Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్లమెంట్ బడ్జెట్ స‌మావేశాల ఆరంభ వేళ ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


అంద‌రికీ ఇవే అభినంద‌న‌ లు.

ఇవి 2020వ సంవ‌త్స‌రం లో తొలి స‌మావేశాలు; అంతేకాదు, ఈ ద‌శాబ్దం లోని ప్ర‌థ‌మ స‌మావేశాలు కూడాను. ఈ స‌మావేశాల ను ఈ ద‌శాబ్దం లో ఒక ఉజ్వ‌ల భ‌విత కోసం గ‌ట్టి పునాది లా మలచుకోవడానికి మ‌నం తప్పక శ్ర‌మించాలి. ఈ రోజు న మాన్య రాష్ట్రప‌తి పార్ల‌మెంటు ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. రేప‌టి రోజు న ఈ సంవ‌త్స‌ర‌పు బ‌డ్జెటు ను స‌మ‌ర్పించ‌డం జ‌రుగుతుంది. ఈ స‌మావేశాలను ఆర్థిక అంశాల పై వీలైనంత వ‌ర‌కు గ‌రిష్ఠ స్థాయి లో శ్ర‌ద్ధ వహించేటట్టు, అలాగే ప్ర‌పంచవ్యాప్తం గా ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక స్థితిగ‌తుల నుండి భారతదేశం ఏ విధం గా ప్ర‌యోజ‌నం పొందగలదన్న అంశం పైన కూడా శ్ర‌ద్ధ వహించేటట్టుగా చూడండి. భార‌త‌దేశం త‌న ఆర్థిక కార్య‌క‌లాపాల ను బ‌లోపేతం చేసుకొని, ప్ర‌పంచ స్థితిగ‌తుల నుండి గ‌రిష్ఠ లాభాల ను పొందవలసిందే. మా ప్ర‌భుత్వం అణ‌గారిన వ‌ర్గాలు, దోపిడి బారిన పడ్డ, వంచ‌న బారిన ప‌డ్డ త‌ర‌గ‌తులు మ‌రియు మ‌హిళ‌ ల యొక్క సాధికారిత తో మమేకమైంది. ఈ వ‌ర్గాల ప‌ట్ల మేము ఈ ద‌శాబ్దం లో కూడా శ్ర‌ద్ధ తీసుకొంటాము. ప్ర‌జ‌ల సాధికారిత‌ పై, ఇంకా ఆర్థిక అంశాల పై చ‌ట్టస‌భ‌ లు రెంటిలో మ‌రింత విస్తృత‌మైన‌టువంటి, మెరుగైన‌టువంటి చ‌ర్చ జ‌ర‌గాల‌ని నేను కోరుకొంటున్నాను. రోజులు గ‌డిచే కొద్దీ మ‌న చ‌ర్చ లో నాణ్య‌త మ‌రింత పెరుగుతూ పోవాలి. ఈ న‌మ్మ‌కం తో మీ అంద‌రికీ నా ధ‌న్య‌వాదాలు. నమ‌స్కారం.