Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నైజీరియా మాజీ అధ్యక్షుడు మహమ్మదు బుహారీ మృతిపై ప్రధాని సంతాపం


నైజీరియా మాజీ అధ్యక్షుడు మహమ్మదు బుహారీ మృతిపట్ల భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో ఆయనతో జరిగిన సమావేశాలనుసంభాషణలను శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. మహమ్మదు బుహారీ మేధస్సుఆత్మీయతభారత్ – నైజీరియా మైత్రిపట్ల ఆయనకు గల అచంచలమైన నిబద్ధత చెప్పుకోదగ్గవన్నారుమహమ్మదు బుహారీ కుటుంబానికినైజీరియా ప్రభుత్వానికిప్రజలకు… 140 కోట్ల భారతీయుల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

నైజీరియా మాజీ అధ్యక్షుడు మహమ్మదు బుహారీ మృతి అత్యంత బాధాకరం. వివిధ సందర్భాల్లో ఆయనతో జరిగిన సమావేశాలుచేసిన సంభాషణలు నాకు గుర్తొస్తున్నాయిఆయన పరిణతిఆత్మీయతభారత్ – నైజీరియా మైత్రిపై ఆయనకున్న అచంచల విశ్వాసం ఎనలేనివిమహమ్మదు బుహారీ కుటుంబానికినైజీరియా ప్రభుత్వానికిప్రజలకు… 140 కోట్ల భారతీయుల తరఫున నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.

@officialABAT

@NGRPresident”