పిఎంఇండియా
ప్రధానమంత్రి: సరే మనం ప్రారంభిద్దాం. చెప్పండి!
విద్యార్థి: నా పేరు సాన్వి ఆచార్య, నేను గుజరాత్ నుంచి వచ్చాను. నా మొదటి ప్రశ్న: తల్లిదండ్రులు మా గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులు మాకు మద్దతు ఇస్తారు. కానీ చదివేందుకు ఉపాధ్యాయులు ఒక విధానాన్ని సూచించినప్పుడు, తల్లిదండ్రులు దానికి భిన్నమైన విధానాన్ని అనుసరించాలని పట్టుబడుతుంటారు. విద్యార్థులుగా మాలో మరో ధోరణి ఉంటుంది దీనితోనే అసలు సమస్య మొదలవుతుంది. ఆ సమయంలో ఏ నమూనా సరైనదో తెలియక మేం అయోమయంలో పడతాం.
ప్రధానమంత్రి: చూడండీ, జీవితం కూడా ఇలాగే ఉంటుంది. ప్రధానమంత్రి అయిన తర్వాత నన్ను కొంతమంది ఒక విధంగా పనులు చేయమని అంటారు. మరికొందరు వేరే విధంగా చేయమని అంటారు. భోజన సమయంలో మీ ఇంటిని చూడండి – ప్రతి ఒక్కరి తినే విధానం భిన్నంగా ఉంటుంది. ఒకరు కూరగాయలతో ప్రారంభిస్తారు.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: మరొకరు పప్పుతో మొదలుపెడతారు.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: మరొకరు రోటీ, కూర, పప్పు అన్నీ కలిపి తింటారు. ప్రతి ఒక్కరూ ఒక్కో రకమైన నమూనాను కలిగి ఉంటారు… కదా?
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: మరి మీ సంగతి ఏంటి? మీరు వాళ్ళని అనుకరిస్తుంటారా?
విద్యార్థి: లేదు, సర్!
ప్రధానమంత్రి: మీరు మీకు నచ్చినట్లుగా తింటారు. అప్పుడే మీరు దాన్ని ఆనందిస్తారు కదా?
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: అదేవిధంగా, కొంతమంది రాత్రిపూట బాగా చదువుకోవచ్చని భావిస్తారు. మరికొందరు ఉదయం 4 గంటలకే మేల్కొనడానికి ఇష్టపడతారు. ప్రతి ఒక్కరికీ వారి సొంత శైలి ఉంటుంది.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: అయితే కొంతమంది నిజాయితీగా ఉండరు. వాళ్లు రాత్రి పడుకునే ముందు తమ తల్లితో, “రేపటి నుంచి నేను ఉదయం త్వరగా లేచి చదవడం ప్రారంభిస్తాను” అని చెబుతారు. కానీ తల్లి వారిని నిద్రలేపినప్పుడు మాత్రం వారు, “వద్దు, ఇప్పుడే కాదు” అని చెబుతూ మేల్కొనడం వాయిదా వేస్తూ ఉంటారు.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: మొదటి విషయం ఏమిటంటే: మీ సొంత నమూనాను మీరు నమ్మండి. అయితే సూచనలనూ జాగ్రత్తగా వినండి. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాటిలో ఏదైనా జోడించడం మీ నమూనాకు సహాయపడుతుందని మీరు భావిస్తే… దానిని జోడించండి. అంతేకానీ ఎవరో చెప్పినందుకు కాదు. మీ సొంత అనుభవం మీకు చెప్పే దానిని బట్టి మీరు జోడించడం గురించి నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు, నేను పరీక్షా పే చర్చను ప్రారంభించినప్పుడు నాకు ఒక నమూనా ఉంది. నిరంతరం నేను దానిని మెరుగుపరుస్తూనే ఉన్నాను.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: నేను దానిని మారుస్తూనే ఉన్నాను. ఈసారి పలు రాష్ట్రాల్లోనూ దీనిని నిర్వహించాం. నేను నా నమూనాను మార్చాను కానీ దాని మూలాన్ని ఎప్పుడూ వదులుకోలేదు.
విద్యార్థి: అవును, సర్!
విద్యార్థి: వారి స్వభావం చాలా మంచిది. వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. పిల్లలందరితో ఆయన సులభంగా కలిసిపోయారు. ప్రధానమంత్రి గారు మాకు చెప్పారు… మనం అందరి మాట వినాలి, ప్రతి ఒక్కరి నుంచి కొన్ని మంచి లక్షణాలను తీసుకోవాలి అని. కానీ మన సొంత ప్రవర్తనపైనా మనం దృష్టి పెట్టాలి. మనం ఉత్తమ లక్షణాలను అలవర్చుకోవాలి. క్రమంగా మన సొంత మార్గాన్ని మనం మెరుగుపరచుకోవాలి.
విద్యార్థి: నర్మదే, సర్!
ప్రధానమంత్రి: నర్మదే హర్!
విద్యార్థి: సర్, నా పేరు ఆయుశ్ తివారి. నా ప్రశ్న: తరచుగా మనం పాఠశాలలో టీచర్ వేగాన్ని అందుకోలేం. మనం తప్పిపోయిన వాటిని కవర్ చేయడానికి ప్రయత్నించడంలోనే మనం తదుపరి అధ్యాయాల ట్రాక్‌నూ కోల్పోతాం, ఆ విషయంలో వెనుకబడిపోతాం. ఈ పరిస్థితిలో మనం ఎలా వ్యవహరించాలి?
ప్రధానమంత్రి: అంటే మీ టీచర్ మీద మీకు ఫిర్యాదు ఉందా?
విద్యార్థి: లేదు, సర్!
ప్రధానమంత్రి: కానీ, తెలివిగా మీరు మీ ఫిర్యాదును టీచర్ మీద చెప్పారు. కాబట్టి నేను టీచర్ తరపున సమాధానం ఇస్తాను.
విద్యార్థి: సరే, సర్!
ప్రధానమంత్రి: టీచర్ తన వేగాన్ని విద్యార్థి కంటే ఒక అడుగు ముందు ఉంచాలి – కానీ మరీ ఎక్కువ కాదు. లక్ష్యం చేరుకోగలిగేలా ఉండాలి, కానీ సులభంగా లభించేలా కాదు.
విద్యార్థి: అవును, సర్!
విద్యార్థి: సర్, ఎగ్జామ్ వారియర్‌లో మంత్రం 26 ఇలా ఉంది: “లక్ష్యం అనేది చేరుకోగలిగేంత దూరంలో ఉండాలి కానీ సులభంగా సాధించేలా కాదు.”
ప్రధానమంత్రి: వావ్! మీ అందరికీ అన్నీ గుర్తున్నాయా?
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: చూడండి, టీచర్ యాభై అడుగులు ముందుంటే, విద్యార్థి ఇలా అంటాడు, “ఇది చాలా దూరం, నేను ఇది చేయలేను.” ఒక రైతు పొలం దున్ని నేలను సిద్ధం చేసినట్లుగానే ఒక టీచర్ కూడా విద్యార్థి మనస్సును సిద్ధం చేయాలి. ఎలా? జనవరి మూడో వారంలో ఉపాధ్యాయుడు చరిత్ర పాఠం నేర్పించాలని ప్లాన్ చేస్తున్నాడని అనుకుందాం. జనవరి 1న, వారు ఇలా ప్రకటించాలి: “మొదటి వారంలో నేను ఈ పాఠం నేర్పుతాను… రెండో వారంలో ఇది… మూడో వారంలో ఇది…” అప్పుడు రాబోయే మూడు వారాల్లో ఏమి జరుగుతుందో మీకు తెలుస్తుంది. టీచర్ ఇలా చెప్పవచ్చు, “నేను బోధించే ముందే చదవడం ప్రారంభించండి. సిద్ధమై రండి, సందేహాలు అడగండి.”
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: మీకు అవసరమైతే, గూగుల్‌లో శోధించి సిద్ధం అవ్వండి.
విద్యార్థి: సరే, సర్!
ప్రధానమంత్రి: మరి ఆ పాఠాన్ని టీచర్ తరగతిలో చెప్పినప్పుడు ఎలా ఉంటుంది?
విద్యార్థి: సర్, మాలో ఉత్సుకత పెరుగుతుంది.
విద్యార్థి: సర్, మాకు ఆసక్తిగా ఉంటుంది. ఇప్పటికే చదివాం కాబట్టి బాగా అర్థమవుతుంది.
విద్యార్థి: మా ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
ప్రధానమంత్రి: మాన్సీ!
విద్యార్థి: సర్, ఒక పాఠం చాలా ఆసక్తికరంగా అనిపిస్తే, మేం దాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటాం, దానిని బాగా పునశ్చరణ చేయడంలో ఇది మాకు సహాయపడుతుంది.
ప్రధానమంత్రి: చెప్పండీ, ఇది సులభమైన పద్ధతి కాదా?
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: అప్పుడు మీ టీచర్ వేగంతో మీకు సమస్య ఉంటుందా?
విద్యార్థి: లేదు, సర్!
ప్రధానమంత్రి: మీకు వెనకబడిపోయినట్లు అనిపిస్తుందా?
విద్యార్థి: లేదు, సర్!
ప్రధానమంత్రి: ఎందుకు? మీరు మీ టీచర్ కంటే ఒక అడుగు ముందే ఉంటారు.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: మనస్సును సిద్ధం చేసుకోండి, తరువాత మనస్సును అనుసంధానించండి, ఆపై చదివిన విషయాలను మనస్సులో నాటండి. ఈ విధంగానే ఎల్లప్పుడూ విద్యార్థులు విజయం సాధిస్తారని మీరు తెలుసుకుంటారు.
