Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారిశ్రామిక, ఔత్సాహిక పారిశ్రామిక, తయారీ రంగాలకు అనువైన వాతావరణం ‘వికసిత్ భారత్‌’కు తోడ్పడుతుందన్న వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


భారతదేశంలో పరిశ్రమ, ఔత్సాహిక పారిశ్రామికత్వం, తయారీ రంగాలకు అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల నాయకత్వం తోడ్పడిందంటూ శ్రీ ఉదయ్ కోటక్ ఓ వ్యాసాన్ని రాశారు. ఆ వ్యాసాన్ని  ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఇవాళ పంచుకున్నారు.

సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన, తయారీ రంగం, సెమీకండక్టర్లు, రక్షణ, డీప్ టెక్ రంగాల్లో అమలుచేస్తున్న కొత్త కొత్త కార్యక్రమాలు.. ఇవన్నీ కలిసి సరికొత్త పారిశ్రామిక సామర్థ్యాలను ఎలా ఆవిష్కరిస్తోందీ శ్రీ కోటక్ ప్రస్తావించారు. మరో వైపు, భారతీయ వాణిజ్య సంస్థలు కార్యకలాపాలను విస్తరించుకొంటూ ప్రపంచ దేశాలతో పోటీపడేటట్లు వికసిత్ భారత్ దార్శనికత ఆయా సంస్థలకు ప్రోత్సాహాన్ని అందిస్తోందని కూడా ఆయన వివరించారు.

ప్రధానమంత్రి కార్యాలయం  ఒక సందేశాన్ని  సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  పొందుపరుస్తూ:

‘‘పరిశ్రమ, ఔత్సాహిక పారిశ్రామికత్వం, తయారీ రంగాలకు సంబంధించినంత వరకు దేశంలో అనుకూల వాతావరణం నెలకొనేటట్లు గత 25 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నాయకత్వం సాయపడిందని శ్రీ ఉదయ్ కోటక్ రాశారు. సంస్కరణలు, మౌలిక సదుపాయాలు, తయారీలో కొత్త కార్యక్రమాలు, సెమీకండక్టర్లు, రక్షణ, డీప్ టెక్నాలజీ.. ఇవన్నీ కలిసి, పారిశ్రామిక రంగంలో సరికొత్త సామర్థ్యాలను వెలికితీస్తున్నాయి.

భారతీయ వాణిజ్య సంస్థలు కార్యకలాపాలను విస్తరించుకుంటూ, ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు వికసిత్ భారత్ ఆయా సంస్థలకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. భారత పారిశ్రామిక అభివృద్ధిలో తదుపరి దశ ఎలా ఉండేదీ వివరించిన లోతైన ఆలోచనాపూర్వక రచన’’ అని పేర్కొంది.

***