Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దాద్రా, నగర్ హవేలిలో ప్రధానమంత్రి పర్యటన


పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 19వ తేదీన దాద్రా, నగర్ హవేలి రాజధాని సిల్వాసా సందర్శిస్తున్నారు.
పర్యటనలో భాగంగా ఆయన సావ్లిలో వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. అలాగే డమన్, డయ్యూ; దాద్రా, నగర్ హవేలిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఫలకాలు ఆవిష్కరిస్తారు.

అలాగే ఎం-ఆరోగ్య యాప్, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించి దాన్ని డిజిటల్ గానే ఘన వ్యర్థాలు, ద్రవ వ్యర్థాలను వేరు చేసే వ్యవస్థను ప్రారంభిస్తారు.

కేంద్రపాలిత ప్రాంతం ఐటి విధానాన్ని కూడా ఆవిష్కరిస్తారు.

ఆ తర్వాత కొందరు లబ్ధిదారులకు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సర్టిఫికెట్లు, అటవీ హక్కుల సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు.

సిల్వాసాలోని సావ్లిలో వైద్య కళాశాల ఏర్పాటు వల్ల దాద్రా, నగర్ హవేలి, డామన్, డయ్యూ, సమీప ప్రాంతాల్లో తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని గిరిజనులు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు దీని వల్ల లాభం చేకూరుతుంది. అందుబాటులో ఉండే వైద్యుల సంఖ్య పెరిగేందుకు, విద్యార్థులకు వైద్య విద్యా అవకాశాలు మెరుగుపడేందుకు కూడా ఇది దోహదపడుతుంది. వైద్య కళాశాల; మెడికల్ కాలేజి, పారామెడికల్ కాలేజికి హాస్టళ్లు, నివాస భవనాల నిర్మాణం కోసం రూ.210 కోట్లు కేటాయించారు.

***