పిఎంఇండియా
పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ సి.వి. ఆనంద బోస్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వినీ వైష్ణవ్ గారు, శంతను ఠాకూర్ గారు, సుకాంత మజుందార్ గారు, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారు, పార్లమెంటులో నా సహచరులు షమిక్ భట్టాచార్య గారు, ఖగెన్ ముర్ము గారు, కార్తీక్ చంద్ర పాల్ గారు, ఇతర ప్రతినిధులూ, సోదరీ సోదరులారా.
పశ్చిమ బెంగాల్ పురోగతిని వేగవంతం చేయాలనే ప్రచారం మాల్దా నుంచి మరింత ఊపందుకుంది. కొద్దిసేపటి కిందటే పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల ప్రారంభాలు, శంకుస్థాపనలు చేసుకున్నాం. పశ్చిమ బెంగాల్‌కు కొత్త రైలు సేవలు కానుకగా అందాయి. ఈ ప్రాజెక్టులు ఇక్కడి ప్రజలకు ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. వ్యాపార వాణిజ్యాలనూ సులభతరం చేస్తాయి. రైలు నిర్వహణ కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలు బెంగాల్ యువతకు కొత్త అవకాశాలను అందిస్తాయి.
మిత్రులారా,
ఈ పవిత్ర భూమి బెంగాల్ నుంచి భారతీయ రైల్వేల ఆధునికీకరణ దిశగా ఈరోజు మరో ప్రధాన ముందడుగు పడింది. ఈ రోజు దేశంలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఈ కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు మన ప్రజలకు సుదీర్ఘ ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా, గొప్పగా, చిరస్మరణీయంగా చేస్తాయి. “అభివృద్ధి చెందిన భారత్”లో రైళ్లు ఎలా ఉండాలి? ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి కిందటే మాల్దా స్టేషన్‌లో నేను కొంతమంది ప్రయాణికులతో మాట్లాడాను. ఈ రైలులో కూర్చోవడం వారికి అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చిందని వారంతా అంటున్నారు. ఒకప్పుడు మనం విదేశీ రైళ్ల ఫోటోలు, వీడియోలను చూసేవాళ్ళం. అలాంటి రైళ్లు మన దేశంలో ఉంటే బాగుండు అని కోరుకునే వాళ్లం. ఇప్పుడు ఆ కల వాస్తవంగా మారడాన్ని మనం చూస్తున్నాం. భారతీయ రైల్వేలో జరుగుతున్న విప్లవం గురించి ప్రపంచానికి తెలియజేయడానికి విదేశీయులూ భారత్‌లోని మెట్రోలు, మన రైళ్ల వీడియోలను తయారు చేస్తున్నారని నేను ఇటీవల గమనించాను. ఈ వందే భారత్ రైలు పూర్తిగా ‘మేడ్ ఇన్ ఇండియా’. మన భారతీయులు చెమట చిందించి దీనిని తయారు చేశారు. దేశంలోని ఈ మొదటి వందే భారత్ స్లీపర్ రైలు కాళి మాత భూమిని మన కామాఖ్య భూమితో కలుపుతుంది. రాబోయే కాలంలో ఈ ఆధునిక రైలు దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఈ ఆధునిక స్లీపర్ రైలు ప్రారంభం సందర్భంలో బెంగాల్, అస్సాంతో పాటు మొత్తం దేశాన్నీ నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
ప్రస్తుతం భారతీయ రైల్వే పరివర్తన దశలో ఉంది. రైల్వే మార్గాల విద్యుదీకరణ వేగంగా సాగుతోంది. రైల్వే స్టేషన్లు ఆధునికంగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌తో సహా దేశవ్యాప్తంగా 150కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. దీంతో పాటు ఆధునిక, హై-స్పీడ్ రైళ్ల పూర్తి నెట్‌వర్క్ నిర్మితమవుతోంది. అయితే దీని అతిపెద్ద లబ్ధిదారులు బెంగాల్‌లోని పేద, మధ్యతరగతి కుటుంబాలు.