విద్యార్థి: గౌరవనీయ ప్రధానమంత్రితో ముఖాముఖి కూర్చుని ప్రశ్నలు అడగడానికి, వారి ఆలోచనలను పంచుకునేందుకు అవకాశం అందరికీ లభించదు. టీచర్ కంటే రెండు అడుగులు వెనుకబడి ఉండటానికి బదులుగా, మనం రెండు అడుగులు ముందుకు ఉండాలని ఆయన మాకు చెప్పారు. అప్పుడు మనం ఎప్పటికీ వెనుకబడి ఉండలేం.
విద్యార్థి: నమస్కారం, సర్!
ప్రధానమంత్రి: నమస్కారం!
విద్యార్థి: నేను శ్రేయా ప్రధాన్, సిక్కిం నుంచి వచ్చాను. సర్, నేను సొంతంగా ఒక పాటను స్వరపరిచాను. ఇది మూడు భాషల్లో రాసిన పాట.
ప్రధానమంత్రి: ఓహ్, అద్భుతం!
విద్యార్థి: హిందీ, నేపాలీ, బెంగాలీ భాషల్లో రాసిన పాట. ఇది ఒక దేశభక్తి గీతం.
ప్రధానమంత్రి: అవునా, దయచేసి ఒకసారి పాడి వినిపించు!
విద్యార్థి: నేను దీనికి మా భరత భూమి (హమారా భారత్ భూమి) అని చిన్న పేరు పెట్టాను.
ప్రధానమంత్రి: అంటే కవిత్వం రాయడం మీకు ఇష్టం కదా?
విద్యార్థి: అవును, సర్! ఎక్కువగా నేను ప్రకృతి గురించి కవితలు రాస్తుంటాను.
ప్రధానమంత్రి: ఆహా, ప్రకృతి గురించా!
విద్యార్థి: కొన్నిసార్లు నేను మానవత్వం గురించి కూడా రాశాను. అవును, సర్!
ప్రధానమంత్రి: సరే, మనమంతా ఆ పాటను విందాం!
విద్యార్థి: మన భారతదేశం రుషుల భూమి.
మన భారతదేశం రుషుల భూమి.
భిన్నత్వంలో ఏకత్వం, ప్రశాంత వాతావరణం.
భిన్నత్వంలో ఏకత్వం, ప్రశాంత వాతావరణం.
దేవ దేవతలకు ప్రియమైనది, మానవత్వం మన నిజమైన నివాసం.
ప్రధానమంత్రి: అద్భుతం! చాలా బాగుంది! మీరు దేశ ఐక్యత గురించి చక్కగా చెప్పారు. వన్ ఇండియా, బెస్ట్ ఇండియా. మాన్సీ, మీ దగ్గర కూడా ఒక పాట ఉండాలి కదా?
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: నువ్వు ఏది పాడతావు? చెప్పు.
విద్యార్థి: సర్, నేను ఒక పాట పాడాలనుకుంటున్నా.
ప్రధానమంత్రి: సరే, ప్రారంభించు!
విద్యార్థి: సర్, ఈ పాట మా అమ్మ రాసింది, దీనిని విద్యార్థులకు అంకితం చేసింది.
ప్రధానమంత్రి: అవునా, చాలా మంచిది… పాడడం ప్రారంభించు!
విద్యార్థి: ముందుకు సాగుతూ ఉండండి. మున్ముందుకు సాగుతూ ఉండండి. కృషి చేస్తూనే ఉండండి. అనుకున్నది సాధిస్తూనే ఉండండి. ప్రపంచం మొత్తం మిమ్మల్ని అనుసరిస్తుంది. కష్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. ప్రపంచం మొత్తం మిమ్మల్ని అనుసరిస్తుంది. కష్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. ముందుకు సాగుతూ ఉండండి. మున్ముందుకు సాగుతూ ఉండండి.
ప్రధానమంత్రి: వాహ్! అద్భుతంగా ఉంది! మీ అమ్మ గారికి నా అభినందనలు తెలియజేయండి.
విద్యార్థి: ధన్యవాదాలు, సర్!
ప్రధానమంత్రి: మీ అమ్మ గారు నిజంగా స్ఫూర్తిదాయకంగా రాశారు!
విద్యార్థి: సర్, నాకు యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది, అలాగే ఫేస్‌బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ కూడా.
ప్రధానమంత్రి: అవునా, నిజమా!
విద్యార్థి: అవును, సర్! నా ఫేస్‌బుక్ పేజీకీ లక్షన్నర మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ప్రధానమంత్రి: లక్షా యాబై వేల మందా!
విద్యార్థి: నేను దీన్ని చాలా ఆస్వాదించాను, మిమ్మల్ని కలవడం నాకు గొప్ప గౌరవం, గర్వకారణం.
ప్రధానమంత్రి: రండి, అందరూ దయచేసి ఇలా కూర్చోండి! అస్సాంలో గమోచా అని పిలిచే దీనితోనే ఈ రోజు నేను మిమ్మల్ని స్వాగతించాను. ఇది చాలా ప్రత్యేకమైనది, నాకు అత్యంత ఇష్టమైనది. దీని అల్లిక చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది అస్సాం, ఈశాన్య ప్రాంతాల్లో మహిళా సాధికారతకు చిహ్నం. దీనిని ఇంట్లోనే తయారు చేస్తారు. అక్కడ మహిళల బలం, శక్తి ఎలా పనిచేస్తుందో నిజంగా ఇది చూపిస్తుంది. ఇది హృదయాన్ని గౌరవం, ప్రశంసలతో నింపుతుంది. కాబట్టి ఈ రోజు పిల్లలకు అస్సాం గమోచాను అందించాలని నేను భావించాను.
విద్యార్థులు: ధన్యవాదాలు, సర్! ధన్యవాదాలు, సర్!
విద్యార్థి: నా పేరు సబావత్ వెంకటేష్.
ప్రధానమంత్రి: వెంకటేష్ గారూ, చెప్పండి!
విద్యార్థి: సర్, నాకు టెక్నాలజీ, రోబోటిక్స్ అంటే చాలా ఆసక్తి. ఈ రోజుల్లో చాలా మంది నైపుణ్యాలు ముఖ్యమని అంటున్నారు, మరికొందరు మార్కులు ముఖ్యమని అంటున్నారు. దీని గురించి ఆలోచించడం వల్ల మాలో భయం కలుగుతుంది. కాబట్టి దయచేసి చెప్పండి సర్, నైపుణ్యాలు ముఖ్యమా లేక మార్కులా?
ప్రధానమంత్రి: ఏది ముఖ్యమైనది – ఇదా లేదా అదా, తినడమా లేదా నిద్రపోవడమా, చదువుకోవడమా లేదా ఆడుకోవడమా – ఇలాంటి ప్రశ్నలకు ఒకే ఒక సాధారణ సమాధానం ఉంది: సమతుల్యత. ప్రతిదీ సమతుల్యతలో ఉండాలి. మీరు ఒక వైపునకే ఎక్కువగా వంగి ఉంటే, మీరు పడిపోతారా లేదా?
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: మరి మీరు సరిగ్గా సమతుల్యం చేసుకుంటే, మీరు ఎప్పుడైనా పడిపోతారా?
విద్యార్థి: లేదు, సర్!
ప్రధానమంత్రి: కాబట్టి అది సులభమైన నిజం. ఇప్పుడు, నైపుణ్యాల గురించి: ఇవి రెండు రకాలు. ఒకటి జీవన నైపుణ్యాలు. మరొకటి వృత్తిపరమైన నైపుణ్యాలు. ఎవరైనా ఏది ఎక్కువ ముఖ్యమని నన్ను అడిగితే, నేను రెండూ ముఖ్యమే అని చెబుతాను. చెప్పండీ, చదువు లేకుండా, పరిశీలన లేకుండా, జ్ఞానం లేకుండా, ఏదైనా నైపుణ్యాన్ని సంపాదించవచ్చా?
విద్యార్థి: లేదు, సర్!
ప్రధానమంత్రి: కాబట్టి నైపుణ్యానికి మూలం జ్ఞానమే అవుతుంది.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: కాబట్టి, జ్ఞానం తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉండదు. మీరు చాలా బాగా చదువుకున్నారని అనుకుందాం, కానీ ఒక రోజు మీ తల్లిదండ్రులు బయటకు వెళతారు. మీకు ఆకలిగా ఉంది, వంటగదిలో చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి. కానీ ఏం చేయాలి, ఏ పాత్రలో ఏం ఉందో, ఎలా వండాలో మీకు తెలియదు. ఎందుకు? ఎందుకంటే మీరు ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. అందుకే జీవన నైపుణ్యాలు రోజువారీ జీవితానికి చాలా అవసరం. మీ దినచర్య, మీ నిద్ర వేళలు తెలుసుకోవడం, మీ వయస్సు ప్రకారం వ్యాయామం చేయడం, కొత్త వ్యాయామాలు నేర్చుకోవడం, వ్యక్తులను కలిసినప్పుడు విశ్వాసంగా మాట్లాడటం, రైల్వే స్టేషన్‌లో టికెట్ ఎలా కొనాలో తెలుసుకోవడం – ఇవి మీరు తప్పనిసరిగా గ్రహించాల్సిన జీవన నైపుణ్యాలు.
