Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు శ్రీమతి డెల్సీ ఎలోయినా రోడ్రిగ్జ్ గోమెజ్ నేడు ఫోన్ చేసి మాట్లాడారు. 

వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, డిజిటల్ సాంకేతికత, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల మధ్య సంబంధాలతో సహా అన్ని రంగాలలో భారత్-వెనిజులా భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి, బలోపేతం చేసేందుకు ఇరువురు నాయకులు అంగీకరించారు. 

పరస్పర ఆసక్తి ఉన్న వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్న ఇద్దరు నాయకులు.. ‘గ్లోబల్ సౌత్’ విషయంలో రెండు దేశాల సన్నిహిత సహకారానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రధానంగా పేర్కొన్నారు. 

నిరంతరం ఒకరికొకరు అందుబాటులో ఉండేందుకు ఇద్దరు నాయకులు అంగీకారం తెలిపారు. 

 

***