోదం లభించినందున రాష్ట్రాలు బాండ్లను జారీ చేసి 2015 సెప్టెంబరు 30 నాటికి డిస్ కామ్ ల రుణంలో 75 శాతానికి పైగా రుణాలను 2017 మార్చి నెలాఖరు లోపల తాము తీసేసుకోగలుగుతాయి. దీని ద్వారా డిస్ కామ్ లకు రుణాలపై వడ్డీని చెల్లించే భారం కూడా తగ్గనుంది. గడువు పొడిగింపునకు మంత్రిమండలి ఆమోదం లభించడంతో, ఇంతవరకు ఉదయ్ లో చేరలేకపోయిన రాష్ట్రాలు ఇక ఉదయ్ లో చేరే అవకాశాన్ని పొందగలవు. డిస్ కామ్ సంస్కరణలు శరవేగంగా అమలయ్యేందుకూ మార్గం సుగమం కానుంది.