మిత్రులారా,
బెంగాల్‌కు ఈ రోజు మరో నాలుగు ఆధునిక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లూ వచ్చాయి. అవి న్యూ జల్పైగురి – నాగర్‌కోయిల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, న్యూ జల్పైగురి – తిరుచిరాపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, అలీపూర్‌దువార్ – బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, అలీపూర్‌దువార్ – ముంబయి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్. ఇవి దక్షిణ, పశ్చిమ భారత్‌తో బెంగాల్, ముఖ్యంగా ఉత్తర బెంగాల్ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బెంగాల్, తూర్పు భారతాన్ని సందర్శించడానికి వచ్చే ప్రయాణికులకు అంటే… గంగా సాగర్, దక్షిణేశ్వర్, కాళీఘాట్ దర్శనం కోసం వచ్చేవారికి ఇది సౌకర్యంగా ఉంటుంది. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడి నుంచి తమిళనాడు, మహారాష్ట్రకు ప్రయాణించే వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి.
మిత్రులారా,
భారతీయ రైల్వేలు ఆధునికంగా మారుతూనే స్వయం-సమృద్ధిని సాధిస్తున్నాయి. భారత రైలింజన్లు, రైలు కోచ్‌లు, మెట్రో కోచ్‌లు భారత సాంకేతికతకు గుర్తింపుగా మారుతున్నాయి. అమెరికా, యూరప్ కంటే ఎక్కువ రైలింజన్లను ఈ రోజు మనం తయారు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ప్యాసింజర్ రైళ్లు, మెట్రో రైలు కోచ్‌లనూ ఎగుమతి చేస్తున్నాం. ఇవన్నీ మన ఆర్థిక వ్యవస్థకు గణనీయ ప్రయోజనం చేకూరుస్తాయి. మన యువతకు ఉపాధినీ అందిస్తాయి.
మిత్రులారా,
భారత్ అనుసంధానం మా ప్రాధాన్యం. దూరాలను తగ్గించడం మా లక్ష్యం. ఇది నేటి కార్యక్రమంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. మరోసారి ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా శుభాకాంక్షలు. చాలా ధన్యవాదాలు. సమీపంలోని చాలా పెద్ద కార్యక్రమానికి నేను హాజరు కావాల్సి ఉంది. అక్కడ చాలా మంది వేచి ఉన్నారు. నేను ఇక్కడ ప్రస్తావించని విషయాలను అక్కడ వివరంగా వివరిస్తాను. మీడియా ఆ ప్రసంగంపై ఎక్కువగా దృష్టి సారిస్తుంది. చాలా ధన్యవాదాలు.
***
Delighted to flag off India’s first Vande Bharat sleeper train from Malda. Several Amrit Bharat train services are also being introduced to boost connectivity.
— Narendra Modi (@narendramodi) January 17, 2026
https://t.co/rh7OaIeTvR
आज भारतीय रेल के आधुनिकीकरण की तरफ एक और बड़ा कदम उठाया गया है।
— PMO India (@PMOIndia) January 17, 2026
आज से भारत में वंदे भारत स्लीपर ट्रेनों की शुरुआत हो रही है: PM @narendramodi
देश की ये पहली वंदे भारत स्लीपर ट्रेन... मां काली की धरती को मां कामाख्या की भूमि को जोड़ रही है।
— PMO India (@PMOIndia) January 17, 2026
आने वाले समय में पूरे देश में, इस आधुनिक ट्रेन का विस्तार होगा।
मैं बंगाल को, असम को, पूरे देश को इस आधुनिक स्लीपर ट्रेन के लिए बधाई देता हूं: PM @narendramodi
आज बंगाल को चार और आधुनिक, अमृत भारत एक्सप्रेस ट्रेनें मिली हैं।
— PMO India (@PMOIndia) January 17, 2026
न्यू जलपाईगुड़ी- नागरकोइल अमृत भारत एक्सप्रेस...
न्यू जलपाईगुड़ी - तिरुच्चिरापल्ली अमृत भारत एक्सप्रेस...
अलीपुर द्वार - बेंगलुरु अमृत भारत एक्सप्रेस...
अलीपुर द्वार - मुंबई अमृत भारत एक्सप्रेस...
इससे बंगाल और…