Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నిస్తేజం నుంచి ఉత్తేజం వైపు ప్రయాణం… ఏపీ సీఎం చంద్రబాబు రాసిన వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని


భారతదేశ వృద్ధి, భారతీయుల సాధికారతపై ప్రధానమంత్రి 25 ఏళ్ల నాయకత్వ ప్రస్థానం ఎలా దృష్టి సారించిందీ వివరిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ సంవత్సరాల్లో మౌలిక వసతులు, సంక్షేమం నుంచి సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, దేశాన్ని అంతర్జాతీయంగా తీసుకుపోవడం వరకు  విస్తృతమైన మార్పు చోటు చేసుకుందని శ్రీ నాయుడు స్పష్టం చేశారు. నిస్తేజంగా ఉన్న వృద్ధి నుంచి బలమైన సంకల్పం
, ఆత్మవిశ్వాసం దిశగా సాగించిన ప్రయాణాన్ని సూచిస్తుందని తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘భారతదేశ అభివృద్ధి, భారతీయుల సాధికారతపై పీఎం నరేంద్ర మోదీ 25 ఏళ్ల నాయకత్వ ప్రస్థానం దృష్టి సారించిందని ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు రాశారు. ఈ సంవత్సరాల్లో మౌలిక వసతులు, సంక్షేమం నుంచి సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, అంతర్జాతీయంగా భారతదేశాన్ని నడిపించే వరకు విస్తృతమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
అభివృద్ధి నిస్తేజంగా సాగుతున్న స్థాయి నుంచి బృహత్ సంకల్పం దిశగా దేశం సాగించిన ప్రయాణం గురించి వివరించిన ఈ కథనాన్ని చదవండి.’’

 

***