Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నోయిడా లో ప్రధాన మంత్రి

నోయిడా లో ప్రధాన మంత్రి

నోయిడా లో ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘స్టాండ్ అప్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, మరియు మహిళలలో ఔత్సాహిక పారిశ్రామికులకు ఉత్తేజాన్ని నింపాలనే ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ కేటగిరీలకు చెందిన వారిలో కనీసం ఇద్దరు ఔత్సాహిక పారిశ్రామికులకు ఈ కార్యక్రమంలో భాగంగా రుణాలు సమకూర్చుతారు. రుణం రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి శ్రేణిలో ఉంటుంది. ఈ సందర్భంగా 5,100 ఇ-రిక్షా లను కూడా పంపిణీ చేశారు.

బాబూ జగ్ జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని బాబూ జీ కి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలిని ఘటించారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న పలు సందర్భాలలో బాబూ జీ వేరు వేరు అధికారిక బాధ్యతలను వహిస్తూ అందించిన సేవలు అత్యంత ఘనమైనవి అని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.

ఉద్యోగాలు కావాలని కోరుకొనే వారిని ఉద్యోగాలను ఇచ్చే వారుగా మార్చాలన్నదే తన సంకల్పమని ప్రధాన మంత్రి వివరించారు. ‘స్టాండ్ అప్ ఇండియా’ కార్యక్రమం దళితుల మరియు ఆదివాసీల జీవితాలలో పరివర్తనను తీసుకురాగలదని ఆయన చెప్పారు.

భారతదేశ పురోగతి ప్రస్థానంలో పేదలు భాగస్వామ్యం వహించినప్పుడే ఆ ప్రస్థానం సార్థకం అవుతుందని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. సభకు తరలి వచ్చిన వారు వారి పిల్లలకు, ప్రత్యేకించి ఆడ పిల్లలకు విద్యాబుద్ధులను చెప్పించాలని ఆయన వారికొక విన్న‌పం చేశారు.

అంత క్రితం, ప్రధాన మంత్రి కొందరు లబ్ధిదారుల కుటుంబాలతో కలసి తేనీరు సేవించారు; వారితో ఆయన ముచ్చటించారు. లబ్ధిదారులు ఈ సందర్భంగా ఇ-రిక్షాలు వారి జీవితాలను ఎంత బాగా మార్పు చేయగలవో చెప్పుకొచ్చారు. వారంతా వారి పిల్లలకు చదువు చెప్పించే జాగ్రత్త తీసుకోవాలి అంటూ ప్రధాన మంత్రి హితవు పలికారు.

ప్రధాన మంత్రి తాను ఒక ఇ-రిక్షాను మాట్లాడుకొని, అందులో కూర్చొని కొద్ది దూరం వేదిక వైపునకు ప్రయాణించారు. ఆ సవారీకి గాను సెల్ ఫోన్ ద్వారా చెల్లింపు జరిపారు.