Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్తవి తీసుకొచ్చేలా ఎన్‌సీఆర్‌పీబీకి మద్ధతునిచ్చే పథకానికి క్యాబినెట్ ఆమోదం


ఢిల్లీఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడంస్వచ్ఛ రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించిన ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందిఈ పథకం కాలవ్యవధి రెండేళ్లుగృహనిర్మాణపట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంవోహెచ్‌యూఏఆధ్వర్యంలోని జాతీయ రాజధాని ప్రాంత ప్రణాళికా బోర్డు (ఎన్‌సీపీఆర్‌బీద్వారా ఈ పథకానికి నిధులు అందుతాయిరోడ్డు రవాణారహదారుల మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్‌టీహెచ్), పెట్రోలియంసహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎంవోపీఎన్జీఈ పథకాన్ని అమలు చేస్తాయిఎన్‌సీఆర్‌లో భాగంగా ఉన్న రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీహర్యానారాజస్థాన్ఉత్తర ప్రదేశ్ సహకారంతో ఇది అమలవుతుంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5,041 కోట్లుఎన్‌సీఆర్‌లో భాగంగా ఉన్న రాష్ట్రాల నుంచి అంచనా ప్రకారం రూ.1,601 కోట్ల పన్ను రాయితీలతో సహా మొత్తం రూ.9,585 కోట్ల వ్యయ అంచనాతో ఈ పథకం తయారైందిఢిల్లీఎన్‌సీఆర్ ప్రాంతంలో రిజిస్టర్ అయిన బీఎస్-IV లేదా అంతకంటే పాతవైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ట్రక్కులూబస్సుల స్థానంలో బీఎస్-VI లేదా మరింత కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండే వాహనాలను లేదా ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీకొనుగోలు చేసేలా వాహన యజమానులను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యంస్వచ్ఛమైన రవాణా సాంకేతికత పరిజ్ఞానాలకు మారే ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఈ పథకం ఢిల్లీఎన్‌సీఆర్ ప్రాంతంలో వాహన ఉద్గారాలను గణనీయంగా తగ్గించిగాలి నాణ్యతను మెరుగుపరచడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.

ఢిల్లీఎన్‌సీఆర్ ప్రాంతంలో ముఖ్యంగా శీతాకాలంలో వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారుతోందిఆటోమోటివ్ రీసెర్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టీఈఆర్ఐసంయుక్తంగా 2018 ఆగస్టులో ప్రచురించిన ‘‘సోర్స్ అపోర్షన్‌మెంట్ ఆఫ్ పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5 అండ్ పీఎం 10) ఇన్ ది ఢిల్లీఎన్‌సీఆర్’’ నివేదిక ప్రకారం.. ఢిల్లీఎన్‌సీఆర్‌లో రవాణా రంగానికి పీఎం 2.5 ఉద్గారాల్లో 14 శాతంకార్బన్ మోనాక్సైడ్ (CO)లో 40 శాతంనైట్రోజన్ ఆక్సైడ్ (NOx) ఉద్గారాల్లో 63 శాతం వాటా ఉందిరవాణా రంగంలో మొత్తం వాహనాల్లో ట్రక్కులూబస్సులూ శాతమే ఉన్నప్పటికీ.. పీఎం 2.5 ఉద్గారాల్లో 36 శాతం వాటాను కలిగి ఉన్నాయిబీఎస్-VI ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 14 వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలకు సమానమైన ఉద్గారాలను ఒక్క ప్రీబీఎస్ హెవీ డ్యూటీ వాహనం విడుదల చేస్తుందని అంచనాబీఎస్-VI వాహనం కంటే అదే శ్రేణికి చెందిన బీఎస్– IV వాహనం 2.7 రెట్లు ఎక్కువగా ఉద్గారాలను విడుదల చేస్తుందికాబట్టికొత్తగా ప్రవేశపెట్టే వాహన సముదాయం వల్ల వాహన కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

ఢిల్లీఎన్‌సీఆర్ (ఢిల్లీహర్యాణారాజస్థాన్ఉత్తరప్రదేశ్‌తో కూడినలో ఉన్న సుమారుగా 2.07 లక్షల ( 1.91 లక్షల ట్రక్కులు, 16,329 బస్సులుమంది యజమానులకు ఈ పథకం ప్రయోజనాన్ని అందిస్తుంది.

