Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పి ఆర్ ఎ జి ఎ టి ఐ (ప్రగతి) ద్వారా ప్రధాన మంత్రి సంభాషణ

పి ఆర్ ఎ జి ఎ టి ఐ (ప్రగతి) ద్వారా ప్రధాన మంత్రి సంభాషణ


ఐ సి టి ఆధారితమైన మల్టి మోడల్ ప్లాట్ ఫాం ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేషన్ (పి ఆర్ ఎ జి ఎ టి ఐ.. ప్రగతి) మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంబంధిత అధికార వర్గాలతో సమీక్ష స‌మావేశాన్ని నిర్వహించారు. ఆయన అధ్యక్షతన ఈ తరహా సమీక్ష సమావేశం జరగడం ఇప్పటికి ఇది పదకొండో సారి.

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కారం ప్రక్రియలలో పురోగతిని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. ఈ విషయంలో పనులను మరింత వేగంగా పూర్తి చేయవలసిందిగా అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం అనేది ప్రజాస్వామ్యంలోని అతి పెద్ద రూపాలలో ఒకటి అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మినహాయింపులనదగ్గవి తప్పితే ఫిర్యాదులను 60 రోజుల లోపల పరిష్కరించివేసే విధంగా రానున్న నెల రోజులలో నిర్దిష్ట చొరవలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు కలగజేసుకోవాలి అనేది తన ఆదేశమని ఆయన పునరుద్ఘాటించారు.

రహదారులు, రైల్వే, విద్యుత్తు, చమురు రంగాలలో కీలకమైన మౌలిక సదుపాయాల పథకాల పనులు ఎంత వరకు వచ్చిందీ ప్రధాన మంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టులలో మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, హరియాణా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ర్ట, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్ లకు చెందిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

వ్యాపారాన్ని సులభతరంగా మార్చడంలో చోటు చేసుకొన్న పురోగతిని శ్రీ నరేంద్ర మోదీ సమీక్షిస్తూ, పెట్టుబడుల కోసం ప్రస్తుతం రాష్ట్రాలలో ఆరోగ్యదాయకమైన పురోగతి కనపడుతోందన్నారు. ఈ వేగం ఇలాగే కొనసాగేందుకు, సానుకూలమైన వాతావరణాన్ని ప్రోది చేసేందుకు మరింత ఏకోన్ముఖ ప్రయత్నాలు చేయాలని సూచించారు.

‘డిజిటల్ ఇండియా’ లో భాగంగా మిషన్ మోడ్ ప్రాజెక్టులు ఎందాకా వచ్చాయో ప్రధాన మంత్రి అడిగి తెలుసుకొన్నారు. భూమి రికార్డుల డిజిటలీకరణపై పురోగతిని గురించి పరిశీలిస్తూ, అన్ని రికార్డులను ‘ఆధార్’ తో వీలైనంత త్వరిత గతిన సమ్మిళితపరచాలని పిలుపునిచ్చారు. ‘ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన’ విజయవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించేందుకు ఇది అత్యంత అవసరమని ఆయన నొక్కి చెప్పారు.

పౌరుల సేవలను ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా అందజేసే విషయంలో పురోగతి ఏ విధంగా ఉన్నదీ ప్రధాన మంత్రి వాకబు చేశారు. దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా ఎన్నెన్ని సేవలను వాస్తవంగా ఆన్ లైన్ లో అందజేస్తున్నదీ సమగ్ర సమీక్ష జరగాలని తెలిపారు.

సామాజిక రంగంలో, వితంతు పింఛన్ ల కార్యక్రమం స్థాయి ఎలాగ ఉన్నదో, కుష్టు రోగం నిర్మూలన దిశగా నమోదవుతున్న పురోగతి ఏమిటో అనే అంశాలను కూడా ప్రధాన మంత్రి మదింపు చేశారు.

***