Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ఇంట‌ర్ నేశన‌ల్ సోలర్ అల‌య‌న్స్ వ్యవస్థాప‌క స‌మావేశం యొక్క ప్రారంభిక స‌భ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ఇంట‌ర్ నేశన‌ల్ సోలర్ అల‌య‌న్స్ వ్యవస్థాప‌క స‌మావేశం యొక్క ప్రారంభిక స‌భ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ఇంట‌ర్ నేశన‌ల్ సోలర్ అల‌య‌న్స్ వ్యవస్థాప‌క స‌మావేశం యొక్క ప్రారంభిక స‌భ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ఇంట‌ర్ నేశన‌ల్ సోలర్ అల‌య‌న్స్ వ్యవస్థాప‌క స‌మావేశం యొక్క ప్రారంభిక స‌భ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


శ్రేష్ఠులైన అధ్య‌క్షులు శ్రీ మాక్రాన్, శ్రేష్ఠులైన అధ్య‌క్షులు మ‌రియు ప్ర‌ధానులు, ప్ర‌ముఖ అతిథులు,

మ‌హిళ‌లు మ‌రియు స‌జ్జ‌నులారా, మీకు ఇవే శుభాకాంక్ష‌లు. ఇంట‌ర్ నేశన‌ల్ సోలర్ అల‌య‌న్స్ స్థాప‌క స‌మావేశం సంద‌ర్భంగా మీకంద‌రికీ ఢిల్లీ లోకి నేను హార్దికంగా స్వాగతం పలుకుతున్నాను.

ఈ చ‌రిత్రాత్మ‌క‌మైన రోజు కు.. 2015 న‌వంబ‌ర్ లో పారిస్ లో 21వ కాన్ఫ‌రెన్స్ ఆఫ్ పార్టీస్ సందర్భంగా.. అంకురార్ప‌ణ జ‌రిగింది. ఆ విత్త‌నం ఈ రోజు మొల‌కెత్తింది.

ఈ మొక్క మ‌రింత‌గా పెర‌గ‌డంలో అమూల్య‌మైన పాత్ర‌ను పోషించింది ఫ్రాన్స్. మీ అంద‌రి కృషి మ‌రియు వ‌చ‌న‌బ‌ద్ధ‌త లేక‌పోతే ఇంట‌ర్ నేశన‌ల్ సోలర్ అల‌య‌న్స్ అనే ఈ మొక్క ను నాటడం వీలుపడేదే కాదు. ఈ కార‌ణంగా ఫ్రాన్స్ కు మ‌రియు మీకంద‌రికీ నేను ఎంత‌గానో కృత‌జ్ఞుడినై ఉన్నాను. ఈ కూట‌మిలో 121 దేశాలు చేరతాయని ఆశిస్తే 61 దేశాలు చేరాయి. వాటిలో 32 దేశాలు ఫ్రేమ్ వ‌ర్క్ అగ్రిమెంట్‌కు అనుమోదాన్ని కూడా తెలిపాయి. అయితే, ఈ కూట‌మి లో మ‌న భాగ‌స్వామ్య దేశాల‌కు తోడు అతిపెద్ద మిత్రునిగా ఆ సూర్య భ‌గ‌వానుడు ఉన్నారు; ఆయన బాహ్య ప్ర‌పంచానికి వెలుగులను పంచడమే కాక మ‌న సంక‌ల్పానికి శ‌క్తిని కూడా అందిస్తున్నారు.

మిత్రులారా,

ఈ పుడ‌మి జీవం పోసుకోవ‌డాని క‌న్నా ముందు నుండే.. ల‌క్ష‌లాది సంవ‌త్స‌రాల క్రితమే ఈ ఈ జ‌గ‌తికి ప్రకాశాన్ని మ‌రియు జీవాన్ని అందిస్తూ వ‌స్తున్నది సూర్య‌ గ్ర‌హ‌మే. జ‌పాన్ నుండి పెరూ వ‌ర‌కు, గ్రీస్ కానివ్వండి లేదా రోమ్ కానివ్వండి, ఈజిప్టు లేదా ఇన్‌కా మ‌రియు పురాత‌న‌ మాయా నాగ‌ర‌క‌త‌.. ప్ర‌తి నాగ‌ర‌క‌తా ర‌వి కి ప్రాముఖ్యాన్ని, గౌర‌వాన్ని ఇస్తూ వ‌చ్చాయి.

