భక్తిపూర్వకంగా దుర్గ అమ్మవారిని స్మరించే భక్తులు ఉన్నతిని, సౌభాగ్యాన్ని పొంది తీరుతారని సూచిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. దేవీమాతను ధ్యానించే వారిని సకల సంకటాల నుంచి అమ్మ తప్పక రక్షిస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని ఈ శ్లోకం స్పష్టం చేస్తున్నది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘యైస్తు భక్త్యా స్మృతా నూనం తేషాం వృద్ధిః ప్రజాయతే
యే త్వాం స్మరన్తి దేవేశి రక్షసే తాన్నసంశయః’’ అని పేర్కొన్నారు.
***
यैस्तु भक्त्या स्मृता नूनं तेषां वृद्धिः प्रजायते। ये त्वां स्मरन्ति देवेशि रक्षसे तान्न संशयः।। https://t.co/d5la5pSefG
— Narendra Modi (@narendramodi) October 19, 2026