Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిఎస్‌సి రెఝీమ్ లో భాగంగా ఉన్న నామినేష‌న్ అండ్ రిలింక్విశ్ డ్ డిస్క‌వ‌రీస్ లో ఒఐఎల్, ఒఎన్‌జిసి లకు చెందిన 60 అన్- మానిటైజ్ డ్ డిస్క‌వ‌రీ ల‌కు సంబంధించిన డిస్క‌వ‌ర్డ్ స్మాల్ ఫీల్డ్‌ స్ (డిఎస్ఎఫ్‌) పాలిసీ బిడ్ రౌండ్-11 కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


14.10.2015 నాడు నోటిఫై చేసిన‌టువంటి డిస్క‌వ‌ర్డ్ స్మాల్ ఫీల్డ్ పాలిసీ ని గుర్చించినటువంటి 60 డిస్క‌వ‌ర్డ్ స్మాల్ ఫీల్డ్స్ / అన్‌- మానిటైజ్ డిస్క‌వ‌రీస్ కు కూడా విస్తరించేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న సమావేశమైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. వీటిని డిస్క‌వ‌ర్డ్ స్మాల్ ఫీల్డ్ పాలిసీ యొక్క రెండో విడ‌త బిడ్ లో భాగంగా ఆఫర్ చేయనున్నారు. వీటిలో, 22 క్షేత్రాలు / డిస్కవరీలు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) లిమిటెడ్ కు చెందిన‌వి, ఇంకొక 5 క్షేత్రాలు / డిస్కవరీలు ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఒఐఎల్‌)కు చెందిన‌వి కాగా మరో 12 క్షేత్రాలు / డిస్కవరీలు నూత‌న అన్వేష‌ణ మ‌రియు లైసెన్సుల జారీ విధానం (ఎన్ఇఎల్‌పి) బ్లాకుల తాలూకు విడిచిపెట్ట‌ిన‌టువంటి క్షేత్రాలు/డిస్కవరీలు. వీటికి తోడు, 21 క్షేత్రాలు / డిస్కవరీలేమో డిఎస్ఎఫ్ ఒక‌టో విడ‌త బిడ్ లో ఆఫర్ చేసినా పెట్టుబ‌డిదారుల వ‌ద్ద నుండి త‌గినంత ప్ర‌తిస్పంద‌న ల‌భించ‌ని కార‌ణంగా తుది నిర్ణ‌యం చేసేందుకు వీలు లేకపోయిన‌టువంటివి.

వివరాలు:

• ఈ డిస్కవరీ లలో చ‌మురు మరియు ఆయిల్ ఈక్వివలెంట్ గ్యాస్ కలుపుకొని దాదాపు 194.65 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల (ఎమ్ఎమ్‌టి) మేరకు ఉండివుండ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేయ‌డ‌మైంది.

• ఈ క్షేత్రాల‌ను అభివృద్ధిప‌ర‌చి త్వ‌రిత‌ గ‌తిన మానిటైజ్ చేయ‌డం జరుగుతుంది. తద్వారా చ‌మురు మ‌రియు గ్యాస్ ఉత్ప‌త్తిని అధికం చేయడానికి, దేశంలో శ‌క్తి సంబంధ భ‌ద్ర‌త‌ను పెంపొందించ‌డానికి బాట వేయడం జరుగుతుంది.

• ఈ క్షేత్రాల‌లోకి పెట్టుబ‌డులు ప్ర‌వ‌హిస్తే ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఇంకా ఇత‌ర‌త్రానూ 88 వేలకు పైగా ఉద్యోగాల క‌ల్ప‌న‌కు దారి ఏర్పడుతుంద‌ని అంచనా వేయడమైంది.

• ఈ పాలిసీని భ‌విష్య‌త్తులో నిర్వ‌హించే బిడ్డింగుకు కూడా విస్త‌రింపచేశారు. డిస్క‌వ‌ర్డ్ స్మాల్ ఫీల్డ్‌ స్ రెండో విడ‌త బిడ్ యొక్క న‌మూనా ఆదాయ పంప‌కం కాంట్రాక్టును, నోటీస్ ఇన్‌వైటింగ్ ఆఫర్ (ఎన్ఐఒ)ను, ఇంకా ఇత‌ర ద‌స్తావేజులను పెట్రోలియ‌మ్ & స‌హ‌జ వాయువు కార్య‌ద‌ర్శి, వ్య‌య కార్య‌ద‌ర్శి తో పాటు లా సెక్ర‌ట‌రీ తో కూడిన కార్య‌ద‌ర్శుల సాధికార సంఘం (ఇసిఎస్‌) ఖ‌రారు చేసి ఆమోదిస్తుంది.

• స‌ద‌రు కాంట్రాక్టు యొక్క నిర్ణయాన్ని ఇసిఎస్ చేసే సిఫారసుల ఆధారంగా పెట్రోలియ‌మ్ & స‌హ‌జ‌ వాయు శాఖ మంత్రి తో పాటు ఆర్థిక మంత్రి ఆమోదిస్తారు.