అయితే, భార‌తీయ త‌త్వ శాస్త్రంలో వేల సంవ‌త్స‌రాల క్రితం ఆదిత్యునికి ఇచ్చిన‌ కేంద్ర స్థానం అపూర్వ‌మైన‌టువంటిది.

భార‌త‌దేశంలో వేల సంవ‌త్స‌రాల క్రితం వేదాలు భాస్క‌రుడిని ప్ర‌పంచ‌ం యొక్క ఆత్మ‌ గా ఉద్ఘోషించాయి. భార‌త‌దేశంలో మార్తాండుని యావ‌జ్జీవితానికి ఒక వ‌న‌రు అని భావించారు. ప్ర‌స్తుతం జ‌ల‌ వాయు ప‌రివ‌ర్త‌న విసరే స‌వాలు ను ప‌రిష్క‌రించ‌డానికి మార్గాంత‌రాల‌ను అన్వేషిస్తున్న మ‌న ప్ర‌య‌త్నాల క్ర‌మంలో సమ‌గ్ర‌ దృక్ప‌థాన్ని గ‌మ‌నించి దానికి ప్రాచీన త‌త్వ శాస్త్రాన్ని మనం జోడించ‌వ‌ల‌సివుంది.

మిత్రులారా,

మ‌నమంతా క‌ల‌సిక‌ట్టుగా ఏమి చేయ‌గ‌లుగుతామ‌నే వాస్త‌వం పైన మ‌న హ‌రిత భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డుతుంది. ‘మ‌న‌ం ఏమి చేస్తున్నాం అనే దానికి, మ‌న‌ం ఏమి చేయ‌గలం అనే దానికి మ‌ధ్య ఉన్న తేడా చాలు ప్ర‌పంచం లోని స‌మ‌స్య‌ల‌లో చాలా వ‌ర‌కు సమస్యలను ప‌రిష్క‌రించ‌డానికి..’ అని మహాత్మ గాంధీ ఆడిన మాటలు ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయి.

ఇవాళ ప్ర‌పంచమంత‌టి నుండి ఇక్క‌డ‌కు విచ్చేసిన నాయ‌కుల స‌మ‌క్షంలో మాన‌వాళి యొక్క శ‌క్తి సంబంధ అవ‌స‌రాల‌ను ఒక స్థిర‌మైన ప‌ద్ధ‌తిలో ప‌రిష్క‌రించ గ‌లిగేందుకు దీటైన మ‌రియు సముచితమైన ప‌రిష్కారాన్ని సౌర‌ శ‌క్తి ప్ర‌సాదిస్తోందన‌డానికి ఈ స‌మావేశ‌ం ఓ ప్ర‌తీక‌గా నిలుస్తోంది.

మిత్రులారా,

మేము భార‌త‌దేశంలో ప్ర‌పంచంలో కెల్లా అతి పెద్ద‌దైన‌టువంటి న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ఆరంభించాం. మేము న‌వీక‌ర‌ణ యోగ్య వ‌న‌రుల ద్వారా 175 గీగా వాట్ల విద్యుత్తును ఉత్ప‌త్తి చేస్తాము. అందులో, 100 గీగా వాట్ల విద్యుత్తు ఉత్ప‌త్తి ని సౌర శ‌క్తి నుండి సంగ్ర‌హిస్తాము.

మేము ఇప్ప‌టికే 20 గీగా వాట్ల స్థాపిత సౌర విద్యుత్తు సామ‌ర్ధ్యం అనే ల‌క్ష్యాన్ని సాధించాం. భార‌త‌దేశంలో సాంప్ర‌దాయక శ‌క్తి వ‌న‌రుల కంటే న‌వీక‌ర‌ణ యోగ్య వ‌న‌రుల ద్వారా అధిక సామ‌ర్ధ్యాన్ని జోడించ‌డం జ‌రుగుతోంది.

విద్యుత్తు కొర‌త ఉన్న ప్రాంతాల‌లో సౌర శ‌క్తి ఆధారితమైన వీధి దీపాల‌ను ఏర్పాటు చేయాల‌నేది భార‌త‌దేశంలో ‘అట‌ల్ జ్యోతి ప‌థ‌కం’ యొక్క ధ్యేయంగా ఉంది. సోలర్ స్ట‌డీ ల్యాంప్ స్కీమ్ 70 ల‌క్ష‌ల మంది బ‌డి పిల్ల‌ల‌కు కాంతిని ప్రసాదిస్తోంది.

