Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పట్నా పక్షుల అభయారణ్యం, ఛారీ-ధండ్‌లను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడాన్ని స్వాగతించిన ప్రధాని


ఎటా (ఉత్తరప్రదేశ్)లోని పట్నా పక్షుల అభయారణ్యాన్నికచ్ (గుజరాత్)లోని ఛారీధండ్‌ను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారుస్థానికులకుచిత్తడి నేలల సంరక్షణపై ఆసక్తి ఉన్నవారికి శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారుజీవవైవిధ్యాన్ని కాపాడటంలోకీలకమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంలో తమ చిత్తశుద్ధిని ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తోందని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పోస్టుకు ప్రధానమంత్రి స్పందిస్తూ:

‘‘ఎటా (ఉత్తరప్రదేశ్)లోని పట్నా పక్షుల అభయారణ్యాన్నికచ్ (గుజరాత్)లోని ఛారీధండ్‌‌ను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడం ఆనందదాయకంఅక్కడి స్థానికులకుచిత్తడి నేలల పరిరక్షణపై ఆసక్తి ఉన్నవారికి శుభాకాంక్షలుజీవవైవిధ్యాన్ని కాపాడటంలోకీలకమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంలో మా చిత్తశుద్ధిని ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తోందిఈ చిత్తడి నేలలు అనేక వలసస్థానిక జీవ జాతులకు సురక్షితమైన ఆవాసాలుగా కొనసాగుతాయని ఆకాంక్షిస్తున్నాను.’’

 

***