Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తేజస్ యుద్ధ విమానాన్ని వైమానిక దళంలోకి తీసుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తేజస్ యుద్ధ విమానాన్ని వైమానిక దళంలోకి చేర్చుకున్నందుకు తనకెంతో గర్వంగాను, సంతోషంగాను ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్ ఎ ఎల్) ను మరియు ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎ డి ఎ)ను ఆయన ప్రశంసించారు.

“దేశీయంగా నిర్మించిన తేజస్ యుద్ధ విమానాన్నివైమానిక దళంలోకి చేర్చుకోవడం మా హృదయాలను సాటిలేని అతిశయంతోను, ఆనందంతోను నింపివేసింది.

తేజస్ యుద్ధ విమానాన్ని చేర్చుకున్నందుకు నేను హెచ్ఎఎల్ ను మరియు ఎడిఎ ను ప్రశంసిస్తున్నాను. ఈ ఘటన దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మనకు తగినంత నైపుణ్యము, శక్తి ఉన్నాయని నిరూపిస్తోంది” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***