Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నౌకాద‌ళ జ‌లాంత‌ర్గామి ఐఎన్ఎస్ క‌ల్‌వ‌రీ ని దేశ ప్ర‌జ‌ల‌కు రేపు అంకితం చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గురువారం ముంబ‌యి లో నౌకాద‌ళ జ‌లాంత‌ర్గామి ఐఎన్ఎస్ క‌ల్‌వ‌రీ ని దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌నున్నారు.

ఐఎన్ఎస్ క‌ల్‌వ‌రీ డీజిల్ మరియు విద్యుత్ ఆధారంగా ప‌నిచేసే, దాడికి దిగే సామర్థ్యాన్ని కలిగివున్నటువంటి జ‌లాంత‌ర్గామి. ఈ సబ్ మరీన్ ను భార‌తీయ నౌకాద‌ళం కోసమని మ‌ఝ్ గావ్ డాక్ శిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. భార‌తీయ నౌకాద‌ళం లోకి చేర్చుకోబోయే ఈ తరహా ఆరు జ‌లాంత‌ర్గాముల‌లో ఇది ఒక‌టో జ‌లాంత‌ర్గామి. అంతేకాదు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మంలో భాగంగా సిద్ధం చేసిన జ‌లాంత‌ర్గామి కూడా. ఫ్రాన్స్ స‌హ‌కారంతో ఈ ప్రాజెక్టును అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంది.

ర‌క్ష‌ణ మంత్రి, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంలో ముఖ్యులైన ఉన్న‌తాధికారులు మ‌రియు నౌకాద‌ళ సీనియ‌ర్ అధికారుల స‌మ‌క్షంలో ప్ర‌ధాన మంత్రి ఈ జ‌లాంత‌ర్గామిని నేవ‌ల్ డాక్ యార్డ్ లో అంకితం చేస్తారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటైన స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తారు. ఆయన జ‌లాంత‌ర్గామి లోకి వెళ్ళి దానిని ప‌రిశీలిస్తారు.

***