బీఎస్– III లేదా అంతకంటే పాత వాహనాలను నమోదిత వాహన స్క్రాపింగ్ కేంద్రాల వద్ద తుక్కుగా మార్చడం తప్పనిసరిబీఎస్– IV వాహనాల విషయానికి వస్తే.. వాటిని తుక్కు కింద మార్చుకోవచ్చులేదా ఎన్‌సీఆర్ పరిధి వెలుపల ఉన్న ఎన్‌సీఏపీయేతర నగరాలు/పట్టణాల్లో విక్రయించుకోవచ్చుఎన్‌సీఆర్ పరిధిలో బీఎస్-VI లేదా అంతకంటే కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న లేదా విద్యుత్తు వాహనాలను మాత్రమే యజమానులు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోవాలిఈ పథకం పరిధిలో ఢిల్లీలో కొనుగోలు చేసే తేలికపాటి సరకు రవాణా వాహనాలు తప్పనిసరిగా విద్యుత్తువే అయి ఉండాలిబస్సులు మాత్రం బీఎస్-VI సీఎన్‌జీ లేదా విద్యుత్తుతో నడిచేవై ఉండాలిప్రభుత్వ వాహనాలకు ఈ పథకం నుంచి మినహాయింపు ఉంది.

ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు:

రుణాలపై అయిదేళ్ల పాటు శాతం వడ్డీ రాయితీనివాహన విభాగాన్ని బట్టి నెలకు రూ. 4,800 వరకు విలువ చేసే ఇంధన ఓచర్లనుఈవీ కొనుగోళ్లు లేదా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ట్రేడింగ్‌పై భారీ మొత్తంలో ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను మాఫీ చేయడంతో పాటుపదేళ్ల పాటు 100 శాతం వరకు మోటారు వాహన పన్ను రాయితీలను అందిస్తాయిఅదేవిధంగా పాత వాహనాలకు 50 శాతం రాయితీలను ఇస్తాయిఈ పథకంలో భాగమయ్యే పాత వాహనాలపై ఉన్న బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుంది.

ఈ పథకంలో పాల్గొనే వాహన ఓఈఎంలు ఎక్స్షోరూం ధరలపై శాతం రాయితీలను అందిస్తాయి.

సమీకృత పోర్టల్ ద్వారా ఈ పథకాన్ని డిజిటల్ రూపంలో అమలు చేస్తారుదీనివల్ల వాస్తవ సమయంలో అర్హతల తనిఖీలుఆటోమేటెడ్ వడ్డీ రాయితీ క్లెయిములునెలవారీ ఇంధన ఓచర్ క్రెడిట్లుకాలుష్య తగ్గింపు ఫలితాల పర్యవేక్షణ సాధ్యమవుతుందిరిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి అయిదేళ్ల పాటు కొత్త వాహనానికి కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయితద్వారా రెండేళ్ల నమోదు గడువు ముగిసిన తర్వాత కూడా ప్రభావం కొనసాగేలా చూసుకోవచ్చు.

ఈ పథకాన్ని సాధికార సంఘం పర్యవేక్షిస్తుందిదీనికి క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షత వహిస్తారునీతి ఆయోగ్ సీఈవోగృహపట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖరోడ్డు రవాణారహదారుల మంత్రిత్వ శాఖపెట్రోలియంసహజ వాయువు మంత్రిత్వ శాఖడీఎఫ్ఎస్ కార్యదర్శులుఢిల్లీఎన్‌సీఆర్‌లో భాగమైన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారుఎన్‌సీఆర్‌పీబీ సభ్యకార్యదర్శి.. మెంబర్ కన్వీనర్‌గా ఉంటారుజిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు/జిల్లా మెజిస్ట్రేట్లు ఈ పథకాన్ని అమలు చేసిపర్యవేక్షిస్తారు

 

***