పిఎంఇండియా
పశ్చిమబంగ దివస్ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
సాహిత్యం, సంగీతం, కళలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం, వాణిజ్యం, సామాజిక సంస్కరణలు, ఇతర రంగాల్లో తనదైన సహకారాన్ని అందిస్తూ భారతదేశ చరిత్రను ఎంతగానో ప్రభావితం చేసిన రాష్ట్రాన్ని ఈ రోజు మనం స్మరించుకుంటున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ జాతీయ చైతన్యాన్ని పశ్చిమ బెంగాల్ అనేక మార్గాల్లో సుసంపన్నం చేసిందని ఆయన గుర్తుచేశారు.
పశ్చిమ బెంగాల్ చరిత్రలో జూన్ 20వ తేదీకి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, మన దేశంలో అంతర్భాగంగా కొనసాగేలా నిర్ధారించిన రోజు ఇదేనని చెప్పారు. ఈ విషయంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోషించిన పాత్ర అమూల్యమైనదని కొనియాడారు. ఈ సంవత్సరం (2026) మనం డాక్టర్ ముఖర్జీ 125వ జయంతిని కూడా జరుపుకుంటున్నామని తెలిపారు.
బెంగాల్ ప్రజల కలలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ ప్రగతి సాధించాలని, అక్కడ ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘పశ్చిమబంగ దివస్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని నా సోదరసోదరీలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
సాహిత్యం, సంగీతం, కళలు, ఆధ్యాత్మికత, విజ్ఞానశాస్త్రం, వాణిజ్యం, సామాజిక సంస్కరణలు వంటి విభిన్న రంగాల్లో తన అద్భుతమైన సహకారం ద్వారా దేశ చరిత్రను లోతుగా మలచిన ఒక రాష్ట్రాన్ని ఈ రోజు మనం స్మరించుకుంటాం. పశ్చిమ బెంగాల్ సమయానుకూలంగా దేశ జాతీయ స్పృహను అనేక విధాలుగా బలోపేతం చేసింది.
నేడు (జూన్ 20) పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. పశ్చిమ బెంగాల్ భారత్‌లో అంతర్భాగంగా ఉండేలా చేసిన రోజు ఇది. ఇందులో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోషించిన పాత్ర అత్యంత అమూల్యమైనది. ఈ సంవత్సరం మనం డాక్టర్ ముఖర్జీ 125వ జయంతిని కూడా జరుపుకోబోతున్నాం.
ప్రజల కలలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. పశ్చిమ బెంగాల్ ప్రగతి కోసం, అక్కడి ప్రజల శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను’’.
***
Warm greetings to my sisters and brothers of West Bengal on the occasion of Paschimbanga Divas.
— Narendra Modi (@narendramodi) June 20, 2026
This day celebrates a state that has profoundly shaped India's history through its contributions to diverse areas be it literature, music, art, spirituality, science, trade and…
পশ্চিমবঙ্গ দিবস উপলক্ষে পশ্চিমবঙ্গের আমার বোন ও ভাইদের জানাই আন্তরিক শুভেচ্ছা।
— Narendra Modi (@narendramodi) June 20, 2026
এই দিনটি এমন এক রাজ্যকে উদযাপন করে যা সাহিত্য, সঙ্গীত, শিল্প, আধ্যাত্মিকতা, বিজ্ঞান, বাণিজ্য ও ব্যবসা, সমাজ সংস্কার এবং আরও অনেক বৈচিত্র্যময় ক্ষেত্রে তার অবদানের মাধ্যমে ভারতের ইতিহাসকে রূপদান…