ఇప్పుడు, వృత్తిపరమైన నైపుణ్యాలు: మీరు డాక్టర్ కావాలనుకుంటే… మీ వైద్య నైపుణ్యాలను నిరంతరం నవీకరించాలి. “నేను విశ్వవిద్యాలయంలో నంబర్ వన్, కాబట్టి నేను ఆపరేషన్ చేయగలను” అని చెప్పడం సరిపోదు. మీరు హార్ట్ స్పెషలిస్ట్ కావాలనుకుంటే పుస్తకాలు మీకు సహాయపడతాయి, కానీ అవి మిమ్మల్ని అలా చేయలేవు. మీరు ప్రతి దశలో రోగులతో కలిసి పనిచేసినప్పుడు, మీ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే మీరు హార్ట్ స్పెషలిస్ట్ అవుతారు. అదేవిధంగా, మీరు న్యాయవాది కావాలనుకుంటే మీకు అన్ని రాజ్యాంగ నిబంధనలు, శిక్షలు, బెయిల్ నియమాలు తెలిసి ఉండవచ్చు. కానీ ప్రాక్టీస్ చేసే న్యాయవాది కావాలంటే మీరు మరొక న్యాయవాది కింద జూనియర్‌గా పని చేయాలి.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: వృత్తి నైపుణ్యాలను నేర్చుకోవాలి. వాటి ద్వారా మీరు అభివృద్ధి చెందాలి. జీవన నైపుణ్యాల విషయంలో రాజీ పడకూడదు-100 శాతం వాటిని సాధించాలి. మీరు ఎంచుకున్న ఏ వృత్తిలోనైనా వృత్తి నైపుణ్యాలను నిరంతరం నవీకరించాలి. గతంలో గుండె సంబంధ సమస్యలు గల రోగులకు చికిత్సలో తక్కువ సాంకేతికత ఉండేది. నేడు కొత్త సాంకేతికత అందుబాటులో ఉంది. మీరు 40 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటికీ, మీరు కొత్త సాంకేతికతను నేర్చుకోవాలి. కాబట్టి విద్య, నైపుణ్యం కవల సోదరుల వంటివి. అవి వేరు వేరు కాదు. అయితే నైపుణ్యం జీవితంలో తప్పనిసరి.
విద్యార్థి: నేను చాలా పేద కుటుంబానికి చెందినవాడిని. మా కొడుక్కి ఈ అవకాశం లభించిందని మా కుటుంబం గర్వంగా ఉంది. నేను మీతో మాట్లాడతానని తెలిసి వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మాకూ, మీతో మాట్లాడటం గొప్ప అవకాశం.
విద్యార్థి: జై హింద్, సర్! నా పేరు ఇమోటా కె శ్యామ్. నేను మణిపూర్‌లోని ఇంఫాల్‌లో గల సైనిక్ స్కూల్ నుంచి వచ్చాను. సర్, మీరు చిన్నప్పటి నుంచీ నాకు గొప్ప స్ఫూర్తి. నా పుట్టినరోజు కూడా మీ పుట్టినరోజునే వస్తుంది.
ప్రధానమంత్రి: ఓహ్! ఇటీవలే సెప్టెంబర్ 17న నా పుట్టినరోజున ఒక నాయకుడు నాకు ఫోన్ చేశారు. ఆయన ఇలా అన్నారు, “మీకు 75 ఏళ్లు వచ్చాయి.” నేను ఇలా జవాబిచ్చాను, “లేదు, ఇంకా 25 సంవత్సరాలు నాకు మిగిలి ఉన్నాయి.” గడిచిన వాటిని నేను లెక్కించను. మిగిలి ఉన్న వాటిని నేను లెక్కిస్తాను. అందుకే నేను మీకు చెప్తున్నాను: పోయిన వాటిని లెక్కించి సమయం వృధా చేయకండి. మిగిలి ఉన్న సమయంలో ఎలా జీవించాలో ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి!
విద్యార్థి: సర్, నా ప్రశ్న ఏమిటంటే: మనం బోర్డు పరీక్షలు లేదా పాఠశాల పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు, గత సంవత్సరాల ప్రశ్నలను పరిశీలించి, ఏ అంశాలు ఎక్కువ ముఖ్యమైనవో నిర్ణయిస్తాం. కొన్ని అంశాలపై పరీక్షకుడు దృష్టి పెట్టరని మనం అనుకుంటాం, కాబట్టి మనం వాటిని దాటవేస్తాం. ఇది సరైన విధానమేనా?
ప్రధానమంత్రి: కొన్నిసార్లు మీరు వార్తాపత్రికల ముఖ్యాంశాల్లో, “ఈ సంవత్సరం ప్రశ్నాపత్రం చాలా కఠినంగా ఉంది” అని చెప్పడం చూసే ఉంటారు.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: విద్యార్థులు చాలా బాధపడతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సిలబస్‌లో లేనివి పరీక్షలో ఇస్తారా?
విద్యార్థి: లేదు, సర్!
ప్రధానమంత్రి: కానీ మీరు పది సంవత్సరాల్లో తరుచూ అడిగిన మూడు–నాలుగు ప్రశ్నలపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల అది కష్టంగా అనిపిస్తుంది.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: గతంలో “ఖచ్చితమైన సూచనలు“, తరువాత “ముఖ్యమైన ప్రశ్నలు“, తరువాత “పదేళ్ల ప్రశ్నాపత్రాలు మీకు నమూనా గురించి అవగాహన కల్పించేవి” అని ఉండేవి.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉండేది. కొంతమంది ఉపాధ్యాయులు ఈ అలవాటును వ్యాప్తి చేశారు. వారు ఇలా అనుకుంటారు, “నా పాఠశాల బాగా మార్కులు సాధిస్తే, నా తరగతి బాగా మార్కులు సాధిస్తే, నేను మార్కులు వచ్చే వాటిని మాత్రమే బోధిస్తాను.”
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: అయితే మంచి ఉపాధ్యాయులు సమగ్ర అభివృద్ధి కోసం మొత్తం సిలబస్‌ను బోధిస్తారు. వారు విద్యార్థులను మొత్తం సిలబస్ చదవాలని బలవంతం చేస్తారు. జీవితంలో దాని ఉపయోగాన్నీ వివరిస్తారు. ఒక క్రీడాకారుడిని చూడండి: అతను బౌలర్ కావాలనుకుంటే, అతను తన భుజం కండరాలను మాత్రమే బలోపేతం చేస్తాడా? అది అతన్ని మంచి బౌలర్‌గా మారుస్తుందా?
విద్యార్థి: లేదు, సర్!
ప్రధానమంత్రి: అతను ఇంకా ఏమి చేయాలి?
విద్యార్థి: అతను వ్యాయామం చేయాలి, యోగా చేయాలి.
ప్రధానమంత్రి: అవును, వ్యాయామం చేయాలి, మొత్తం శరీరాన్ని బలోపేతం చేయాలి, మనస్సునూ బలోపేతం చేసుకోవాలి.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: అతను తన ఆహారపు అలవాట్లనూ తదనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: అతను సరిగ్గా నిద్రపోవాలి. అతను బంతిని మాత్రమే విసురుతాడు, అయినా అతను తన మొత్తం శరీరాన్ని సిద్ధం చేసుకుంటాడు, కదా?
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: శరీరంలో ఒక భాగం బలహీనంగా ఉండి, భుజం బలంగా ఉంటే… వేగం బాగుంటుంది, కానీ కాలు సరిగ్గా పనిచేయకపోతే – అతను బౌలింగ్ చేయగలడా?
విద్యార్థి: లేదు, సర్!
ప్రధానమంత్రి: ఒక ఆటగాడు తన ఆటలో ప్రావీణ్యం సంపాదించడానికి మొత్తం శరీరంపై శ్రద్ధ వహించినట్లే, విద్య కూడా పరీక్షల కోసం మాత్రమే కాదు. జీవితాన్ని నిర్మించుకోవడానికి విద్య ఒక మాధ్యమం. పరీక్షలు అంతిమ లక్ష్యం కాదు. అవి మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఒక మార్గం. అంతిమ లక్ష్యం పరీక్షలో వచ్చే మార్కులు కాకూడదు. అంతిమ లక్ష్యం జీవిత సమగ్ర అభివృద్ధి. కాబట్టి పది ప్రశ్నలకు, గత ప్రశ్నపత్రాలకు మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి. మీరు వాటిని విస్మరించాలని కాదు – మీరు వాటినీ చేయాలి, కానీ వాటికి 10 శాతం మాత్రమే ప్రాధాన్యం ఇవ్వండి.
విద్యార్థి: అవును, సర్!
విద్యార్థి: సర్, నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను: నేను కష్టపడి చదవాల్సిన సబ్జెక్టుల్లో, వాటిపై దృష్టి పెట్టడానికి బదులుగా నేను ప్రీ–బోర్డుల్లోనూ బాగా రాణించాలనే ఒత్తిడిని అనుభవిస్తున్నాను. నా చదువులో సమతుల్యతను ఎలా కాపాడుకోగలను?
ప్రధానమంత్రి: ఇది అందరికీ ఆందోళన కలిగించే విషయం. మొదటి త్రైమాసికంలో మనం కొన్ని సబ్జెక్టుల్లో బాగా రాణించాం. రెండో త్రైమాసికంలో మరికొన్నింటిలో. అప్పుడు మనం ఆలోచించడం ప్రారంభిస్తాం – నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇదా లేదా అదా? మనలోని విద్యార్థిని ఎల్లప్పుడూ అప్రమత్తంగా, ఉత్సాహంగా ఉంచుకోవాలి. విద్య తప్పనిసరి కాకూడదు. విద్య ఒక భారం కాకూడదు. దీనికి పూర్తి ప్రమేయం అవసరం – పూర్తి ప్రమేయం. అది లేకుండా కేవలం అర్ధహృదయంతో కూడిన విద్య జీవితాన్ని ఎప్పటికీ విజయవంతం చేయదు. మార్కులు, మార్కులు, మార్కులతో ఈ వ్యామోహం – ఇది ఒక రకమైన అనారోగ్యం. చెప్పండీ… గత సంవత్సరం బోర్డు పరీక్షల్లో టాప్ టెన్ స్కోరర్ల పేర్లు మీకు గుర్తున్నాయా? గుర్తుంచుకోవడం చాలా కష్టం, కదా? మీరు వార్తాపత్రికలో వారి ఫోటోలను చూసినా, వారి పేర్లు చదివినా, చప్పట్లు కొట్టినా, ఒక నెలలోనే మీరు మర్చిపోతారు. వారు చదివిన పాఠశాలలోని తోటి విద్యార్థులకూ వారికి ఎన్ని మార్కులు వచ్చాయో గుర్తుండకపోవచ్చు.
విద్యార్థి: ఉండవు, సర్!
