Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీ లోని ఎఐఐఎమ్ఎస్ లో ఐసిటి ఆధారిత గ్రీన్ హాస్పిటల్ కోసం ఉద్దేశించిన డెమన్ స్ట్రేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఆర్థిక వ్యవహారాల విభాగం), ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎమ్ఎస్) లకు మరియు జపాన్ కు చెందిన న్యూ ఎనర్జి అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజి డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (ఎన్ఇడిఒ)కు మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రాల (ఎమ్ ఒ యు)పై సంతకాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.


ప్రాజెక్టులో ఈ కింది పనులు కూడా కలిసి ఉంటాయి:

ఎ. సామగ్రి యొక్క ఇంజినీరింగ్, డిజైన్, నిర్మాణం మరియు నిర్వహణకు అవసరమైన సర్వేక్షణలు,

బి. సామగ్రి యొక్క మౌలిక ప్రణాళికరచన, ఇంజినీరింగ్ మరియు డిజైన్,

సి. సామగ్రి యొక్క తయారీ మరియు రవాణా,

డి. సివిల్ వర్క్, నిర్మాణం మరియు స్థాపన,

ఇ. సామగ్రి యొక్క కమిషనింగ్,

ఎఫ్. సామగ్రి యొక్క డెమన్ స్ట్రేషన్, మరియు

జి. భారతదేశంలో సాంకేతిక విజ్ఞానం ప్రచారం.

ఈ ఎమ్ ఒ యు పై సంతకాలు జరిగిన తేదీ నాటి నుండి ఇది అమలులోకి రాగలదు మరియు 2020 మార్చి 31 వరకు అమలులో ఉండగలదు.

భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ మరియు శక్తి ని సమర్ధంగా వినియోగించడం కోసం తోడ్పాటును అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. ఇందుకోసం ఎఐఐఎమ్ఎస్ ఢిల్లీ లో ఎనర్జి ఎఫిషియెంట్, ఇంకా ఐటి సంబంధి సామగ్రిని నెలకొల్పుతారు. అంతే కాకుండా, ఆ శక్తి నిర్వహణ వ్యవస్థను, ఐటి వ్యవస్థను ప్రదర్శిస్తారు కూడా. ఎక్విప్ మెంట్ డెమన్ స్ట్రేషన్ ద్వారా టెక్నాలజీని విస్తృత‌ంగా ప్రచారంలోకి తేవడం కోసం

కృషి చేస్తారు.