Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాగౌరి అమ్మవారిని పూజించిన ప్రధానమంత్రి


త్యాగం, తపస్సులకు ప్రతీక దేవీమాత మహాగౌరికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూజ చేశారు. అమ్మవారి ఆశీస్సులతో దేశంలో అందరి భవిత ఉజ్జ్వలమవ్వాలని, ప్రతి ఒక్కరు యశస్సును, కీర్తిని అందుకోవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘త్యాగం, తపస్సులకు ప్రతీక మహాగౌరి మాత. ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరి భవిష్యత్తు ఉజ్జ్వలంగా వెలుగులీనాలి. ప్రతి ఒక్కరి జీవితంలో యశస్సు, కీర్తి కలగాలి అని నేను అభిలషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

***