Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ ప్ర‌ధానితో మాట్లాడిన ప్ర‌ధాని


నేపాల్ పోలీసుల కాల్పుల్లో బీహార్ యువ‌కుడు చ‌నిపోవ‌డంపైన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఇది దుర‌దృష్ట‌క‌ర‌మని ఆయ‌న త‌న ఖండ‌న‌లో పేర్కొన్నారు.

ఈ విష‌యంపైన ఆయ‌న నేపాల్ ప్ర‌ధాని శ్రీ కె.పి. ఓలితో మాట్లాడారు. బీహార్ పోలీసుల కాల్పుల సంఘ‌ట‌న‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని శ్రీ మోదీ దానికి సంబంధించిన వివ‌రాలు ఇవ్వాల్సిందిగా నేపాల్ ప్ర‌ధానికి విజ్ఞ‌ప్తి చేశారు.

నేపాల్‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఇంధ‌నం, ఇంకా అత్య‌వ‌స‌ర వ‌స్తువుల స‌ర‌ఫ‌రా విష‌యంలో భార‌త‌దేశం వైపు నుంచి ఎలాంటి అడ్డంకులు లేవ‌ని ప్ర‌ధాని మోదీ హామీ ఇచ్చారు. అదే స‌మ‌యంలో సంక్షోభానికి స‌రైన ప‌రిష్కారాన్ని అన్వేషించే దిశ‌గా నేపాల్ నేత‌లు కృషి చేయాలని ప్ర‌ధాని మోదీ కోరారు.