ప్రధానమంత్రి: ఈ విషయాలకు నిజంగా ఎంత తక్కువ ప్రాముఖ్యత ఉందో అది చూపిస్తుంది.
విద్యార్థి: అవి కొద్దికాలం మాత్రమే గుర్తుండిపోతాయి.
ప్రధానమంత్రి: సరిగ్గా చెప్పారు, చాలా తక్కువ కాలం గుర్తుంటాయి.
విద్యార్థి: అవును, సర్! అవును, సర్!
ప్రధానమంత్రి: అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి, మన మనస్సులను సంఖ్యలు, మార్కులతో ముడిపెట్టే బదులుగా మనం మనల్ని ఇలా ప్రశ్నించుకోవాలి: నా జీవితం ఎటువైపు వెళుతోంది? మనం మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి – తరగతి గదిలో లేదా పరీక్షా హాలులో మాత్రమే కాదు, నిరంతరం.
విద్యార్థి: సర్, నా ప్రశ్న ఏమిటంటే: మనం చదువుతున్న సమయంలో మన మనసులోకి చాలా ఆలోచనలు వస్తాయి, కాబట్టి మనం దృష్టి కేంద్రీకరించలేం. మనం చదువుతాం, కానీ త్వరగా మర్చిపోతాం. ఆ సమయంలో మనం ఎలా ప్రశాంతంగా ఉండగలం?
ప్రధానమంత్రి: ఉదాహరణకు, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు. 25 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం గురించి ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీరు దానిని మర్చిపోతారా లేదా గుర్తుంచుకుంటారా?
విద్యార్థి: మేం గుర్తుంచుకుంటాం సర్. ఇది చాలా చిరస్మరణీయం.
విద్యార్థి: సర్, మిమ్మల్ని కలవడం చాలా ప్రత్యేకమైన సందర్భం.
ప్రధానమంత్రి: ఇది కేవలం “ప్రత్యేకమైనది” కాబట్టి కాదు. మీరు దీనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు కాబట్టి. మీరు ఇంటి నుంచి బయలుదేరిన క్షణం నుంచి, మీ మనస్సు ఆలోచనలతో నిండిపోయింది – ఢిల్లీ, ప్రధానమంత్రి, ప్రధానమంత్రి నివాసాన్ని సందర్శించడం. నిన్న కూడా మీరు ఇంట్లో దాని గురించి మాట్లాడి ఉండాలి: “రేపు ఉదయం నేను వెళ్ళాలి.” దీని అర్థం మీరు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు, కదా?
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: అందుకే 20-25 సంవత్సరాల తర్వాత కూడా, మీరు ఈ రోజు గురించి ప్రతిదీ గుర్తుంచుకుంటారు.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: గుర్తుంచుకోవడానికి మరో మార్గం ఏమిటంటే స్నేహితులతో పంచుకోవడం. మీ తరగతిలో మీ కంటే తక్కువ తెలివైన ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులతో స్నేహం చేసి, “నేను మీకు నేర్పుతాను” అని చెప్పండి. అలాగే, మీ కంటే తెలివైన విద్యార్థుల వద్దకు వెళ్లి, “నాతో 5–10 నిమిషాలు కూర్చోండి. నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను, ఇది సరైనదేనా? దయచేసి నన్ను సరిదిద్దండి” అని చెప్పండి. అప్పుడు మీరు రెట్టింపు ప్రయోజనాలను పొందుతారు.
విద్యార్థి: అవును, సర్!
విద్యార్థి: మేము వారి అభిప్రాయాన్ని తీసుకున్నప్పుడు, దానికి ఇంకా ఏమి జోడించవచ్చనే దాని గురించి మనకు మరిన్ని ఆలోచనలు వస్తాయి.
ప్రధానమంత్రి: మరి అది సహాయపడుతుందా?
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: కొత్త ఆలోచనలు వస్తాయి.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: మీ మనస్సు కొత్త విషయాలు తెలుసుకోవడానికి పూర్తిగా సిద్ధమవుతుంది.
విద్యార్థి: నేను నా ప్రశ్నను నేరుగా వారిని అడిగినప్పుడు… వారు నాకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడంతో మా కలను మేం సాకారం చేసుకుంటున్నట్లు అనిపించింది. ఎందుకంటే అందరికీ ఈ అవకాశం లభించదు – ఇది అందరి విధిలో ఉండదు. కాబట్టి నేను చాలా అదృష్టవంతుడిని అని భావిస్తున్నాను.
విద్యార్థి: సత్ శ్రీ అకల్ (సత్యం దైవంతో సమానం), సర్!
ప్రధానమంత్రి: సత్ శ్రీ అకల్!
విద్యార్థి: నా పేరు ఏకమ్ కౌర్. నేను పంజాబ్ నుంచి వచ్చాను. నా ప్రశ్న ఏమిటంటే: 12వ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలు, పోటీ పరీక్షలకు ఒకేసారి సిద్ధమవుతారు. ఇది సరైనదేనా? ఎందుకంటే పరీక్షా విధానాలు చాలా భిన్నంగా ఉంటాయి. రెండు పరీక్షలూ దాదాపు ఒకే సమయంలో వస్తాయి.
ప్రధానమంత్రి: మీ ఆందోళన సముచితమే. ఇది క్రికెట్ ఆడుతూనే ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాల్సి వచ్చినట్లు ఉంది. అప్పుడు మీరు ఆలోచిస్తుంటారు– నేను క్రికెట్‌కు సిద్ధం కావాలా లేదా ఫుట్‌బాల్‌కు సిద్ధం కావాలా?
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: నా సలహా ఏమిటంటే, మీ మొదటి ప్రాధాన్యం 12వ తరగతి బోర్డు పరీక్షలు. కానీ, ఒక విద్యార్థిగా మీరు మీ వయస్సు, తరగతికి సంబంధించిన సిలబస్‌ను బాగా నేర్చుకుంటే పోటీ పరీక్షల కోసం ప్రత్యేక ప్రయత్నాలు అవసరం లేదు.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: అవి బై–ప్రొడక్ట్ అవుతాయి. కొంతమంది తల్లిదండ్రులు వీటిని అవసరమైన దానికంటే ముందుగానే సాధించాలని భావిస్తారు.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: నేను తల్లిదండ్రులకు చెబుతాను: పిల్లలను వారి సామర్థ్యం, కెపాసిటీ, ఆసక్తికి అనుగుణంగా వికసించనివ్వండి.
విద్యార్థి: సర్, నేను మరో ప్రశ్న అడగాలనుకుంటున్నాను.
ప్రధానమంత్రి: అడగండి.
విద్యార్థి: నాకు గేమింగ్ అంటే చాలా ఆసక్తి. కానీ సమాజం నన్ను గేమింగ్ వదిలేసి చదువుపైనే దృష్టి పెట్టమని చెబుతుంది. అయినప్పటికీ నా భవిష్యత్తు గేమింగ్‌లో ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను సరైన మార్గంలో ఉన్నానో లేదా తప్పు మార్గంలో ఉన్నానో నాకు ఎలా తెలుస్తుంది?
ప్రధానమంత్రి: తల్లిదండ్రుల స్వభావం ఎలా ఉంటుందంటే, మొదట వారు “ఇది చేయవద్దు, అది చేయవద్దు” అని తిడతారు.
విద్యార్థి: అవును, సర్!
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: కానీ మీరు నిశ్శబ్దంగా అదే చేశారు. మీరు పతకం కూడా గెలుచుకున్నారని అనుకుందాం – అప్పుడు వారు ఏమి చేస్తారు?
విద్యార్థి: వారు చాలా సంతోషిస్తారు!
ప్రధానమంత్రి: వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్లందరితోనూ “చూడండీ, నా కొడుకు ఇది సాధించాడు, నా కొడుకు అది సాధించాడు” అని అంటారు. మీ విజయం వారి గౌరవంగా మారుతుంది.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: అప్పుడు వాళ్లు మీరు చేసే దానిని హృదయపూర్వకంగా అంగీకరిస్తారు.
విద్యార్థి: అవును, సర్!
ప్రధానమంత్రి: భారత దేశంలో ఎన్నో కథలు, గాథలు ఉన్నాయి. పంచతంత్రం ఆధారంగా ఒక ఆటను రూపొందించాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఆట సృష్టికర్తలు కావచ్చు. మానసికి తనకంటూ ఒక పేజీ ఉన్నట్లే, మీరు కూడా సోషల్ మీడియా ప్రొఫైల్ తెరిచి ఒకటి రెండు ఆటలను స్వయంగా డిజైన్ చేయవచ్చు. వాటిని మొదలుపెట్టండి. మీ ఆటను పది వేల లేదా ఇరవై వేల మంది ఆడుతున్నారని మీ కుటుంబ సభ్యులు చూసినప్పుడు, వారే మీకు కొత్త ఆలోచనలు ఇస్తారు. “హనుమంతుడి కథపై ఒక గేమ్ తయారు చేయి” లేదా “అభిమన్యుడు చక్రవ్యూహం నుంచి ఎలా బయటపడతాడనే దానిపై ఒక గేమ్ రూపొందించు” అని చెబుతారు. అప్పుడు మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. గేమింగ్ పట్ల మీకు ఉన్న ఆసక్తి మంచి విషయం. ఎప్పుడూ వెనుకాడకండి. అయితే, గేమింగ్ అనేది కేవలం కాలక్షేపం కోసమే కాకూడదని గుర్తుంచుకోండి. భారత్ లో డేటా చౌకగా దొరుకుతోంది, సాంకేతికత కూడా మరీ ఖరీదైనది కాదు. కాబట్టి దానిపై కృషి చేస్తూ ఉండండి. కానీ గేమింగ్ అనేది జూదంగా మారకూడదు. డబ్బుతో పందాలు కాసే ఆటలు వినాశనానికి దారితీస్తాయని నేను ఇప్పటికే ఒక చట్టం చేశాను.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: దానిని అనుమతించకూడదు. అయితే గేమింగ్ అనేది ఒక నైపుణ్యం, దానికి వేగం కావాలి. చాలా వేగం కావాలి.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: గేమింగ్‌లో మీ అప్రమత్తత మీ వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడుతుంది. అయితే నాణ్యమైన ఆటలలో పట్టు సాధించి, మీ నైపుణ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. మీరు అలా చేస్తారా?