మ‌నం గ‌నుక సౌర శ‌క్తిని ఇత‌ర సాంకేతిక‌త‌ల‌తో జ‌త ప‌ర‌చ‌గ‌లిగితే ఒన‌గూరే ఫ‌లితాలు మ‌రింత ఉత్త‌మంగా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం పంపిణీ చేసిన 28 కోట్ల ఎల్ఇడి బ‌ల్బులు గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో 2 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా ఆదా చేయ‌డ‌మే కాకుండా 4 గీగా వాట్ల విద్యుత్తు ను కూడా ఆదా చేసిపెట్టాయి. అంతేకాక బొగ్గు పులుసు వాయువు ఉత్ప‌త్తి సైతం 30 మిలియ‌న్ ట‌న్నుల మేర‌కు త‌గ్గిపోయింది.

మిత్రులారా,

మేము ఒక్క భార‌త‌దేశంలోనే గాక యావ‌త్ ప్ర‌పంచంలో సౌర విప్ల‌వం రావాల‌ని అభిలషిస్తున్నాం. భార‌త‌దేశంలో శిక్ష‌ణ పొందిన సోలర్ మామాస్ తాలూకు గీతాల‌ను, ఉప‌న్యాసాల‌ను, ఇంకా వీడియోల‌ను మీరు గ‌మ‌నించారు. ఇప్పుడు ఈ సోలర్ మామాస్ అంటే ఏమిటో మీకు బాగా తెలుసును. వీరి కథే ఎంతో స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుంది.

ఐఎస్ఎ కార్ప‌స్ ఫండ్ కు మా వంతు వాటాను సమకూర్చడంతో పాటు ఐఎస్ఎ సెక్ర‌టేరియ‌ట్ ను ఏర్పాటు చేయ‌డానికి 62 మిలియ‌న్ డాల‌ర్ల సొమ్ము ను స‌మ‌కూర్చ‌డమైందని తెలియ జేయ‌డానికి మేం సంతోషిస్తున్నాం. సౌర శ‌క్తి రంగంలో ఐఎస్ఎ స‌భ్యుల‌కు ప్ర‌తి ఏటా 500 ట్రైనింగ్ స్లాట్స్ ను మేము స‌మ‌కూరుస్తామ‌ని కూడా నేను ఆనందంగా ప్ర‌క‌టిస్తున్నాను.

మేము యావ‌త్ ప్ర‌పంచంలో 143 మిలియ‌న్ డాలర్ల విలువ క‌లిగిన 13 సౌర ప‌థ‌కాల‌ను అయితే పూర్తి చేయ‌డ‌మో, లేదా ఆ ప‌థ‌కాలు అమ‌లు ద‌శ‌లో ఉండ‌ట‌మో జ‌రిగింది. అభివృద్ధి చెందుతున్న మ‌రో 15 దేశాల‌లో 27కు పైగా ప‌థ‌కాల‌కు 1.4 బిలియ‌న్ డాల‌ర్ల‌ స‌హాయాన్ని భార‌తదేశం స‌మ‌కూర్చ‌నుంది.

ఆధార‌ప‌డ‌ద‌గ్గ ప‌థ‌కాల‌కు రూపు రేఖ‌లను దిద్ద‌డం కోసం భాగ‌స్వామ్య దేశాల‌కు క‌న్స‌ల్‌టెన్సీ సంబంధిత మ‌ద్ధ‌తు ను ఇవ్వ‌గ‌లిగిన ఒక ప‌థ‌కాల స‌న్నాహక స‌దుపాయాన్ని మేము ప్రారంభించాం.

ఈ రోజున సౌర సాంకేతిక రంగంలో అంత‌రాన్ని అధిగ‌మించ‌డానికి ఒక సోలర్ టెక్నాల‌జీ మిశన్ ను సైతం భార‌త‌దేశం ప్రారంభించ‌నుంద‌ని చాట‌డమూ నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ కార్య‌క్ర‌మం అంత‌ర్జాతీయంగా దృష్టి సారిస్తుంది. ఇది మా ప్ర‌భుత్వ సంస్థలను, సాంకేతిక సంస్థలను మ‌రియు విద్యా సంస్థ‌లను అన్నింటినీ ఏకం చేయ‌డం ద్వారా సౌర సాంకేతిక రంగంలో ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి ప్ర‌య‌త్నాల‌కు నాయ‌త్వాన్ని అందిస్తుంది.

