Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారాదీప్ శుద్ధి క‌ర్మాగారాన్ని దేశానికి అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

పారాదీప్ శుద్ధి క‌ర్మాగారాన్ని దేశానికి అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

పారాదీప్ శుద్ధి క‌ర్మాగారాన్ని దేశానికి అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఒడిశా లోని అత్యంత ఆధునిక‌మైన‌ పారాదీప్ శుద్ధి క‌ర్మాగారాన్ని దేశానికి అంకితం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఒక పెద్ద స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు. అభివృద్ధికి సంబంధించిన ఆధికారిక కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లు ఇంత‌ పెద్ద సంఖ్య‌లో పాలు పంచుకొన్నందుకు ప్ర‌ధాన మంత్రి అభినంద‌న‌లు తెలిపారు.

ఒడిశా పూర్వ ముఖ్య‌మంత్రి శ్రీ బిజూ ప‌ట్నాయ‌క్ ను ప్ర‌ధాన మంత్రి గుర్తు చేసుకుంటూ, పారాదీప్ ఇప్పుడిక “వికాస్ ద్వీప్” – ఒడిశా ప్ర‌జ‌ల‌కు సంబంధించినంత‌వ‌ర‌కు అభివృద్ధి ద్వీపం – గా అవుతుంద‌న్నారు. ఉద్యోగ అవ‌కాశాల నుంచి యువ‌త ల‌బ్ధి పొందుతార‌ని, అంతే కాకుండా దేశ‌ వ్యాప్తంగా వంట చేయ‌డానికి వంట చెర‌కు పైన ఆధార‌ప‌డుతున్న‌పేద మ‌హిళ‌లకు ఎల్ పి జి అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపారు.

‘ముద్ర‌’, ‘స్టార్ట‌ప్ ఇండియా’ల వంటి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు భార‌త‌దేశ యువ‌తీయువ‌కుల‌కు ల‌బ్ధిని చేకూర్చుతున్నాయ‌ని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

ప్రారంభ కార్య‌క్ర‌మ స్థ‌లానికి వ‌చ్చే క‌న్నా ముందు ప్ర‌ధాన మంత్రి దేశీయ సాంకేతిక ప‌రిజ్ఞానంతో నిర్మించిన ఇండ్ మ్యాక్స్ యూనిటును, మెయిన్ కంట్రోల్ రూమ్ ను సంద‌ర్శించారు. క‌ర్మాగారం లోని ఇండ్ మ్యాక్స్ నిర్మాణ సామ‌ర్థ్యాలు మేకిన్ ఇండియా కార్య‌క్ర‌మానికి ఒక నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

***