Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నయా రాయ్‌పూర్‌లో ప్రధాన మంత్రి

నయా రాయ్‌పూర్‌లో ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆదివారం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించనున్న గృహ నిర్మాణ సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్‌ నిర్మాణానికి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఛత్తీస్‌గఢ్‌ నూతన కల్పన, పారిశ్రామికాభివృద్ధి పాలసీని కూడా ఈ సందర్భంగా ప్రధాని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకే ప్రధాన మంత్రి ఆవాస్ యోన కార్యక్రమం నిర్దేశింనట్లు తెలిపారు. ఇళ్లు కట్టించి ఇవ్వటకే కాదు పేదల కలల సాకారానికి ఈ పథకం తోడ్పడుతుందన్నారు. ఈ పథకం వల్ల పెద్ద సంఖ్యలో ఆర్థిక కార్యక్రమాలు జరగుతాయని.. అందువల్ల ఈ పథకం సరిగా అమలయ్యేలా అన్ని రాష్ట్రాలు, స్థానిక సంస్థలు చొరవతీసుకోవాలని ప్రధాని సూచించారు. 2022 కల్లా అందరికీ ఇళ్లు కట్టించాలనే తమ ప్రభుత్వ లక్ష్యానికి ఇది తొలిమెట్టు అని ప్రధాని అన్నారు.

నూతన కల్పన, పారిశ్రామికాభివృద్ధి పాలసీని రూపొందించినందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. 50 ఏళ్లుగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుని కొత్త ఆలోచనలు పుట్టించుకున్న దేశాలే ఇప్పుడు ఆర్థికాభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్కిల్ ఇండియా,ముద్ర యోజనల గురించి ప్రధాని వివరించారు.

అంతకుముందు సత్యసాయి బాబా విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి ‘శ్రీ సత్యసాయి సౌభాగ్యం-మానవాభివృద్ధి కేంద్రం’ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్‌ ఫర్ చైల్డ్ హెల్త్ కేర్‌ను మానవ సేవకు అంకితమిచ్చారు.