పిఎంఇండియా
భారత్ శాశ్వత నాగరికతా జ్ఞానాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావిస్తూ ఆరోగ్యం, దీర్ఘాయుష్షులతో పాటు సేవలను అందించాలన్నదే దేశ ప్రజల సామూహిక ఆకాంక్ష అని చాటిచెప్తున్న ఒక ప్రార్థన శ్లోకాన్ని ఉదాహరించారు.
ఈ ప్రార్థన భారత సాంస్కృతిక వారసత్వ భావనను చాటి చెబుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దీన్లో భూమి పట్ల ఆరాధన, సంక్షేమం పట్ల నిబద్ధతలతో పాటు, సేవ చేయడానికి అంకితం కావడం అనే అంశాలు దేశ ప్రగతికి పునాదులుగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఈ కింది సంస్కృత శ్లోకాన్ని ఉదాహరించారు:
‘‘ఉపస్థాస్తే అనమీవా అయక్ష్మా అస్మభ్యం సన్తు పృథివి ప్రసూతా:
దీర్ఘం న ఆయు: ప్రతిబుధ్యమానా వయం తుభ్యం బలిహృత: స్యామ్’’.
उपस्थास्ते अनमीवा अयक्ष्मा अस्मभ्यं सन्तु पृथिवि प्रसूताः।
— Narendra Modi (@narendramodi) February 6, 2026
दीर्घं न आयुः प्रतिबुध्यमाना वयं तुभ्यं बलिहृतः स्याम॥ pic.twitter.com/VBPacr8tbj