విద్యార్థి: అవును సార్!
విద్యార్థి: ప్రధానమంత్రి నివాసాన్ని సందర్శించడం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన మాతో ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడారు, మా ప్రశ్నలను శ్రద్ధగా విన్నారు.అద్భుతమైన సమాధానాలు ఇచ్చారు.
విద్యార్థి: నమస్తే సార్!
ప్రధానమంత్రి: నమస్తే!
విద్యార్థి: సార్, ఇంతకుముందు నాకు పరీక్షలంటే ఒత్తిడి, ఆందోళన కలిగేవి. కానీ మీ పుస్తకం చదివిన తర్వాత నా భయం పోయింది. దీని కోసం మేమంతా కొన్ని సూక్తులు రాశాం. నాకు పరీక్షలంటే భయంగా ఉండేది, కానీ ఇప్పుడు అవి నా స్నేహం. గుజరాతీలో మైత్రి.
విద్యార్థి: ఇంతకుముందు ఇతరులు చదివే విధానం చూసి, నన్ను వారితో పోల్చుకుంటూ కంగారు పడేవాడిని. కానీ ‘ఎగ్జామ్ వారియర్‘ చదివిన తర్వాత, నా పద్ధతి ప్రత్యేకమైనదని, అది నాకు బాగా ఉపయోగపడుతుందని గ్రహించాను. సార్, నాకు మొదట్లో డిసెక్షన్ అంటే భయం ఉండేది, కానీ ఇప్పుడు ఆ భయం లేదు.
విద్యార్థి: సార్, నేను ఇలా రాశాను: నాకు సమయ పాలన అంటే భయం ఉండేది, కానీ ఇప్పుడు అది నా మిత్రుడు. చిన్నప్పటి నుంచి నేను సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడానికి ఎంతో ఇబ్బంది పడేవాడిని. నా కుటుంబం, పాఠశాల, స్నేహితులు అందరూ “పనులు వేగంగా పూర్తి చేయి, నీకు ప్రతిభ ఉంది, మంచి ఆలోచనలు ఉన్నాయి, కానీ సమయానికి పూర్తి చేయవు” అని చెప్పేవారు. అది నా పెద్ద సమస్య. కానీ నేను ‘ఎగ్జామ్ వారియర్‘ నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేస్తున్నాను.
ప్రధానమంత్రి: నేను ఒక సులభమైన పద్ధతిని చెబుతాను. రాత్రి పడుకునే ముందు, రేపు మీరు చేయవలసిన పనులను ఒక డైరీలో రాసుకోండి. మరుసటి రోజు వాటిని పూర్తి చేశారో లేదో చూసుకోండి. మీరు ఐదు పనులు రాసి, కేవలం మూడు మాత్రమే పూర్తి చేస్తే, మిగిలిన రెండింటిని గుర్తు పెట్టుకోండి. ఆ పనులు ఎందుకు పూర్తి కాలేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బహుశా మీరు స్నేహితులతో ఫోన్‌లో ఎక్కువ సమయం గడిపి ఉండవచ్చు, లేదా టీవీ సీరియల్ చూస్తూ ఒక అర గంట వృథా చేసి ఉండవచ్చు. అప్పుడు సమయాన్ని ఎక్కడ ఆదా చేయవచ్చో మీకు అర్థమవుతుంది. చాలాసార్లు మనం సమయాన్ని ఎలా వృథా చేస్తున్నామో మనకే తెలియదు. మీరు సమయ పాలన,సమయాన్ని ఉత్పాదకతతో వాడటం నేర్చుకుంటే, మీకు ఎప్పుడూ ఒత్తిడి లేదా అలసట అనిపించదు. ఉదాహరణకు, నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, కానీ నేను ఒత్తిడికి గురికాను. ఎందుకంటే సమయాన్ని తెలివిగా ఉపయోగించే అలవాటును నేను ఎప్పుడో అలవర్చుకున్నాను.
విద్యార్థి: నేను గణితం ఒక దెయ్యం అనుకునేవాడిని, కానీ ఇప్పుడు నేనే ఆ దెయ్యాన్ని. చిన్నప్పుడు నాకు గణితం అంటే దెయ్యాన్ని చూసినంత భయం ఉండేది. కానీ ఇప్పుడు నేను దానికి ఎంత దగ్గరయ్యానంటే, గణితం లేకుండా నేను ఉండలేను.
ప్రధానమంత్రి: ఓహో! ఇది చాలా పెద్ద మార్పు. మీరు ఎప్పుడైనా వేద గణితాన్ని చూశారా?
విద్యార్థి: లేదు.
ప్రధానమంత్రి: వేద గణితంపై ఆన్‌లైన్ తరగతులు అందుబాటులో ఉన్నాయి. ఇది మంత్రజాలంలా అనిపిస్తుంది. మీరు ఆసక్తి చూపితే, అది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీరు మీ స్నేహితులకు కూడా అటువంటి గణిత క్రీడలను చూపించవచ్చు. దీనివల్ల మీ ఆసక్తి మరింత పెరుగుతుంది.
విద్యార్థి: సార్, ఇంతకుముందు నాకు పరీక్షలంటే భయంగా ఉండేది. కానీ ఇప్పుడు అది నా మిత్రుడు. పరీక్షల తేదీలు ప్రకటించినప్పుడు నేను కంగారు పడేవాడిని. కానీ ‘ఎగ్జామ్ వారియర్‘ మొదటి మంత్రం, పరీక్షలను ఉత్సాహంగా, సంతోషంగా ఒక పండుగలా జరుపుకోవాలని చెబుతుంది. అది చదివినప్పుడు నాకు ఎంతో స్ఫూర్తి కలిగింది.
ప్రధానమంత్రి: కొన్నిసార్లు మీరు ఎదుర్కొనే సమస్యలు కుటుంబం నుంచే వస్తుంటాయి. మీకు సహాయపడిన పాఠాలు వారికి కూడా ఉపయోగపడతాయి. మీ ఇంట్లోని పెద్దలను కూడా ‘పరీక్షా పే చర్చ‘ చదవమని కోరండి. దాని గురించి వారితో చర్చించండి.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: మీకు నచ్చిన మంత్రం ఏదైనా ఉంటే, దాని కింద గీత గీసి వారికి చూపించండి. “చూడండి, ప్రధానమంత్రి ఇలా చెప్పారు – దీనిని చదవండి” అని చెప్పండి.
విద్యార్థి: సార్, మా అమ్మ మంత్రాలన్నీ చదివారు, ఆమె చాలా సంతోషించారు.
ప్రధానమంత్రి: చూశారా, మీ బలం పెరిగింది.
విద్యార్థి: నాకు తక్కువ మార్కులు వస్తాయని భయం ఉండేది, కానీ ఇప్పుడు అది నా మిత్రుడు. ఇంతకుముందు మార్కులే సర్వస్వం అని భావించేవాడిని. మార్కులు తక్కువ వచ్చినప్పుడు అంతా అయిపోయిందని అనుకునేవాడిని. కానీ మీ పుస్తకం చదివిన తర్వాత, పరీక్షలు జీవితానికి కేవలం ఒక సన్నాహకం మాత్రమే అని అర్థం చేసుకున్నాను. మీరు మాకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఉదాహరణ ఇచ్చారు.
ప్రధానమంత్రి: అవును, మీకు గుర్తుందా?
విద్యార్థి: ఆయన వైఫల్యాలను ఎదుర్కొన్నారు. కానీ మళ్ళీ ప్రయత్నించకుండా ఉండి ఉంటే మనకు “మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా” దక్కేవారు కాదు. కేవలం పరీక్ష మార్కుల వల్ల ఏమీ కాదని అది నాకు నేర్పింది. మనం ప్రయత్నిస్తూ ఉంటే, ఇంకా బాగా చేయగలమని అర్థమైంది.
ప్రధానమంత్రి: ఇప్పుడు నీ టెన్షన్ పోయింది కదా, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని అనిపిస్తోందా?
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: పాటలు పాడటం, వాయిద్యాలు వాయించడం, పెయింటింగ్ వేయడం వంటి ఆలోచనలు ఏవైనా వస్తున్నాయా?
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: సమయం దొరికినప్పుడు చేస్తున్నారా?
విద్యార్థి: అవును సార్! నేను కవితలు రాయడం మొదలుపెట్టాను.
ప్రధానమంత్రి: కవితలు రాయడమా – చాలా బాగుంది!
విద్యార్థి: నాకు ప్రెజెంటేషన్లు ఇవ్వడం అంటే భయంగా ఉండేది, కానీ ఇప్పుడు అది నాఇష్టం. సార్, మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారో గమనించాను. మీ పుస్తకం చదివిన తర్వాత నాకు పట్టుదల పెరిగింది: నేను ఓడిపోయినా వదిలేయను, మళ్ళీ సిద్ధమవుతాను. ఇప్పుడు నేను ప్రెజెంటేషన్లు ఇవ్వగలననే నమ్మకం నాకు కలిగింది.
ప్రధానమంత్రి: అంటే ఇప్పుడు నీకు ధైర్యం వచ్చింది.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: రోడ్డు పక్కన వస్తువులు అమ్ముకునే పేద మహిళలను ఊహించుకోండి. అక్కడ ఏదైనా గొడవ జరిగితే, అంతకుముందు ఎప్పుడూ టీవీలో మాట్లాడని ఆ మహిళలు అద్భుతంగా ఇంటర్వ్యూలు ఇస్తారు. అది ఎలా సాధ్యం? ఎందుకంటే వారు తమ ప్రత్యక్ష అనుభవం నుంచి మాట్లాడతారు. అందులో నటన ఉండదు. అబద్ధాలు ఉండవు. కేవలం నిజం మాత్రమే ఉంటుంది. ఆ ఆత్మవిశ్వాసం నిజం నుంచి వస్తుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా నిజం నుంచే వస్తుంది: “నేను ఇది చేస్తున్నాను, నేను ఇది చేశాను, నేను సరైనదే చెబుతున్నాను.”
