Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూజిలాండ్ ప్రధానితో టెలిఫోన్లో మాట్లాడిన ప్రధానమంత్రి


న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్లో మాట్లాడారుచరిత్రాత్మకమైనలక్ష్యపూరితమైనభారత్న్యూజిలాండ్‌కు పరస్పరం ప్రయోజనాలు అందించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏవిజయవంతంగా పూర్తయిందని నాయకులిద్దరూ సంయుక్తంగా ప్రకటించారు.

2025 మార్చిలో భారత్‌లో ప్రధాని లక్సన్ పర్యటించిన సమయంలో దీనికి సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయిఉమ్మడి లక్ష్యాన్నిరెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే రాజకీయ సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ.. రికార్డు స్థాయిలో నెలల్లో ఎఫ్‌టీఏ పూర్తయిందని నాయకులు అంగీకరించారుద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను ఈ ఎఫ్‌టీయే మరింత బలోపేతం చేస్తుందిమార్కెట్ అవకాశాలను విస్తరిస్తుందిపెట్టుబడులను ప్రోత్సహిస్తుందిఅలాగే రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేస్తుందిరెండు దేశాలకు చెందిన ఆవిష్కర్తలుఔత్సాహిక పారిశ్రామికవేత్తలురైతులుఎంఎస్ఎంఈలువిద్యార్థులుయువతకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది.

ఎఫ్‌టీఏ అందించే బలమైననమ్మకమైన పునాదితో వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపవుతుందనివచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి భారత్‌కు 20 బిలియన్ల యూఎస్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయనే విశ్వాసాన్ని నాయకులిద్దరూ వ్యక్తం చేశారుక్రీడలువిద్యప్రజా సంబంధాలు లాంటి ద్వైపాక్షిక సహకారం ఉన్న ఇతర రంగాల్లో సాధించిన పురోగతిని నాయకులు స్వాగతించారుఅలాగే భారత్న్యూజిలాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

సంప్రదింపులు కొనసాగించేందుకు వారు అంగీకరించారు.