Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పద్మ పురస్కారాల వేడుకకు సంబంధించి విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి

పద్మ పురస్కారాల వేడుకకు సంబంధించి విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి


పద్మ పురస్కారాల వేడుకకు సంబంధించి విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

సమాజానికిదేశానికి వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను సత్కరించటం వల్ల ఈ వేడుక గర్వకారణంగాకృతజ్ఞతబద్ధంగాస్ఫూర్తిదాయకంగా సాగిందని ప్రధానమంత్రి అన్నారు.

భారతదేశ బలం ఇటువంటి అద్భుతమైన వ్యక్తుల్లోనే ఉందనివీరి కృషి మన ఉమ్మడి ప్రయాణాన్ని మరింత మెరుగుపరుస్తుందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌లో వరుస ట్వీట్ల ద్వారా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

“ఇవాళ పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యానుసమాజానికిదేశానికి విశేష సేవలందించిన ప్రముఖులను గౌరవించుకుంటున్న తరుణంలో ఈ వేడుక ఎంతో గర్వంతోకృతజ్ఞతతోస్ఫూర్తితో నిండిపోయింది.

@పద్మఅవార్డులు”

“మన సమష్టి ప్రయాణాన్ని సుసంపన్నం చేసే ఇలాంటి విశిష్ట వ్యక్తుల్లోనే భారతదేశ బలం దాగుంది.

పద్మ పురస్కారాల ప్రదానోత్సవానికి సంబంధించి మరికొన్ని విశేషాలను ఇక్కడ చూడండి.

@పద్మఅవార్డులు”

“పద్మ అవార్డు గ్రహీతల జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంవారి అద్భుతమైన కృషికి సంబంధించి కొన్ని విశేషాలను అధికారిక పద్మ అవార్డుల ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ తెలియజేస్తుందిమీరు కూడా ఒకసారి వీక్షించండి.

instagram.com/padmaawards/