పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో మాట్లాడారు. “భారత–నెదర్లాండ్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై మేం చర్చించాం. ముఖ్యంగా సెమీకండక్టర్లు, భారీ నీటి ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, నిపుణుల పరస్పర పర్యటనలు వంటి రంగాల్లో రెండు దేశాల భాగస్వామ్య అవకాశాల గురించి ప్రస్తావించాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిసుస్థిరతలను త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
“నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో మాట్లాడటం సంతోషంగా ఉంది. భారత–నెదర్లాండ్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై మేం చర్చించాం. సెమీకండక్టర్లు, భారీ నీటి ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, నిపుణుల పర్యటనల వంటి రంగాల్లో భాగస్వామ్య అవకాశాలను గుర్తించాం. పశ్చిమాసియాలోని ప్రస్తుత పరిస్థితులపై కూడా అభిప్రాయాలను పంచుకున్నాం. ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాం” అని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో చేసిన పోస్టులో ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
Pleased to speak with Prime Minister of the Netherlands Rob Jetten today. We discussed ways to further strengthen India-Netherlands ties.
— Narendra Modi (@narendramodi) March 30, 2026
Highlighted the potential of our partnership in areas such as semiconductors, mega water projects, green hydrogen and talent mobility.
Also…