పిఎంఇండియా
దానాన్ని నిస్వార్థ బుద్ధితో ఇవ్వాలనీ, అప్పుడే అది సద్గుణం అనిపించుకుంటుందనీ చాటిచెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘పద్మాకరం దినకరో వికచీకరోతి చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్
నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సన్తః స్వయం పరహితేషు కృతాభియోగాః’’
ఈ సుభాషితం ‘‘పద్మం వికసించడానికి సూర్యుడు సాయపడతాడు. మరి లిల్లీపువ్వుల విషయంలో చంద్రుడూ ఇలాగే తోడ్పడుతాడు. మేఘాలు వాటంతట అవే జలాన్ని వర్షిస్తాయి. ఇదే విధంగా, ఉత్తములు ఏదీ కోరుకోకుండానే, పరులకు మేలు చేస్తారు’’ అని మనకు తెలియజేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ –
‘‘పద్మాకరం దినకరో వికచీకరోతి చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్
నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సన్తః స్వయం పరహితేషు కృతాభియోగాః’’ అని పేర్కొన్నారు.
***
पद्माकरं दिनकरो विकचीकरोति चन्द्रो विकासयति कैरवचक्रवालम्।
— Narendra Modi (@narendramodi) April 23, 2026
नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति सन्तः स्वयं परहितेषु कृताभियोगाः।। pic.twitter.com/gc9DyHbSnS