విద్యార్థి: పరీక్షల సమయంలో, ముఖ్యంగా లిటరేచర్ పేపర్ల విషయంలో నేను కంగారు పడతానని భయపడేవాడిని. అవి చాలా పెద్దవిగా అనిపించేవి. దానివల్ల నాకు ఆందోళన కలిగేది. కానీ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చేయగలను. నేను కంగారు పడను. నేను ఎక్కువగా రాయడం ప్రాక్టీస్ చేస్తాను. తద్వారా వేగంగా రాయడమే కాకుండా నా చేతిరాతను కూడా మెరుగుపరుచుకోగలను.
ప్రధానమంత్రి: ఇప్పుడు నీకు పూర్తి ఆత్మవిశ్వాసం వచ్చింది. తర్వాత, నువ్వు తప్పులు వచ్చినా కూడా గమనించవు.
విద్యార్థి: కచ్చితంగా లేదు! ఎందుకంటే ఇప్పుడు నా సమస్య ఏమిటో నాకు అర్థమైంది. ఇంతకుముందు పేపర్ చూడగానే కంగారు పడేవాడిని, కానీ ఇప్పుడు అలా లేదు.
ప్రధానమంత్రి: నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు. మనం బలహీనులం కాదు. కేవలం కంగారులోనే తప్పులు చేస్తాం.
విద్యార్థి: అవును సార్.
ప్రధానమంత్రి: కొన్ని పద్ధతులు సహాయపడతాయి. ఉదాహరణకు, నీకు ప్రశ్నపత్రం అందినప్పుడు, ఒక 30 సెకన్ల పాటు నిశ్శబ్దంగా కూర్చో. దీర్ఘ శ్వాస తీసుకో. ఛాతీ నిండా గాలి పీల్చి, నెమ్మదిగా వదులు. నీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆ తర్వాత మళ్ళీ పేపర్ వైపు చూడు. అది నీకు భిన్నంగా, మరింత స్పష్టంగా కనిపిస్తుంది. నీకు తెలియని విషయం అయితే తప్పులు జరగవచ్చు. కానీ నీకు తెలిసిన విషయం అయితే తప్పులు జరగవు.
విద్యార్థి: నమస్కారం సార్! జై గురు శంకర్!
ప్రధానమంత్రి: నమస్కారం!
విద్యార్థి: నా పేరు నిదుమల్ బర్మన్. సార్, నా ప్రశ్న: చిన్న ఇళ్లలో, చుట్టూ శబ్దాలు, ఇంటి పనుల మధ్య చదువుకోవడం కష్టమవుతుంది. ఒకవేళ తల్లిదండ్రులు మన కలలకు సీరియస్‌గా మద్దతు ఇవ్వకపోతే, మనం ఏమి చేయాలి?
ప్రధానమంత్రి: నేను నీకు ఒక విషయం చెబుతాను. ఒకసారి సోషల్ మీడియాలో నా మనసును హత్తుకున్న ఒక వీడియో చూశాను. ఒక తండ్రి తన జీవనోపాధి కోసం సరుకులు ఉన్న ఎడ్ల బండిని నడుపుతున్నాడు. అతని బిడ్డ ఆ సరుకుల పైన కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. ఆ పిల్లాడు సౌకర్యాల గురించి ఆందోళన చెందలేదు.
విద్యార్థి: అవును సార్.
ప్రధానమంత్రి: కొందరు తమకు సరైన గది లేదని, అందుకే నిద్ర రావడం లేదని చెబుతుంటారు. వారిని తీసుకెళ్లి ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉంచినా, వారికి నిద్ర పట్టదు. కాబట్టి సౌకర్యాలు ఉంటేనే సామర్థ్యం పెరుగుతుందనే ఆలోచన తప్పు. బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే పిల్లలు ఎవరు? చిన్న గ్రామాలకు చెందిన వారే. ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద స్కూళ్లు, ధనిక కుటుంబాల పిల్లలే ఎక్కువ మార్కులు సాధించేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు సౌకర్యాలు లేని చిన్న కుటుంబాల పిల్లలే విజయం సాధిస్తున్నారు. ఈ మధ్యనే నేను విజయం సాధించిన అంధుల క్రికెట్ జట్టులోని అమ్మాయిలను కలిశాను. వారి మాటలు విన్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. వారికి ఇళ్లు లేవు. చూపు లేదు, అయినా వారు ఆట నేర్చుకున్నారు. వైకల్యాన్ని ఎదిరించి విజయం సాధించారు. కాబట్టి మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ నివసిస్తున్నారు అనేది ముఖ్యం కాదు. సౌకర్యవంతమైన పరిస్థితులతో జీవితం నిర్మితం కాదు. ఆ భ్రమలో ఉండకండి. మీరు జీవించే విధానం ద్వారానే జీవితం నిర్మితమవుతుంది.
విద్యార్థి: గౌరవ ప్రధానమంత్రిని చూసినప్పుడు, ఆయన నిజంగానే అక్కడ ఉన్నారని నేను నమ్మలేకపోయాను. భారత దేశ నాయకుడిగా ఆయన చాలా గంభీరంగా ఉంటారని నేను అనుకున్నాను. కానీ ఆయన మాతో మాట్లాడినప్పుడు ఎంతో సులభంగా కలిసిపోయే వ్యక్తిలా అనిపించారు. ఆయన ఇచ్చిన సలహాలు “అవును, నేను ఇది చేయగలను” అనే నమ్మకాన్ని నాలో కలిగించాయి. ఇప్పుడు నేను ఆయన సలహాలను పాటిస్తూ, నా జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తాను.
విద్యార్థి: వణక్కం సార్!
ప్రధానమంత్రి: వణక్కం!
విద్యార్థి: సార్, నా పేరు నిఖిల్. నేను దేవాలయాల భూమి అయిన తమిళనాడు నుంచి వచ్చాను. సార్, కొన్నిసార్లు పరీక్షల సమయంలో మా ఇంటికి బంధువులు, అతిథులు వస్తుంటారు. వారు మా సన్నద్ధత గురించి అడుగుతుంటారు. మేము కొన్ని విషయాలను మరచిపోవాలని ప్రయత్నిస్తుంటే, వారు సరిగ్గా అవే విషయాలను అడిగి మాకు గుర్తు చేస్తారు. సార్, దీని విషయంలో మా తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. మరి ఇటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో దయచేసి చెప్పండి సార్.
ప్రధానమంత్రి: నేను నీకు ఒక తెలివైన ఉపాయం చెబుతాను. ఎవరైనా వచ్చి నిన్ను అలా అడిగినప్పుడు, నువ్వు ఇలా అను: “అంకుల్, మీరు చాలా విజయవంతమైన వ్యక్తి. మీ గురించి నేను విన్నాను. దయచేసి చెప్పండి, మీరు చిన్నప్పుడు ఎలా చదువుకునేవారు? మీకు ఎప్పుడైనా కోపం వచ్చేదా? మీ టీచర్లు మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టారా? మీరు వాటన్నింటినీ ఎలా మేనేజ్ చేసేవారు?” అని అడుగు. వారు నిన్ను అడగకముందే, మీరే వారిని అడిగేయంది. అప్పుడు చూడండి – పరిస్థితి మొత్తం మారిపోతుంది.
విద్యార్థి: అవును సార్.
ప్రధానమంత్రి: ఆయన వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కేవలం టీవీలో మాత్రమే చూసిన వ్యక్తిని నేరుగా నిజ జీవితంలో చూశాను. ఆయన ఎంత సృజనాత్మకమైన సమాధానం ఇచ్చారంటే, నేను అస్సలు ఊహించలేదు. “పరిస్థితిని తిరగరాయండి. వారు ఎలా సాధించారు, జీవితంలోని దశలను వారు ఎలా దాటారో వారినే అడగండి” అని చెప్పారు.
విద్యార్థి: నమస్తే సార్! నా పేరు పద్మ. నేను లడఖ్ నుంచి వచ్చాను. నా ప్రశ్న: మా వయస్సు పిల్లలు పెద్ద కలలు కనాలా? మరి ఆ కలలను నెరవేర్చుకోవడానికి మేము ఎక్కడ నుంచి ప్రారంభించాలి?
ప్రధానమంత్రి: కలలు కనకపోవడమే నేరం. మీరు కచ్చితంగా కలలు కనాలి. కానీ కలల గురించి కేవలం పలవరించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. జీవితం చేతల మీద ఆధారపడి ఉండాలి. నేను ఎక్కడ ఉన్నా, అక్కడ విజయం సాధించాలి, అప్పుడే నేను ముందుకు సాగగలను. నేను చెట్టు ఎక్కి మామిడి పండ్లు కోయాలనుకుంటే, కేవలం ఆ పండ్ల వైపు చూస్తూ కూర్చుంటే పని జరగదు. ఉదాహరణకు, నువ్వు వ్యోమగామి అయి చంద్రునిపైకి వెళ్లాలనుకుంటే, వ్యోమగాముల గురించి చదవడం ప్రారంభించాలి. వారు ఎవరు, వారి జీవిత చరిత్రలు ఏమిటి, అంతరిక్షం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. నెమ్మదిగా నీ ఆసక్తిని పెంచుకోవాలి. టీవీలో ఏదైనా ప్రోగ్రాం వస్తే శ్రద్ధగా చూడాలి. అది నీ ఆలోచనకు ఒక పోషణను, ఎరువును అందిస్తుంది. అప్పుడు ఆ కల ఎదుగుతుంది. ఇతరులకు చెప్పడం వల్ల లాభం లేదు. కొన్నిసార్లు నువ్వు చెబితే “ఓహో, వీడు వ్యోమగామి అవుతాడంట!” అని వారు ఎగతాళి చేయవచ్చు. కాబట్టి మీ కలలను బహిరంగం చేయకండి. కానీ వాటిని ఎక్కడైనా రాసి పెట్టుకోండి.
