Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్లమెంటులో జన్‌ విశ్వాస్‌ (నిబంధనల సవరణ) బిల్లు-2026 ఆమోదం పొందటం పట్ల ప్రధానమంత్రి హర్షం


పార్లమెంటులో జన్‌ విశ్వాస్‌ (నిబంధనల సవరణబిల్లు-2026 ఆమోదం పొందటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారుపౌరులను సాధికారత వైపు నడిపించటంలోవిశ్వాసంతో సాగే పాలనా వ్యవస్థను బలోపేతం చేయటంలో ఈ బిల్లు కీలక ముందడుగని పేర్కొన్నారుపాతబడిన చట్టాలునిబంధనల తొలగింపుతో పాటు పలు ఉల్లంఘనలను నేరరహితం చేయటం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించేలా చేయటంకోర్టులో కేసుల భారాన్ని తగ్గించటమే ఈ బిల్లు లక్ష్యం.

ఈ బిల్లు రూపకల్పనలో అనుసరించిన సంప్రదింపుల విధానాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారుబిల్లు ముసాయిదా ప్రక్రియలో విలువైన సూచనలు అందించిన వారినిపార్లమెంటులో బిల్లుకు మద్దతు తెలిపిన వారందరినీ అభినందించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

” ‘జీవన సౌలభ్యం’, ‘సులభతర వ్యాపారానికి‘ భారీ ఊతం..

పార్లమెంటులో జన్‌ విశ్వాస్‌ (నిబంధనల సవరణబిల్లు-2026 ఆమోదం పొందటం హర్షించదగిన విషయంపౌరులను సాధికారత వైపు నడిపించేవిశ్వాసంతో సాగే పాలనా వ్యవస్థను ఈ బిల్లు బలోపేతం చేస్తుందికాలం చెల్లిన నిబంధనలను తొలగించటంచిన్నపాటి ఉల్లంఘనలను నేరరహితం చేయటం ద్వారా వేగవంతమైన కేసుల పరిష్కారంతో పాటు కోర్టులో కేసుల భారాన్ని తగ్గిస్తుంది.

ఈ బిల్లును రూపొందించటంలో అనుసరించిన సంప్రదింపుల విధానం అభినందనీయం.

ఈ బిల్లు రూపకల్పనలో అమూల్యమైన సూచనలను అందించిన వారికిపార్లమెంటులో మద్దతు తెలిపిన వారికి అభినందనలు“.