మిత్రులారా,

జ‌లం మాదిరిగానే అధికంగా ల‌భ్య‌మ‌వుతున్న సౌర శ‌క్తిని జాగ్ర‌త్త‌గా ఉప‌యోగించుకోవ‌డం వ‌ల్ల మ‌నం సమృద్ధంగా మార‌డంతో పాటు ఈ ధ‌ర‌ణి మీద క‌ర్బ‌న పాద ముద్ర‌ను ఖాయంగా త‌గ్గించ‌గ‌లుగుతాం.

మిత్రులారా,

మ‌నం కొన్ని అంశాల‌ను దృష్టిలో పెట్టుకోవాల్సివుంది. అవి ఏమిటంటే.. ఒక ప‌క్క సంవ‌త్స‌రం పొడ‌వునా ప్రభాకరుడు ప్ర‌కాశిస్తున్న దేశాలు అనేకం ఉన్నప్ప‌టికీ, సౌర శ‌క్తి ని ఉప‌యోగించుకోవడంలో వ‌న‌రుల మ‌రియు సాంకేతిక‌త యొక్క లోపం ఒక అడ్డంకిగా నిలబడుతున్నాయి.

మ‌రొక ప‌క్క జ‌ల‌ వాయు ప‌రివ‌ర్త‌న ప్ర‌భావం వ‌ల్ల త‌మ ఉనికికే ముప్పు వాటిల్లుతున్న దేశాలు మ‌రియు ద్వీపాలు కూడా ఉన్నాయి. ఇక మూడో అంశం- సౌర శ‌క్తి కేవ‌లం వెలుతురు కోస‌ం కాదు; అది ర‌వాణా, కాలుష్యానికి తావు లేని వంట‌, వ్య‌వ‌సాయం, సోలర్ పంప్స్ మరియు ఆరోగ్య సంర‌క్ష‌ణ ల వంటి అనేక రంగాల‌ లోనూ అంతే ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

సౌర శ‌క్తి వాడుకను ప్రోత్స‌హించాలంటే సాంకేతిక‌త‌ యొక్క ల‌భ్య‌త మ‌రియు సాంకేతికత ను అభివృద్ధిపరచుకోవడం, ఆర్థిక వ‌న‌రులు, వ్య‌యంలో త‌గ్గుద‌లను సాధించడం, నిల్వ సంబంధ సాంకేతిక‌ను అభివృద్ధి చేసుకోవడం, పెద్ద ఎత్తున త‌యారీని చేపట్టడం, ఇంకా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు అనువైన ఇకో- సిస్ట‌మ్ అత్యంత ఆవ‌శ్య‌కాలు.

మిత్రులారా,

ముందుకు సాగిపోవాలంటే ఏం చేయాలో మ‌న‌మందరమూ ఆలోచించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. పది కార్యాచ‌ర‌ణ అంశాలు నా బుర్ర‌ కు తోచాయి. వాటిని ఈ రోజు మీ ముందు ఉంచదల‌చుకొన్నాను. అన్నింటి లోకీ మొట్ట‌మొద‌టిది.. త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన‌టువంటి, ఉత్త‌మమైన సౌర సాంకేతిక‌త సుల‌భంగాను, సౌక‌ర్య‌వంతంగాను అందరికీ అందుబాటులో ఉండేట‌ట్టు మ‌నం చూడాల్సివుంది.

మ‌న శ‌క్తి వ‌న‌రుల మిశ్ర‌ణంలో సౌర శ‌క్తి తాలూకు వాటాను మ‌నం పెంచుకోవ‌ల‌సివుంది. అనేక అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌ల సౌర సంబంధి ప‌రిష్కారాల‌ను ఆవిష్క‌రించ‌గ‌ల నూత‌న ప‌ద్ధ‌తుల‌ను మనం ప్రోత్స‌హించి తీరాలి.