విద్యార్థి: ఇది నాకు మొదటి ‘పరీక్షా పే చర్చ‘ అనుభవం కావడంతో నేను చాలా ఆందోళనగా ఉన్నాను. కానీ ప్రధానమంత్రి నా ముందుకు వచ్చిన క్షణంలో, నా ఆందోళన కాస్తా ఉత్సాహంగా మారిపోయింది.
విద్యార్థి: సార్, నాదొక ప్రశ్న. మనం కనే పెద్ద కలల దిశగా అడుగులు వేయడానికి, ప్రతిరోజూ మనం అలవర్చుకోవాల్సిన ఒక చిన్న అలవాటు ఏమిటి?
ప్రధానమంత్రి: గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవాలని నేను నమ్ముతాను. కొన్నిసార్లు మనం వారు గొప్పవారైన తర్వాతే వారిని చూస్తాం. కానీ వారు కూడా ఒకప్పుడు సామాన్యులే. ఈరోజు మీరు ప్రధానమంత్రిని కలిశారు, కానీ ఒకప్పుడు ఈ ప్రధానమంత్రి కూడా ఒక చిన్న పిల్లాడే. మీరు జీవిత చరిత్రలు చదివినప్పుడు “అవును, ఆయన గొప్పవారయ్యారు, కానీ ఆయన ఇక్కడ నుండే ప్రారంభించారు” అనే విషయం మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు దాన్ని మీ జీవితానికి అన్వయించుకోవచ్చు. “నేను కూడా అలాగే ఉన్నాను. నేను కూడా అవే పనులు చేస్తున్నాను” అనే భావన మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. “అవును, నేను ఇక్కడి నుంచి మొదలుపెట్టగలను. ఇది మొదటి అడుగు. ఆయన రెండో అడుగుగా ఇది చేశారు. మూడో అడుగుగా అది చేశారు” అని మీరు ఆలోచించగలుగుతారు. ఈ విధంగా, మీరు మీ పురోగతిని మరింత బలోపేతం చేసుకోవచ్చు.
విద్యార్థి: ఆయన సలహాలు విన్న తర్వాత, నా ఆదర్శ వ్యక్తులను గమనించాలని, వారి నేపథ్యాన్ని అధ్యయనం చేయాలని నాకు అనిపించింది. వారు ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నారు, ఎటువంటి కష్టాలను అధిగమించారో తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం ద్వారా, నేను ఒక చిన్న అడుగు వేసి దానిపై పని చేయగలను. మొదటి అడుగు పూర్తి చేసిన తర్వాత, రెండో అడుగు వైపు సాగగలను.
విద్యార్థి: సార్, నేను మీ కోసం ఒక కవిత చదవాలనుకుంటున్నాను.
ప్రధానమంత్రి: కవితా? తప్పకుండా వినిపించు.
విద్యార్థి: మీరు మా అందరి ఆశ. మీరు భారతదేశ గర్వం. మీరు భారత నౌకా సారథి. మీరు మానవత్వపు సేవకులు. నేను ఎంతో దూరం నుంచి కొన్ని ప్రశ్నలతో మీ వద్దకు వచ్చాను. మాకు ‘పరీక్షా పే చర్చ‘ అనే కానుక లభించింది, ఈ గొప్ప అవకాశం దక్కింది. మీరు కరుణకు నీడ. అణగారిన వర్గాల తోడు. మీరు దేశానికే ప్రథమ స్థానం ఇస్తారు. “భారత మాతకు జై” అని పలుకుతారు. అందుకే నేను కూడా నా ఆలోచనలను ఇలా వ్యక్తపరుస్తున్నాను. మీరు క్రమశిక్షణ గల వ్యక్తి. యోగి. మీరు భారతదేశ కలల ‘మోదీ‘. ఇంతటితో నా మాటలు ముగిస్తూ, మీకు మరోసారి నమస్కరిస్తున్నాను.
ప్రధానమంత్రి: వాహ్! వాహ్! నువ్వు అద్భుతమైన కవితలు రాస్తున్నావు.
విద్యార్థి: నేను ఆయనను కలిసినప్పుడు, నా కవిత వినిపిస్తూ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన నా దగ్గరికి వచ్చేసరికి నాకు స్పృహ తప్పిపోతుందేమో, అక్కడే పడిపోతానేమో అనిపించింది.
ప్రధానమంత్రి: మీరందరూ మీ ఆలోచనలను రాసుకోవడం చాలా మంచి విషయం.
విద్యార్థి: ధన్యవాదాలు సార్!
ప్రధానమంత్రి: రండి!
ప్రధానమంత్రి: ఇప్పుడు, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు నన్ను చాలా ప్రశ్నలు అడిగారు కదా. నేను వికసిత్ భారత్ గురించి మాట్లాడినప్పుడు, ఏ సంవత్సరాన్ని ప్రస్తావిస్తాను?
విద్యార్థి: 2047.
ప్రధానమంత్రి: 2047.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: నేను అలా ఎందుకు చెబుతున్నాను?
విద్యార్థి: ఎందుకంటే అది శతాబ్ది లక్ష్యం. మన స్వాతంత్ర్యానికి 100 ఏళ్లు నిండే సమయం.
ప్రధానమంత్రి: అవును, భారతదేశం స్వాతంత్ర్యం పొంది 100 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి, మీ వయస్సు ఎంత ఉంటుంది?
విద్యార్థి: 39.
విద్యార్థి: 40.
ప్రధానమంత్రి: 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు అనేది మీకు చాలా ముఖ్యమైనది. మీ ముందు ఎన్నో అవకాశాలు ఉంటాయి. మరి నేను ఇంత కష్టపడి పని చేస్తోంది ఎవరి కోసం?
విద్యార్థి: మా కోసం!
ప్రధానమంత్రి: మరి మనమందరం కూడా దాని కోసం కృషి చేయాలి కదా?
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: చూడండి, మహాత్మా గాంధీ 1915లో ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చి స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1915 నుంచి 1947 వరకు వారు స్వాతంత్ర్యం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు, అవునా?
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: మరి స్వాతంత్ర్యం వచ్చిందా?
విద్యార్థి: వచ్చింది సార్!
ప్రధానమంత్రి: భగత్ సింగ్ ఉరికంబాన్ని ఎక్కారు.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: చిన్న వయసులోనే ఆయన ప్రాణత్యాగం చేశారు, కానీ ఆయన స్వాతంత్ర్య కాంక్ష అనే బీజాన్ని నాటారు, అవునా?
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: స్వాతంత్ర్యం కోసం జీవించేలా ఆయన ప్రతి యువకుడిని ప్రేరేపించారు, అవునా?
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: అంతటి గొప్ప స్వాతంత్ర్యాన్ని మనం సాధించగలిగినప్పుడు, మనందరి సమిష్టి కృషితో వికసిత్ భారత్‌ను సాధించలేమా?
విద్యార్థి: కచ్చితంగా సాధించగలము సార్!
ప్రధానమంత్రి: మీరు దీన్ని నమ్ముతున్నారా?
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: అందుకే, ఈ కలను ఎప్పుడూ మర్చిపోకండి. మీరు ఇంట్లో కూడా “వికసిత్ భారత్ కోసం, నేను ఇది చేయాలి” అని రాసి పెట్టుకోండి. సరే, ఇప్పుడు చెప్పండి, వికసిత్ భారత్ కోసం మీరు చేసే ఐదు పనులు ఏమిటి?
విద్యార్థి: సార్, మేము మా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటాం.
విద్యార్థి: సార్, మాపై మేము నమ్మకం ఉంచి ముందుకు సాగుతాం.
ప్రధానమంత్రి: మీ మీద మీరు నమ్మకం ఉంచండి.
విద్యార్థి: మేము స్వదేశీ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తాం.
ప్రధానమంత్రి: మరి అది ఎలా చేస్తారు? ముందుగా, మీరు మీ మనసును సిద్ధం చేసుకోవాలి.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించడం అనేది తర్వాత వచ్చే విషయం.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: మనం ఇప్పటికీ వలసవాద మనస్తత్వంతో జీవిస్తున్నాం. పాఠశాలలో మీ స్నేహితుడు ఎవరైనా విదేశీ జాకెట్ ధరించి, “ఇది ఫలానా దేశం నుండి వచ్చింది” అని చెబితే మనం ఎలా స్పందిస్తాం? “వావ్, చాలా బాగుంది!” అంటాం కదా? ఇది నిజం కాదా?
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: అందుకే ఇప్పుడు మీకు ఒక పని అప్పగిస్తున్నాను.
విద్యార్థి: సార్!
ప్రధానమంత్రి: ఉదయం పళ్లు తోముకోవడం దగ్గర నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం పళ్లు తోముకునే వరకు, మీరు ఉపయోగించే వస్తువులన్నింటినీ ఒక జాబితాగా రాయండి. మీరు ఆశ్చర్యపోతారు – మీరు వాడే దువ్వెన విదేశీది కావచ్చు, మీ బూట్లు విదేశీవి కావచ్చు. వాటన్నింటినీ రాసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. ఈ నెలలో, పది వస్తువులను తీసేసి వాటి స్థానంలో భారతీయ వస్తువులను వాడండి. వచ్చే నెలలో మరో పది వస్తువులను మార్చండి. ఏడాది తిరిగేసరికి, విదేశీ వస్తువులన్నీ పోయి, మీ ఇంట్లో భారతీయ ఉత్పత్తులే ఉంటాయి. మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఏది ఏమైనా, నా శరీరంపై, నా కుటుంబంలో, నా జీవితంలో నేను వాడే వస్తువును మొదట తనిఖీ చేస్తాను. ఇది భారతీయులదా? అవును అయితేనే, నేను దాన్ని ఉపయోగిస్తాను. మీరు ఇది చేస్తారా?
