Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘పీటీఐ’తో ఇంటర్వ్యూలో బడ్జెట్.. సంస్కరణలు.. భారత్‌ ప్రగతి పయనంపై తన ఆలోచనలను పంచుకున్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ (పీటీఐ) వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్‌ ఆర్థిక-అభివృద్ధి పథాన్ని నిర్దేశించే విస్తృత అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ- సమ్మిళిత వృద్ధికి సారథ్యంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేయడంలో దాని పాత్ర అద్వితీయమని వివరించారు. పారదర్శకత, సామర్థ్యం, పోటీతత్వం పెంచే ప్రగతిశీల సంస్కరణల అమలుపై ప్రభుత్వ నిబద్ధతను ప్రస్ఫుటం చేస్తూ “సంస్కరణల ఎక్స్‌ప్రెస్” శరవేగంగా పయనిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో- ఈ సంవత్సరం బడ్జెట్, సంస్కరణల ఎక్స్‌ప్రెస్ వేగం, భారత్‌తో వాణిజ్యంపై ప్రపంచం ఆసక్తికిగల కారణాలు సహా అంకుర సంస్థలతోపాటు ‘ఎంఎస్‌ఎంఈ’లను మరింత ప్రోత్సహించడంలో ఎన్‌డీఏ ప్రభుత్వ కృషి తదితర విస్తృత, విభిన్న అంశాలపై నా ఆలోచనలను పంచుకున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.