సౌర సంబంధ ప‌థ‌కాల‌కు త‌క్కువ న‌ష్ట భ‌యంతో కూడిన ఆర్థిక స‌హాయాన్ని మ‌రియు రాయితీ క‌ల‌గ‌ల‌సిన ఆర్థిక స‌హాయాన్ని మ‌నం అంద‌జేయాల్సిన అవ‌స‌రం ఉంది. సౌర శ‌క్తి సంబంధ ప‌రిష్కార మార్గాల‌ను అభివృద్ధి ప‌ర‌చ‌డం మ‌రియు వాటిని అమ‌లు చేయ‌డానికి ఒక నూత‌న ఉత్తేజాన్ని అందించ‌గ‌ల నియంత్ర‌ణ పూర్వ‌క ప్ర‌మాణాల‌ను మ‌నం అభివృద్ధి ప‌ర‌చుకోవాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల‌లో ఆధారప‌డ‌ద‌గిన‌టువంటి సౌర శ‌క్తి ప‌థ‌కాల‌కు క‌న్స‌ల్‌టెన్సీ స‌పోర్టును తీర్చి దిద్ద‌డం కూడా అత్యావ‌శ్య‌కం.

మ‌నం చేసే కృషిలో మ‌రింత ఎక్కువ ప‌క్షాల‌కు క‌లుపుకొని పోవ‌డంపైన శ్ర‌ద్ధ వహించాలి. స్థానిక అంశాల‌ను మ‌రియు స్థితిగ‌తుల‌ను లెక్క‌ లోకి తీసుకొనే ప్రావీణ్య‌తా కేంద్రాల స‌మ‌గ్ర‌మైన నెట్ వ‌ర్క్ ను మ‌నం ఏర్పాటు చేసుకోవాలి. స‌మ‌గ్ర‌మైన అభివృద్ధి సాధ‌న‌లో సౌర శ‌క్తి విధానాన్ని ఒక భాగంగా మ‌నం ప‌రిగ‌ణించాలి. త‌ద్వారా ఎస్‌డిజి ల సాధ‌న‌లో అది గ‌రిష్ఠ తోడ్పాటు ను అందిచ‌గ‌లుగుతుంది. మ‌నం ఐఎస్ఎ స‌చివాల‌యాన్ని బ‌ల‌మైందిగా, వృత్తి నైపుణ్యంతో కూడిన‌దిగా తీర్చి దిద్దాలి.

మిత్రులారా,

ఆచ‌ర‌ణీయ‌మైన‌టువంటి ఈ అంశాల‌న్నింటి పైనా ఐఎస్ఎ అండదండ‌ల‌ను తీసుకోవ‌డం ద్వారా మ‌నం మ‌న ముందున్న దారిలో శరవేగంగా దూసుకు పోగ‌ల‌మ‌ని నేను న‌మ్ముతున్నాను.

మిత్రులారా,

ఈనాటి ఈ ఘ‌ట్టం మ‌న ప్ర‌యాణంలో ఒక ఆరంభం మాత్ర‌మే. మ‌న మైత్రీబంధం సూర్య జ్యోతి స‌హాయంతో మ‌న‌ జీవితాల‌ను మ‌రింత కాంతిమంతం చేసుకోగ‌లుగుతుంది. ఇది ‘దినకరుడిని మ‌రింత ఉజ్జ్వలంగా వెలిగేట‌ట్టు చేద్దాం’ అనే ప్ర‌బోధాన్ని సుబోధకంగా మార్చ‌గ‌ల‌దు. ‘వ‌సుధైవ కుటుంబకమ్’ అనేది భార‌తీయ వేదాంతానికి ఆత్మ‌గా ఉంటూ వ‌స్తోంది. ‘యావ‌త్ ప్ర‌పంచ‌మూ ఒక ప‌రివార‌మే’ అని ఈ వాక్యం యొక్క భావం.

యావ‌త్ ప్ర‌పంచం యొక్క, యావ‌త్ మాన‌వ జాతి యొక్క శ్రేయాన్ని మ‌నం కోరుకొంటే త‌ద్వారా మ‌నం ఐక‌మ‌త్యంతో ఉండి, మ‌న ప్ర‌య‌త్నాలను మ‌రియు ల‌క్ష్యాల‌ను సాధించ‌డంలో ఒక కుటుంబం వ‌లే పాటుప‌డ‌గ‌లుగుతాం.

మిత్రులారా,

‘త‌మసోమా జ్యోతిర్గ‌మ‌య’ (మ‌న‌మంద‌రమూ చీక‌టిలో నుండి వెలుగు దిశ‌గా సాగుదాం) అంటూ నాటి మునులు చేసిన ప్రార్థ‌న‌ ను మ‌నం ఫ‌లింప చేసుకోవాలంటే అనుస‌రించవలసిన మార్గం ఇదే.

మీకంద‌ర‌కూ అనేకానేక ధ‌న్య‌వాదాలు.

బహుధా ధన్యవాదాలు.