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: మన దేశ ఉత్పత్తుల పట్ల మనమే గర్వపడకపోతే, ఈ ప్రపంచం ఎప్పుడైనా గర్వపడుతుందా?
విద్యార్థి: లేదు సార్!
ప్రధానమంత్రి: ఉదాహరణకు, మనం ఎప్పుడైనా ఆలస్యంగా వెళ్తే ఏమని చెబుతాం? “ఇది ఇండియన్ టైమ్” అంటాం. మనం అలా అనడం లేదా?
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: అంటే ఆలస్యం చేసింది మనం, కార్యక్రమాన్ని ఆలస్యంగా మొదలుపెట్టింది మనం, కానీ నింద ఎవరి మీద వేస్తున్నాం?
విద్యార్థి: భారతదేశం మీద.
ప్రధానమంత్రి: భారతదేశం మీద. ఇక రెండో విషయం – మన బాధ్యతలను నెరవేర్చడం. మొదట మీ జీవనశైలిని మార్చుకోండి. అది పరిశుభ్రతతో ప్రారంభం కావాలి. మనం ఎక్కడా చెత్త వేయకూడదు. ఇతర దేశాల ఫోటోలు చూసినప్పుడు అవి చాలా శుభ్రంగా కనిపిస్తాయి కదా.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: ఆ దేశాలు ఎందుకు శుభ్రంగా ఉన్నాయి? పారిశుద్ధ్య కార్మికుల వల్లేనా లేక ప్రజలు అక్కడ చెత్త వేయకపోవడం వల్లేనా?
విద్యార్థి: ప్రజలు చెత్త వేయకపోవడం వల్లే సార్!
ప్రధానమంత్రి: కచ్చితంగా. మనం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనుకుంటే, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి: “నేను ఎక్కడా చెత్త వేయను.” ఇంటి లోపలైనా, బయటైనా, పరిసరాల్లో అయినా. పరిశుభ్రత విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదు. ఎవరైనా చెత్త వేస్తే వారితో గొడవ పడకండి. మీరే స్వయంగా దాన్ని తీసి డస్ట్‌బిన్‌లో వేయండి. మిమ్మల్ని చూసి వారు సిగ్గుపడతారు.
విద్యార్థి: అవును సార్!
విద్యార్థి: “నేను వేసిన చెత్తను ఆయన తీశారు” అని వారు తప్పకుండా ఆలోచిస్తారు.
ప్రధానమంత్రి: అందుకే పౌరులుగా మనం మన బాధ్యతలను నెరవేర్చాలి. ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక ప్రాథమిక బాధ్యతే.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: మనం మన బాధ్యతలను కనీసం ఈ స్థాయికైనా నెరవేరిస్తే, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారకుండా ప్రపంచంలోని ఏ శక్తీ ఆపలేదు. మీరు 35-40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, దాని ఫలితాలను మీరే ఎక్కువగా ఆస్వాదిస్తారు.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: మరి ఆ ఫలాలను అనుభవించేది మీరే అయినప్పుడు, ఆ పనిని కూడా మీరే చేయాలి కదా?
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: సాధ్యమైనంత ఎక్కువగా మీరు ఆ పని చేయాలి కదా?
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: బాగుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఒక విశాలమైన ఆకాశం, ఒక పెద్ద కాన్వాస్ ఉన్న తరానికి చెందిన వారు. ఈ రోజు మనం ఏమేం చేయగలమని మీరు అనుకుంటున్నారు?
విద్యార్థి: సార్, ఈ రోజుల్లో అంతా కృత్రిమ మేధ గురించే చర్చ జరుగుతోంది. ఏఐ రంగంలో చాలా మార్పులు జరుగుతున్నాయి.
ప్రధానమంత్రి: చూడండి, మీరు చాలా అదృష్టవంతులు. మా తరానికి లేని సాంకేతిక అవకాశాలు ఇప్పుడు మీకు ఉన్నాయి. కానీ దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకునే విజ్ఞతను మనం పెంపొందించుకోవాలి. అనేది మీ సామర్థ్యాన్ని పెంచేలా ఉండాలి. ఏఐని ఎలా ఉపయోగించాలి? ఉదాహరణకు, ఒక పద్ధతి ఏమిటంటే, ఏఐని “ఈ జీవిత చరిత్రలోని ముఖ్య అంశాలను నాకు ఇవ్వు” అని అడగడం. ఏఐమీకు పది పాయింట్లు ఇస్తుంది, మీకు జ్ఞానం లభించిందని మీరు అనుకుంటారు. మీ స్నేహితుల దగ్గర గొప్పలు చెప్పుకుంటారు. కానీ దీనివల్ల మీకు నిజంగా ప్రయోజనం కలిగిందా? లేదు. అదే మీరు ఏఐని – “నా వయస్సు ఇది, నాకు ఈ సబ్జెక్టులపై ఆసక్తి ఉంది. నేను చదవాల్సిన పది మంచి జీవిత చరిత్రలను సూచించు” అని అడగండి. ఇలా అడిగితే ఏఐ వాటిని మీ కోసం వెతుకుతుంది. మీరు మార్కెట్‌కు వెళ్లి, ఆ పుస్తకాలను కొని చదువుతారు. అప్పుడు ఏఐ మీకు నిజంగా సహాయం చేసినట్లు లెక్క.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: అప్పుడు మీ వ్యక్తిత్వం వికసిస్తుంది.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: మీకు ప్రయోజనం చేకూరుతుంది.
విద్యార్థి: అవును సార్!
విద్యార్థి: ఆయన ఏఐ గురించి చెప్పింది నాకు బాగా నచ్చింది. ఏఐ సహాయకారిగా ఉంటుంది కానీ, అది నేరుగా మనల్ని లక్ష్యానికి చేర్చలేదని ఆయన చెప్పారు. మనం దాన్ని తెలివిగా ఉపయోగించాలి. నేను కూడా సాంకేతికతకు సంబంధించిన యాప్‌లను తయారు చేయడానికి దాన్ని ఉపయోగిస్తాను. ఏఐ అందరికీ నిజంగా ఉపయోగపడే రీతిలో ఉండాలని ఆయన చెప్పడం నాకు నచ్చింది.
విద్యార్థి: సార్, నేను మీ కోసం వేణువు వాయించాలనుకుంటున్నాను. నేను వేణువుపై కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నాను. ఈ రోజు ఒక సంస్కృత రచనను వాయిస్తాను.
ప్రధానమంత్రి: తప్పకుండా వాయించు!
ప్రధానమంత్రి: వాహ్! చాలా బాగుంది. మీ అందరికీ చాలా ధన్యవాదాలు!
విద్యార్థి: సార్, నేను మీ కోసం ఒక స్కెచ్ వేశాను. దయచేసి నేను దాన్ని మీకు చూపించవచ్చా?
ప్రధానమంత్రి: ఓ! ఎక్కడ ఉంది అది?
విద్యార్థి: సార్, నేను దీన్ని మీ కోసమే తయారు చేశాను.
ప్రధానమంత్రి: ఏం చేశావు తల్లి?
విద్యార్థి: సార్, నేను చేతితో పుష్పగుచ్ఛాన్ని తయారు చేశాను.
ప్రధానమంత్రి: చాలా బాగుంది!
విద్యార్థి: ఇది ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల సంప్రదాయం. బసంత్ పంచమి రోజున, మేము ఉదయాన్నే నిద్రలేచి, పువ్వులు కోసి, ప్రజల ఇళ్ల వద్ద ఉంచుతాం.
విద్యార్థి: ఇది త్రిపుర ప్రత్యేకత
ప్రధానమంత్రి: త్రిపుర సుందరి!
విద్యార్థి: ఇది కొబ్బరి చిప్పతో తయారు చేసింది.
విద్యార్థి: సార్, ఇది అస్సాం టీ…
ప్రధానమంత్రి: వాహ్! టీ ప్రేమికుడి కోసం టీ అన్నమాట!
విద్యార్థి: సార్, ఇది ఆర్గానిక్ టీ.
ప్రధానమంత్రి: ఆర్గానిక్ టీ! నువ్వు చాలా మంచి కవితలు రాస్తున్నావు. నిరంతరం రాస్తూనే ఉండు!
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: ఇక్కడ అస్సాం ‘గమోచా‘ కూడా ఉంది. చాలా బాగుంది! మీ అందరికీ చాలా ధన్యవాదాలు, శుభాకాంక్షలు!
విద్యార్థులు: ధన్యవాదాలు సార్! బై సార్! బై!
ప్రధానమంత్రి: అందరికీ ధన్యవాదాలు!
విద్యార్థులు: ధన్యవాదాలు సార్!
ప్రధానమంత్రి: “పరీక్షా పే చర్చ“ను దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని చాలా మంది విద్యార్థులు నాకు సూచనలు పంపారు. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో మీరు సరిగ్గా అదే చూస్తారు. ఒకే కుటుంబంలో ఉన్న తోబుట్టువులలో ఎవరికైనా మంచి గుణం ఉంటే, మనం దాని నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. గొప్పవారు కావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ అప్పటికే గొప్పవారైన వారితో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. జీవితంలో, సమాజంలో విద్య ఎంతో అవసరం. కానీ జీవితంలో ఆటలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీలో ఎవరైనా ఏదైనా పంచుకోవాలన్నా, మీ మనసులోని మాట చెప్పాలన్నా, వినడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఎవరు ప్రారంభిస్తారు?
****
A wonderful discussion with students on approaching exams with confidence and positivity. Do watch this very special episode of Pariksha Pe Charcha!#ParikshaPeCharcha26 https://t.co/k7IN79qvek
— Narendra Modi (@narendramodi) February 6, 2026