Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నెదర్ లాండ్స్ లో పర్యటించిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన పత్రికా ప్రకటన (జూన్ 27, 2017)

నెదర్ లాండ్స్ లో పర్యటించిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన పత్రికా ప్రకటన (జూన్ 27, 2017)

నెదర్ లాండ్స్ లో పర్యటించిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన పత్రికా ప్రకటన (జూన్ 27, 2017)


శ్రేష్ఠుడైన ప్రధాని శ్రీ మార్క్ రూటే,

మీరు 2015 జూన్ లో భారతదేశ పర్యటనకు వచ్చినపుడు మీకు స్వాగతం పలికే అవకాశం నాకు దక్కింది. ఆ సమయంలో నేను సాధారణంగా జూన్ మాసంలో భారతదేశంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయని, అయినప్పటికీ మీరు భారతదేశాన్ని సందర్శించేందుకు ఆ నెలనే ఎంచుకొన్నారని అన్నాను. అదుగో అదే.. మన ద్వైపాక్షిక సంబంధాల పట్ల మీ నిబద్ధతను తెలిపే ఒక లక్షణమైంది.

ఈ రోజు సరిగ్గా రెండు సంవత్సరాల అనంతరం – జూన్ మాసం లోనే- నేను కూడా నెదర్ లాండ్స్ కు వచ్చాను. అయితే, ఢిల్లీకి మరియు హేగ్ కు మధ్య ఉష్ణోగ్రతలకు సంబంధించినంత వరకు చాలా తేడా ఉందనుకోండి; ఇక్కడ వాతావరణం నేను పరిశీలించినంత వరకు చాలా ఉల్లాసకరంగా ఉంది.

నాకు ఒక్కడికే కాక నా యావత్తు ప్రతినిధివర్గానికి మీరు అందించిన ఆత్మీయభరితమైనటువంటి స్వాగతానికిగాను మీకు ముందుగా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసుకోనివ్వండి. ఈ సాదర స్వాగతం ద్వారా మీరు భారతీయ ప్రజలందరి పట్ల మీ భావోద్వేగాలను వ్యక్తం చేసినట్టు మేము భావిస్తున్నాము.

ఎక్స్ లెన్సీ, నా నెదర్ లాండ్స్ పర్యటన అతి తక్కువ సమయంలో నిర్ణయింపబడింది. అయినప్పటికీ కూడాను ఇంత తక్కువ వ్యవధిలో మీరు ఈ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లన్నీ సమకూర్చడానికి అంగీకరించడమే కాకుండా ఇది ఒక మంచి ఫలితాన్ని ప్రసాదించే కార్యక్రమం అయ్యే లాగా చాలా చక్కటి ప్రణాళికను సిద్ధం చేశారు. మీ నాయకత్వాన్ని నేను ప్రశంసించదలచాను. మరి, ఇది మీ ఉత్తమ నేతృత్వం యొక్క వ్యక్తీకరణమే అని నేను అనుకొంటున్నాను.

ఎక్స్ లెన్సీ, భారతదేశానికి, నెదర్ లాండ్స్ కు మధ్య సంబంధాలు వందల సంవత్సరాల నాటివని, వాటిని మరింత గాఢంగాను, సన్నిహితంగాను మలచుకోవాలనే ఉద్దేశంతో మన ఇరు దేశాలు ఉన్నాయని మీరు చెప్పడం నూటికి నూరు పాళ్లు సరైనదే. ఈ సంవత్సరం, ఎక్స్ లెన్సీ, మీరు అన్నట్లుగా, మనం భారతదేశం మరియు నెదర్ లాండ్స్ కు మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన ఘట్టం యొక్క 70వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నాం. ఈ కారణంగా, మనం మన ద్వైపాక్షిక సంబంధాల పట్ల మరి కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం స్వాభావికమైందేనని చెప్పాలి.

ఇవాళ్టి ప్రపంచం పరస్పర ఆధారితమూ, అనుసంధానభరితమూ అయినటువంటిది. కాబట్టి, మన చర్చలలో మనం ద్వైపాక్షిక అంశాలకే కాకుండా అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలకు కూడా స్థానాన్ని కల్పించవలసిన అవసరం ఎంతో ఉంది.

అంతర్జాతీయ అంశాలను పరిశీలిస్తే, మన రెండు దేశాల మధ్య అభిప్రాయాలలో బోలెడంత కేంద్రీకరణం ఉంది. నెదర్ లాండ్స్ తోడ్పాటు తోనే భారతదేశం గత సంవత్సరం ఎమ్ టిసిఆర్ లో సభ్యత్వాన్ని పొందగలిగింది. ఇందుకుగాను నేను మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలనుకొంటున్నాను.

ఇక ద్వైపాక్షిక పెట్టుబడుల విషయానికి వస్తే, ఇంతదాకా నెదర్ లాండ్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో అయిదో అతి పెద్ద వనరుగా ఉంది. నిజానికి, గత మూడు సంవత్సరాలలోను అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో మూడో అతి పెద్ద వనరుగా ఎదిగింది.

భారతదేశ ఆర్థిక అభివృద్ధిలోను, మా అభివృద్ధి ప్రాధాన్యాలలోను నెదర్ లాండ్స్ స్వాభావిక భాగస్వామి అనే యదార్థాన్ని తిరిగి చెప్పవలసిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు.

ఇవాళ డచ్ కంపెనీల సిఇఒ లతో ఒక సమావేశం జరిపే అవకాశాన్ని కూడా మనం పొందబోతున్నాము. వారు భారతదేశానికి సంబంధించినంత వరకు సకారాత్మక దృక్పథాన్ని కొనసాగిస్తారనే నేను ఆశిస్తాను. ఇంకా, వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి నేను ఎంతో కుతూహలంతో ఉన్నాను కూడా.

నెదర్ లాండ్స్ లో ఉన్న భారతీయ సంతతి సముదాయం వారితో భేటీ అయ్యే అవకాశం కూడా ఈ రోజు నాకు లభించనుంది. ఇక్కడి ప్రవాసీ భారతీయులు ఉభయ దేశాలకు మధ్య ఉన్న ఒక సజీవమైన లంకె అంటాను. అది మాత్రమే కాదు, వారు రెండు దేశాల మధ్య ఒక సేతువు వంటి వారు. రెండు దేశాల ప్రజలకు మధ్య సన్నిహిత సంబంధాలను మరింత బలపరచడం కోసం మనం పాటు పడవలసివుంది.

రాజ దంపతులతో భేటీ కావలసి ఉండటం సైతం నా వరకు నాకు మంచి అదృష్టభరితమైనటువంటి విషయం. నిజంగా నేను వారితో సమావేశం కావడం కోసం వేచివున్నాను. ప్రధాని శ్రీ రూటే కు, నెదర్ లాండ్స్ ప్రజలకు, ప్రభుత్వానికి నేను మరొక్క మారు నా హృద‌య‌పూర్వకమైన కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసుకొంటున్నాను.

మీకు ఇవే నా ధన్యవాదాలు.