Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పాకిస్థాన్ ప్ర‌ధానితో మాట్లాడిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ : భూకంపంలో ప్రాణన‌ష్టంపై సంతాపం


భార‌త్ త‌ర‌పున పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని వెల్ల‌డి

పాకిస్థాన్ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌వాజ్ ష‌రీఫ్‌ తో భార‌త ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు ఫోన్‌లో మాట్లాడారు. భూకంపంలో ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌డంపై ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పాకిస్థాన్‌కు భార‌త్ త‌ర‌పున పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని పేర్కొన్నారు. ”పాకిస్థాన్ ప్ర‌ధాన‌మంత్రి న‌వాజ్ ష‌రీఫ్‌తో మాట్లాడాను. భూకంపంలో ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌డంపై సంతాపం తెలిపాను. భార‌త్ త‌ర‌ఫున అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని హామీ ఇచ్చాను. గీత క్షేమంగా భార‌త్ కు చేరుకునేందుకు కృషి చేసినందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌వాజ్ ష‌రీఫ్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాను” అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.